సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో కులం, మతం పేరుతో ద్వేషాన్ని నింపి, రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద పోస్టులు పెడితే చట్టరీత్యా నేరమని, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.సోషల్ మీడియాలో బాధ్యతారాహిత్యంగా తప్పుడు ప్రచారం చేయడం, అసత్య సమాచారం పంచుకోవడం,ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సమాజంలో అశాంతి, విద్వేషాలకు దారి తీస్తుందని అన్నారు. సోషల్ మీడియా పోస్టులు లేదా సందేశాలు షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం కూడా చట్టపరమైన చర్యలకు గురి కావాల్సిన పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించే ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని, నిర్ధారణ లేని సమాచారం లేదా వివాదాస్పద వ్యాఖ్యలను పంచుకోవద్దని అన్నారు. ఎవరైనా కులం, మతం, వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు లేదా సందేశాలు పంపినట్లు గుర్తించినట్లయితే, వారి పై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలు చట్టాలను గౌరవించి సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పవన్ కుమార్,సాయి శశాంక్ కోరారు.

- మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.1
- దేశాయిపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఓ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన Sonu Sood వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. చదువుపై దృష్టి పెట్టాలని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.1
- Spm పర్మినెంట్ కార్మికుడు విప్పులూరి.శ్రీనివాస్ ఆవేదన తనతో పాటు చాలామంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా కాలయాపనా చేస్తున్నా spm jk యజమాన్యంపై ఆవేదనతోని ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. గతంలో మరియు ఇప్పుడు జరుగుతున్న కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వెలికి తీస్తానని తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని త్వరలో సోషల్ మీడియా వేదికపై తను ప్రశ్నిస్తా అని అన్నారు.1
- గంగారం మండలం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన చేనులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతు గుండా గాని రాజుకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న కంకులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోవడంతో స్థానికులు గమనించారు. అనంతరం గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంటలో కొంత భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన వల్ల రైతు గుండా గాని రాజుకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. చేనులో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలువ కోసం రైతన్నలు కన్నీటి పర్యంతమై రంగనాయకసాగర్ 11/6 కాలువను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నెల రోజులుగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో కాలువ సాధన దీక్షా చేస్తున్నారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ 11 (RD3 LM6) కాలువ పనులు చివరి దశలో నిలిచిపోవడంతో 12 గ్రామాల రైతులకు సాగు నీరు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కిలోమీటర్ కాలువ పనులు పూర్తి చేస్తే ఇల్లంతకుంట తంగళ్ళపల్లి మండలాల్లోని 12 గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మెట్ట ప్రాంతంలో నీటి వసతి లేక మగవాళ్ళు గల్ఫ్ దేశాలకు వలస పోతే అక్కడ యుద్దంతో పరిస్థితి బాగాలేదని మహిళా రైతు కన్నీటి పర్యంతమై గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా కాల్వ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. అటు రసమయి బాలకిషన్ సైతం కేటీఆర్ ద్వారా అసెంబ్లీలో కాలువ గురించి మాట్లాడించి త్వరగా పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతులు నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యాన్ని వీడి రైతులకు సాగునీరు అందించేందుకు ఎల్ఎం6 కెనాల్ పనులను తక్షణమే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.3
- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1