హిందూ–ముస్లిం సోదరభావానికి అద్దం పట్టిన ఈద్ మిలాద్ వేడుకలు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా వేడుకలు విజయనగరం, ఆగస్టు 26: విజయనగరం జిల్లాలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రార్థనలు, ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు, ర్యాలీలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయి. పలువురు హిందూ సోదరులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి మతసామరస్యాన్ని చాటారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ర్యాలీల మార్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ నిర్వహించినట్లు తెలిపారు. విజయనగరం పట్టణంలో అబాడవీధి నుంచి ప్రారంభమైన ర్యాలీ కోట జంక్షన్, బాలాజీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ రోడ్డు, కన్యకా పరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మూడు లాంతర్లు మీదుగా సాగి తిరిగి అబాడవీధికి చేరుకుంది. ఈ ర్యాలీలో సుమారు 2,500 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ర్యాలీ ప్రశాంతంగా, సజావుగా ముగిసేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తులో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పేర్కొన్నారు.
హిందూ–ముస్లిం సోదరభావానికి అద్దం పట్టిన ఈద్ మిలాద్ వేడుకలు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా వేడుకలు విజయనగరం, ఆగస్టు 26: విజయనగరం జిల్లాలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రార్థనలు, ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని
వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు, ర్యాలీలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయి. పలువురు హిందూ సోదరులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి మతసామరస్యాన్ని చాటారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ర్యాలీల మార్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
చేశామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ నిర్వహించినట్లు తెలిపారు. విజయనగరం పట్టణంలో అబాడవీధి నుంచి ప్రారంభమైన ర్యాలీ కోట జంక్షన్, బాలాజీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ రోడ్డు, కన్యకా పరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మూడు లాంతర్లు మీదుగా సాగి తిరిగి అబాడవీధికి చేరుకుంది. ఈ ర్యాలీలో సుమారు 2,500 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు
తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ర్యాలీ ప్రశాంతంగా, సజావుగా ముగిసేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తులో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పేర్కొన్నారు.
- విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్.. విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.1
- శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 II గాజువాక II విశాఖపట్నం శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 గాజువాక II విశాఖపట్నం1
- శ్రీకాకుళం నగరంలో ప్లే గ్రౌండ్ గా మారిన హెలి ప్యాడ్..! శ్రీకాకుళం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాల కొరత ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఖాళీ స్థలాలు పార్కుల్ని క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నారు.అవీ చాలక ఇప్పుడు నగరంలోని డచ్ బంగ్లా సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ని సైతం క్రీడామైదానంగా తయారు చేసారు. భద్రతాపరమైన ప్రోటోకాల్ హెలి ప్యాడ్ సమీపంలో అమలులో ఉంటుంది. అయినా సంబంధిత అధికారులు గాని, క్రీడాకారులు గాని ఎవరూ పట్టించుకోవటం లేదు. నగరంలో మరిన్ని ఆట స్థలాలను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.1
- డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు1
- బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.1
- రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.2
- అనకాపల్లి జిల్లా: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం రోలు గుంటలో.. మంచినీళ్లు ఇవ్వండి చేతులు జోడించి వేడుకుంటున్నాము.. దళితులు బిరుదులు పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ.. అనకాపల్లి జిల్లా రోలుగుంట కేంద్రంలో కాలనీలో దళితులు. గిరిజనులు. ఇతర పేద మహిళలు ఖాళీ బిందెలతో. మూడు వీధిలో రాలి నిర్వహించడం జరిగింది. వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలి CSR. DFM నిధుల నుండి వాటర్ ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోకులు చేసుకోవాలి రోలుగుంట మండలంలో రోలుగుంట తో పాటు నిండుగొండ కే నాయుడుపాలెం కొవ్వూరు.ఎన్ కొత్తూరు. అంట్లపాలెం రాజుపేట ముని పెళ్లి గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటికి 13000 మంది జనాభా రక్షత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో3 కోట్ల 50 లక్షల రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు. అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది ఇప్పుడు 20 వేల మంది జనాభా పెరిగారు. వరాహ నది బోరుబావుడు చుట్టూ ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కోటమ్మ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది తిరిగి కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన అని చెప్పారు. అధికారులు చెబుతున్నారు. నేటికీ ఫ్లోరిడ్ గ్రామంగా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. స్కీం మాత్రం కేటాయించడం లేదు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా దొరకడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో నీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. 12 కుటుంబాల వారు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి నీరు రావడం లేదు దళిత గిరిజన ఇతర పేద వీధులన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రోలుగుంట నిండుగొండ. కొవ్వూరు రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు. ఉన్నాయి. పర్యావరణ అనుమతులు గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం సభలో ప్రకటిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఖాళీ కరాప నిర్వహిస్తున్నారు సి ఎస్ ఆర్ Csr. డిస్ట్రిక్ట్ పండు నిధులు రోలుగుంట మంచినీరికి కేటాయించకపోవడం చాలా అన్యాయం ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ జై గారితో ఫోన్లో మాట్లాడగా వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. నీరు లేదు. చెప్పారు. తక్షణమే దళిత గిరిజన కాలనీకి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు v నూకరత్నం v శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.3
- శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి..... సాలి హుండాం బౌద్ధారామం గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం1