Shuru
Apke Nagar Ki App…
విద్యార్థులే ఉపాధ్యాయులైనవేల జగదేవపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం గజ్వేల్ నియోజకవర్గం, మార్చి 10 (ప్రజా ప్రతిభ): జగదేవపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులందరు మంగళవారం రోజు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.స్వయం పరిపాలన దినోత్సవంలో సమీరా ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించగా,తమన్ జిల్లా కలెక్టర్ గా,కె.గౌతమ్ డీఈవో గా,జబేర్ ఎంఈఓగా వ్యవహారించారు.ఈ సందర్బంగా విద్యార్థులు వారి పాత్రలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సైదులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్ రావు,ఉపాధ్యాయులు షకీరా బేగం,పృద్వి,రాజేశ్వరి,సునీత,ఐఇఆర్పి కరుణాకర్,ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు సరస్వతి,మౌనిక,ఏఏపీసి చైర్మన్ శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Errolla Babu
విద్యార్థులే ఉపాధ్యాయులైనవేల జగదేవపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం గజ్వేల్ నియోజకవర్గం, మార్చి 10 (ప్రజా ప్రతిభ): జగదేవపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులందరు మంగళవారం రోజు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.స్వయం పరిపాలన దినోత్సవంలో సమీరా ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించగా,తమన్ జిల్లా కలెక్టర్ గా,కె.గౌతమ్ డీఈవో గా,జబేర్ ఎంఈఓగా వ్యవహారించారు.ఈ సందర్బంగా విద్యార్థులు వారి పాత్రలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సైదులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్ రావు,ఉపాధ్యాయులు షకీరా బేగం,పృద్వి,రాజేశ్వరి,సునీత,ఐఇఆర్పి కరుణాకర్,ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు సరస్వతి,మౌనిక,ఏఏపీసి చైర్మన్ శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- Post by Narasimulu Narasimulu1
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4