ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కీలక సమీక్షలు ఈ నెల 11, 12వ తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్సులో దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి సమావేశాల రెండో రోజున శాంతి భద్రతలపై సమీక్ష... హాజరుకానున్న జిల్లాల ఎస్పీలు* *అమరావతి, మార్చి 10:* రాష్ట్ర అభివృద్ధి దిశగా పని చేస్తోన్న అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతలపై సమగ్రంగా చర్చించనున్నారు. కాన్ఫరెన్స్ మొదటి రోజు ఉదయం 10 గంటలకు CCLA స్వాగత ప్రసంగంతో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కీనోట్ అడ్రస్ ఇవ్వనున్నారు. అనంతరం వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. స్వర్ణాంధ్ర @2047 - పది సూత్రాల అమల్లో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జల భద్రత, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వంటి అంశాలపై చర్చించున్నారు. రాష్ట్ర GSDP, జిల్లాల వారీగా సాధించిన లక్ష్యాలపై సమీక్షిస్తారు. ఇక డిజిటల్ గవర్నెన్సులో భాగంగా ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రివెన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనల గ్రౌండింగ్‌పై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు రెండో రోజున ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై ప్రత్యేక సమావేశంలో కీలక చర్చ జరగనుంది. దీంతో సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపడతారు. అలాగే భూ పరిపాలన, రెవెన్యూ ఆర్జన శాఖల పనితీరుతో పాటు విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై చర్చలు జరగనున్నాయి. రెండో రోజు సాయంత్రం వేళ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ప్రత్యేక సెషన్ ఉంటుంది. ఈ సెషనులో జిల్లా ఎస్పీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ రెండు రోజుల సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, హెచ్వోడీలు పాల్గొననున్నారు.

- Post by Magathala Siddhartha2
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- నాగర్‌కర్నూల్ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బస్సులో బ్రష్ చేసుకుంటున్న మహిళ. ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు, కండక్టర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనపదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు3
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు1