Shuru
Apke Nagar Ki App…
శ్రీకాకుళం మార్కెట్లో కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు శ్రీకాకుళం మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాలు లేక ఉత్పత్తి తగ్గి, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగి, కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు తెలిపారు. ఇక్కడి మార్కెట్లో టమాటా, బెండకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, అల్లం వంటి కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో సగటు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిత్య అవసరాలలో ఒకటైన కూరగాయల ధరలు నియంత్రించాలని వారు కోరుతున్నారు.
Venkata Ramana Murthy K
శ్రీకాకుళం మార్కెట్లో కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు శ్రీకాకుళం మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాలు లేక ఉత్పత్తి తగ్గి, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగి, కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు తెలిపారు. ఇక్కడి మార్కెట్లో టమాటా, బెండకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, అల్లం వంటి కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో సగటు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిత్య అవసరాలలో ఒకటైన కూరగాయల ధరలు నియంత్రించాలని వారు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సీజన్ కాని సీజన్లో కనువిందు చేస్తూ యమ నోరూరిస్తున్న మామిడి పళ్ళు శ్రీకాకుళం నగరంలో ఫ్రూట్ మార్కెట్లో మామిడి పళ్ళు కనువిందు చేస్తున్నాయి. మ్యాంగో సీజన్ అయిపోయినా...మార్కెట్లో దండిగా మామిడి పళ్ళు లభిస్తున్నాయి. గ్రీన్ హౌస్ టెక్నీక్, ఇజ్రాయిల్ సాంకేతిక సేద్యం ద్వారా పండించిన మామిడి పళ్ళు చిత్తూరు(కుప్పం ), కర్ణాటక, కేరళ నుండి ఇక్కడి మార్కెట్కు వస్తున్నాయి. అయితే వీటి ధరలుమాత్రం సామాన్యుడికి, సగటు మనిషికి అందనంత దూరంలో ఉన్నాయి. కిలో₹200 నుండి ₹300 రూపాయలకు అమ్ముతున్నారు. మామిడిపండ్ల ప్రియులు ఎంత ధర అయినా వీటిని కొనేందుకు ఆసక్తి చూపు చూపుతున్నారు. ఏది ఏమైనా సీజన్ కానీ సీజన్లో మామిడి పండ్లు ఇక్కడి మార్కెట్లో లభ్యం కావడం విశేషం.1
- రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.1
- రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.1
- బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన1
- శ్రీకాకుళం మార్కెట్లో కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు శ్రీకాకుళం మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాలు లేక ఉత్పత్తి తగ్గి, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగి, కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు తెలిపారు. ఇక్కడి మార్కెట్లో టమాటా, బెండకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, అల్లం వంటి కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో సగటు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిత్య అవసరాలలో ఒకటైన కూరగాయల ధరలు నియంత్రించాలని వారు కోరుతున్నారు.1