*పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్* పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం " డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ " ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. '' ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ సొసైటీ '' ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. "మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి , డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- పదవి దక్కిందని కాదు రైతుకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ఆ బాధ్యతలకు వంద శాతం న్యాయం చేసి రైతుల నోట, ప్రజల నోట మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నార్త్‌రాజుపాళెం మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అభినందన సభలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి తో పాటు వైస్ ఛైర్మన్, సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రైతాంగానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.4
- వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారికి గ్రామోత్సవం మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వేలసియున్న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లి గ్రామానికి ఊరేగింపుగా వెంకయ్య స్వామి ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ముంగర విజయభాస్కర్ రెడ్డి గుండుబోయిన వెంకయ్య యాదవ్ పాశం నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ 10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.1
- బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.2
- సిద్దవటం పెన్నానదిలోకి కుందూ నది నీరు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దవటం పెన్నానదికి ఆదివారం కుందూ నది నీరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కుందూ నది నీరు వచ్చి చేరడంతో పెన్నానదిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం వరకు చుక్క నీరు లేకుండా ఎడారిగా ఉన్న పెన్నానదిలోకి నీరు వచ్చి చేరడంతో పెన్నానది పరివాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగు నీటిని అందించే పెన్నానది నీరు వచ్చి కళకళలాడుతోంది.1
- మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి1
- #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt1
- ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.1