Shuru
Apke Nagar Ki App…
పుట్టినరోజున అన్న క్యాంటీన్ లో టిఫిన్ చేసిన సీఎం దంపతులు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకొని విజయవాడ పాటమాట అన్నా కక్యాంటీన్ ని సందర్శించారు ఏ సందర్భంగా సీఎం దంపతులు స్వయంగా వడ్డించి అక్కడి కార్మికులు తో కలిసి అల్పాహారం తిన్నారు కాగా చంద్రబాబు జన్మదిన నేపథ్యంలో ఆయన సతీమణి భువనేశ్వరి రూ 76 లక్షల విరాళం ప్రకటించారు రాష్ట్ర వ్యాపాతం గా ఉన్న 269 అన్న క్యాంటీన్ లో నేడు ఉచితం గా భోజనం అందించనున్నారు
Annapa reddy Siva Nagendra
పుట్టినరోజున అన్న క్యాంటీన్ లో టిఫిన్ చేసిన సీఎం దంపతులు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకొని విజయవాడ పాటమాట అన్నా కక్యాంటీన్ ని సందర్శించారు ఏ సందర్భంగా సీఎం దంపతులు స్వయంగా వడ్డించి అక్కడి కార్మికులు తో కలిసి అల్పాహారం తిన్నారు కాగా చంద్రబాబు జన్మదిన నేపథ్యంలో ఆయన సతీమణి భువనేశ్వరి రూ 76 లక్షల విరాళం ప్రకటించారు రాష్ట్ర వ్యాపాతం గా ఉన్న 269 అన్న క్యాంటీన్ లో నేడు ఉచితం గా భోజనం అందించనున్నారు
More news from తెలంగాణ and nearby areas
- . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- .పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.1
- తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు....1
- వరంగల్ నగరంలోని సి.కె.ఎం కళాశాలలో ఈ సంవత్సరం నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సు గోడపత్రికలను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధ్యాపకులు కలిసి గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోర్సు వివరాలు, విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశాలపై అవగాహన కల్పించారు.1
- Post by Bondhu Suresh1