వ్రతం చేశారు.. బంగారం మురికి కాలువలో పడేశారు! విశాఖపట్నంలోని గాజువాకలో ఆసక్తికర ఘటన పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి అలంకరించిన బంగారు నగలను పొరపాటున పూలతో పాటు డ్రైనేజీ కాలువలో పడేసింది ఓ కుటుంబం. తీరా విషయం తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి గంటలపాటు శ్రమించి ఆ నగలను వెలికితీసి అప్పగించారు. విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాజువాక శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేశ్, దివ్య దంపతులు ఈ నెల 21న అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో అలంకారం చేశారు. ఆనవాయతీ ప్రకారం మూడు రోజుల పాటు నగలను అమ్మవారి వద్దనే ఉంచారు. ఆదివారం (23వ తేదీ) పూజా సామాగ్రిని తొలగించే క్రమంలో రమేశ్.. అమ్మవారికి అలంకరించిన 3 తులాల హారం, కాసులను మాత్రమే తీసి భద్రపరిచారు. అయితే, పూలు, ఇతర పూజా సామగ్రిలో కలిసిపోయిన సుమారు 5 తులాల బరువున్న కంకణం, రెండు గొలుసులు, మూడు ఉంగరాలను ఆయన గమనించలేదు. నిర్మల్యం మొత్తాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి, దుర్గా నగర్ సమీపంలోని స్టీల్ ప్లాంట్ రైల్వే బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నగలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే కాలువ వద్దకు పరుగులు తీసి వెతికినా ఫలితం లేకపోవడంతో, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన సీఐ కేశవరావు, సిబ్బందిని రంగంలోకి దించారు. జేసీబీ సహాయంతో కాలువలో నీటి ప్రవాహాన్ని మళ్లించి, వేగాన్ని తగ్గించారు. అనంతరం కాలువలో చెల్లాచెదురుగా పడి ఉన్న నగలను సిబ్బంది ఒక్కొక్కటిగా వెలికితీశారు. ఆ ఆభరణాలను దంపతులకు సురక్షితంగా అప్పగించారు. పోయాయనుకున్న బంగారం తిరిగి చేతికి అందడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పండగలు, పూజల సమయంలో విలువైన వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు.

- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు2
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1