logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో మురుగు కాల్వల శుభ్రత వెల్దుర్తిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు: 15వ వార్డులో కాల్వల పూడికతీత వెల్దుర్తి, మార్చి 31: వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 15వ వార్డులో పారిశుద్ధ్య పనులు మంగళవారం ముమ్మరంగా సాగాయి. వార్డులోని ప్రధాన మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను పంచాయతీ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో సిబ్బంది తొలగించారు. గత కొన్ని రోజులుగా కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో మురుగు నీరు సాఫీగా వెళ్లక, దుర్వాసన వస్తోందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన అభివృద్ధి అధికారి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని, గ్రామ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

5 hrs ago
user_S.B. CHANDRA BOSE
S.B. CHANDRA BOSE
Veldurthi, Kurnool•
5 hrs ago
b384dde9-ad36-44c3-869f-9c083c936923

వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో మురుగు కాల్వల శుభ్రత వెల్దుర్తిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు: 15వ వార్డులో కాల్వల పూడికతీత వెల్దుర్తి, మార్చి 31: వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 15వ వార్డులో పారిశుద్ధ్య పనులు మంగళవారం ముమ్మరంగా సాగాయి. వార్డులోని ప్రధాన మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను పంచాయతీ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో సిబ్బంది తొలగించారు. గత కొన్ని రోజులుగా కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో మురుగు నీరు సాఫీగా వెళ్లక, దుర్వాసన వస్తోందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన అభివృద్ధి అధికారి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని, గ్రామ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.
    1
    ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    1
    ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం  వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    1
    కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు.
అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
    user_VIJAY RAJ
    VIJAY RAJ
    Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    user_Azmath
    Azmath
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    23 hrs ago
  • Post by T.Shiva Krishna
    1
    Post by T.Shiva Krishna
    user_T.Shiva Krishna
    T.Shiva Krishna
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    14 hrs ago
  • రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.
    1
    రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది… పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు… ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది…
పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు…
ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు…
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.