logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గొడవలు, అరెస్టులు, కన్నీరు! ఉమ్మడి వరంగల్ లోని 12మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండ్రోజులు నువ్వా? నేనా? అన్నట్లు కాంగ్రెస్, BRS గొడవలు, నాయకుల అరెస్టులతో జిల్లా రణరంగంలా మారింది. ప్రధానంగా జనగామ, తొర్రూర్, వర్ధన్నపేటలో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. వర్ధన్నపేట 12వ వార్డులో BRS గెలిచినా ఓడినట్లు ప్రకటించారని ఆరూరి ధర్నాకు దిగితే, అధికారంతో తొర్రూరును కాంగ్రెస్ దక్కించుకుందని ఆరోపిస్తూ ఎర్రబెల్లి కన్నీరు పెట్టుకున్నారు.

3 hrs ago
user_RUDRA BHAVANARUSHI
RUDRA BHAVANARUSHI
నర్సింహులపేట, మహబూబాబాద్, తెలంగాణ•
3 hrs ago
4e55acfc-68a2-41b6-9f3e-91761694a207

గొడవలు, అరెస్టులు, కన్నీరు! ఉమ్మడి వరంగల్ లోని 12మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండ్రోజులు నువ్వా? నేనా? అన్నట్లు కాంగ్రెస్, BRS గొడవలు, నాయకుల అరెస్టులతో జిల్లా రణరంగంలా మారింది. ప్రధానంగా జనగామ, తొర్రూర్, వర్ధన్నపేటలో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. వర్ధన్నపేట 12వ వార్డులో BRS గెలిచినా ఓడినట్లు ప్రకటించారని ఆరూరి ధర్నాకు దిగితే, అధికారంతో తొర్రూరును కాంగ్రెస్ దక్కించుకుందని ఆరోపిస్తూ ఎర్రబెల్లి కన్నీరు పెట్టుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    1
    తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    user_RUDRA BHAVANARUSHI
    RUDRA BHAVANARUSHI
    నర్సింహులపేట, మహబూబాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
    1
    ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • హన్మకొండ సుబేదారి క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 132 మంది లబ్ధిదారులకు రూ.1,34,15,544 విలువైన చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హతే ప్రమాణంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని తెలిపారు.
    2
    హన్మకొండ సుబేదారి క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 132 మంది లబ్ధిదారులకు రూ.1,34,15,544 విలువైన చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హతే ప్రమాణంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    49 min ago
  • ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వరంగల్ కాజీపేట హనుమకొండలో భారీ శోభాయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజాక్ చత్రపతి శివాజీ, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్ పాల్గొన్నారు.
    1
    ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వరంగల్ కాజీపేట హనుమకొండలో భారీ శోభాయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజాక్ చత్రపతి శివాజీ, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్ పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • మహారాష్ట్ర | సాతారా జిల్లా: సాతారా జిల్లాలోని దేరే గ్రామానికి చెందిన భారత సైనికుడు ప్రమోద్ పరశురాం జాధవ్ విధి నిర్వహణలో అమరుడయ్యారు. ఆయన మృతి వార్త గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. హృదయాన్ని కలిచివేసే దృశ్యంలో… కేవలం 8 గంటల క్రితం జన్మించిన తమ నవజాత కుమార్తెతో కలిసి, ప్రసవం అనంతరం స్ట్రెచర్‌పైనే ఉన్న ఆయన భార్య, తన వీర భర్తకు చివరి వీడ్కోలు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తించింది. సరిహద్దుల్లో దేశ శాంతి కోసం ప్రాణాలర్పించే జవానుల త్యాగానికి ఇది మరో ఉదాహరణ. వ్యక్తిగత ఆనందాలను పక్కనపెట్టి, కుటుంబాన్ని వదిలి, దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇచ్చే మన సైనికుల ధైర్యానికి ఈ ఘటన నిదర్శనం. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… “ఇది ప్రేమకథ కాదు – త్యాగగాథ. మనందరి శాంతికోసం తమ జీవితాలనే అర్పిస్తున్న జవానుల్ని మనం స్మరించుకోవాలి” అన్నారు. భారత సైన్యం మన గర్వం. మన రక్షణ కవచం. వీర అమర జవాన్ జాధవ్‌కు శతకోటి వందనాలు. వారి కుటుంబానికి దేశమంతా సెల్యూట్. 🙏🇮🇳
    1
    మహారాష్ట్ర | సాతారా జిల్లా:
సాతారా జిల్లాలోని దేరే గ్రామానికి చెందిన భారత సైనికుడు ప్రమోద్ పరశురాం జాధవ్ విధి నిర్వహణలో అమరుడయ్యారు. ఆయన మృతి వార్త గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.
హృదయాన్ని కలిచివేసే దృశ్యంలో… కేవలం 8 గంటల క్రితం జన్మించిన తమ నవజాత కుమార్తెతో కలిసి, ప్రసవం అనంతరం స్ట్రెచర్‌పైనే ఉన్న ఆయన భార్య, తన వీర భర్తకు చివరి వీడ్కోలు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తించింది.
సరిహద్దుల్లో దేశ శాంతి కోసం ప్రాణాలర్పించే జవానుల త్యాగానికి ఇది మరో ఉదాహరణ. వ్యక్తిగత ఆనందాలను పక్కనపెట్టి, కుటుంబాన్ని వదిలి, దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇచ్చే మన సైనికుల ధైర్యానికి ఈ ఘటన నిదర్శనం.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… “ఇది ప్రేమకథ కాదు – త్యాగగాథ. మనందరి శాంతికోసం తమ జీవితాలనే అర్పిస్తున్న జవానుల్ని మనం స్మరించుకోవాలి” అన్నారు.
భారత సైన్యం
మన గర్వం.
మన రక్షణ కవచం.
వీర అమర జవాన్ జాధవ్‌కు శతకోటి వందనాలు.
వారి కుటుంబానికి దేశమంతా సెల్యూట్. 🙏🇮🇳
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor Narsampet, Warangal•
    8 hrs ago
  • వర్ధన్నపేట | వరంగల్ జిల్లా: ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.
    1
    వర్ధన్నపేట | వరంగల్ జిల్లా:
ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు.
సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.
    user_Ibrahim sulthana
    Ibrahim sulthana
    Tailor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    1
    ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు...
రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర...
మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి....
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ....
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు.
కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం.
ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు.
ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు.
ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు.
తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు.
కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ...
తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం.
రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది.
రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము.
తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది.
ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ....
ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది.
తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు.
రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు.
బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్.
దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు
నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా.. మహబూబాబాద్ పట్టణం లోని ప్రగతి నగర్ లో దారుణం సహజీవనం చేస్తున్న యువతి వేరే వ్యక్తి తో సన్నిహితంగా ఉండడాన్ని తట్టుకోలేక ఆమె పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి... అనంతరం తన ఫై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు పరిస్థితి విషమంగా ఉండడం తో మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు....
    1
    మహబూబాబాద్ జిల్లా..
మహబూబాబాద్ పట్టణం లోని ప్రగతి నగర్ లో దారుణం 
సహజీవనం చేస్తున్న యువతి వేరే వ్యక్తి తో సన్నిహితంగా ఉండడాన్ని  తట్టుకోలేక ఆమె పై పెట్రోల్ పోసి  నిప్పు అంటించి... అనంతరం తన ఫై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి 
ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
పరిస్థితి విషమంగా ఉండడం తో 
మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు....
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.