logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెట్‌పల్లి మున్సిపల్ నూతన చైర్మన్‌కు కార్మిక సంఘం ఘన సన్మానం.. మెట్‌పల్లి మున్సిపల్ నూతన చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ నేతృత్వంలో శాలువాతో సత్కరించి పూల బొకేలను అందజేశారు.ఈ సందర్భంగా మూడవ వార్డు కౌన్సిలర్ శ్రీ బత్తుల నరేష్, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీ గుడి కందుల అజయ్‌లను కూడా కార్మిక సంఘం సభ్యులు సన్మానించారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన చైర్మన్ కార్మికుల సమస్యలను పరిష్కరించి, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పట్టణ ప్రగతికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కొత్త పాలకవర్గానికి కార్మికుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంక శ్రీకాంత్, మధురమ్మ, అనిల్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

11 hrs ago
user_Mahammad Vaseem
Mahammad Vaseem
Metpalli, Jagitial•
11 hrs ago
c6a64c60-4cc8-47f0-88f9-8918b53058ad

మెట్‌పల్లి మున్సిపల్ నూతన చైర్మన్‌కు కార్మిక సంఘం ఘన సన్మానం.. మెట్‌పల్లి మున్సిపల్ నూతన చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ నేతృత్వంలో శాలువాతో సత్కరించి పూల బొకేలను అందజేశారు.ఈ సందర్భంగా మూడవ వార్డు కౌన్సిలర్ శ్రీ బత్తుల నరేష్, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీ గుడి కందుల అజయ్‌లను కూడా కార్మిక సంఘం సభ్యులు సన్మానించారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన చైర్మన్ కార్మికుల సమస్యలను పరిష్కరించి, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పట్టణ ప్రగతికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కొత్త పాలకవర్గానికి కార్మికుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంక శ్రీకాంత్, మధురమ్మ, అనిల్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    1
    జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    1
    నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ  జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష,  జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ
రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని  అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.
    1
    బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Boath, Adilabad•
    20 hrs ago
  • బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....
    1
    బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్.
ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు.
ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్..
రెండవ నిందితుడిగా  చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు..
ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...!
14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..!
మరికొద్ది సేపట్లో  ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు.
ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...!
....
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    4 hrs ago
  • కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాజురా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే పాల్గొన్నారు. ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవుదినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.
    1
    కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాజురా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవుదినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.
    1
    నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.  
అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.