అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరులోని రాజీవ్ గాంధీ నగర్‌లోని పి.హెచ్.ఆర్ కన్వెన్షన్‌లో మహిళల కోసం యోగా అవగాహన సదస్సు నిర్వహించారు. హోప్ విన్ హాస్పిటల్స్ చైర్‌పర్సన్, ది పింక్ స్టేత్ ఫౌండర్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తాన మాట్లాడుతూ ఆరోగ్యానికి యోగా రక్షణ కవచంలా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్స్ లక్ష్మి, శ్రావణిల ద్వారా యోగా సెషన్, అలాగే నర్సి మాస్టర్ ద్వారా 'జుంబా' డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ షమా సుల్తాన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో మహిళలకు ఎదురయ్యే పీ.ఎం.ఓ.ఎస్ (P.M.O.S) వంటి సమస్యలను నివారించడానికి యోగా, జుంబా మరియు సరైన ఆహారం చాలా సహాయకారిగా ఉంటాయని వివరించారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ యోగాను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని జీవనశైలిని మెరుగుపరుచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. యోగా ట్రైనర్స్ లక్ష్మి, శ్రావణి కూడా మహిళల ఆరోగ్యానికి యోగా కీలకమని, నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు డాక్టర్ షమా సుల్తానను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో హోప్ విన్ హాస్పిటల్స్ సిబ్బంది, వెంకటేశ్వర స్కూల్ సిబ్బందితో పాటు రాజీవ్ గాంధీ నగర్ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరులోని రాజీవ్ గాంధీ నగర్‌లోని పి.హెచ్.ఆర్ కన్వెన్షన్‌లో మహిళల కోసం యోగా అవగాహన సదస్సు నిర్వహించారు. హోప్ విన్ హాస్పిటల్స్ చైర్‌పర్సన్, ది పింక్ స్టేత్ ఫౌండర్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తాన మాట్లాడుతూ ఆరోగ్యానికి యోగా రక్షణ కవచంలా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్స్ లక్ష్మి, శ్రావణిల ద్వారా యోగా సెషన్, అలాగే నర్సి మాస్టర్ ద్వారా 'జుంబా' డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ షమా సుల్తాన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో మహిళలకు ఎదురయ్యే పీ.ఎం.ఓ.ఎస్ (P.M.O.S) వంటి సమస్యలను నివారించడానికి యోగా, జుంబా మరియు సరైన ఆహారం చాలా సహాయకారిగా ఉంటాయని వివరించారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ యోగాను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని జీవనశైలిని మెరుగుపరుచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. యోగా ట్రైనర్స్ లక్ష్మి, శ్రావణి కూడా మహిళల ఆరోగ్యానికి యోగా కీలకమని, నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు డాక్టర్ షమా సుల్తానను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో హోప్ విన్ హాస్పిటల్స్ సిబ్బంది, వెంకటేశ్వర స్కూల్ సిబ్బందితో పాటు రాజీవ్ గాంధీ నగర్ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/7లో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం, 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆవాజ్ కమిటీ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో 'ఎస్ఐఆర్ (SIR) అవగాహన సదస్సు' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్తి అధ్యక్షత వహించగా, ఇప్పటివరకు భారతదేశంలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేవారని, అయితే ఈసారి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలే ప్రజలను ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, దేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక పథకం ప్రకారం, కుట్రపూరితంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఓటు ఉన్న భారతదేశం, ఓటు లేని భారతదేశం అంటూ దేశాన్ని రెండు రకాలుగా విభజించే ప్రయత్నం జరుగుతోందని, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని సెక్యులర్ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన గట్టిగా సూచించారు. మరొక అతిథి, బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ చైర్మన్ ఎం కే ఎస్ మొహియుద్దీన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటు నమోదు చేసుకునే ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో మేల్కో ఆంధ్రప్రదేశ్ నాయకులు రమేష్ పట్నాయక్, ముస్లిం సమైక్యవేదిక నాయకులు హాజీ అబ్దుల్ కలాం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నీలాంబరం, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఏ సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సలీం, కిద్మత్ బ్యాంక్ నిర్వాహకులు బషీర్, గుంటూరు జిల్లా కార్యదర్శి ఎస్ కే భాష తదితరులు పాల్గొన్నారు.1
- మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరు మండలం, శేగిరెడ్డిపాడు, వెలగలేరు గ్రామాల పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషాకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరుగుతున్న దోపిడీని 'కేజీఎఫ్ సినిమా' తరహాలో జరుగుతోందని పేర్కొంటూ, జోగి రమేష్ ఆధారాలతో సహా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.1
- రేపల్లె 8వ వార్డుకు చెందిన రెల్లి కులస్తులు, రేపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు, అధిక వడ్డీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న సయ్యద్ భాషా, అతని భార్య మీరాభి, వారి కుమారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం, రేపల్లె మున్సిపాలిటీలో పర్మినెంట్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న 14 మంది కార్మికులు సయ్యద్ భాషా వద్ద అప్పులు తీసుకున్నారు. భాషా ఈ అప్పులకు ₹10 నుండి ₹20 వరకు అధిక వడ్డీలను వసూలు చేస్తున్నాడని, అంతేకాకుండా ఈ వడ్డీలు తీసుకున్నప్పటికీ, వారి వద్ద తీసుకున్న ఖాళీ నోట్లను ఉపయోగించి లక్షలాది రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమను వేధిస్తున్న భాషా కుటుంబం నుండి రక్షించాలని కోరిన ఫిర్యాదుదారులు, అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌ను అభ్యర్థించారు.1
- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సీఐ నాగరాజు వ్యవహారం రోజురోజుకూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. సాధారణ ప్రజలపై చిన్న ఫిర్యాదు వచ్చినా వెంటనే కేసులు నమోదు చేసి, అరెస్టుల వరకు వెళ్లే పోలీసులు, తమ శాఖకు చెందిన ఒక అధికారిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అని తరచుగా చెప్పే పోలీసు శాఖ, తమ అధికారుల విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తుందా లేదా అనే సందేహాలు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు ఏ దశలో ఉంది, విచారణ ఎంతవరకు వచ్చిందనే అంశాలపై ప్రజలు స్పష్టత కోరుతున్నారు. సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ, అరెస్టు అవసరమా కాదా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆశ్రయం కల్పించడం కూడా చట్టరీత్యా ప్రశ్నార్థకమేనని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సింగ్‌నగర్ ప్రాంతంలో నాగరాజు తలదాచుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న ఇంటి యజమానిపై విచారణ జరుపుతారా, అవసరమైతే కేసు నమోదు చేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, కోర్టులో వాదనల కోసం న్యాయవాదులు అవసరం కావడం సహజమే అయినప్పటికీ, విచారణ పూర్తికాకముందే కొందరు న్యాయవాదులు నాగరాజుకు మద్దతుగా ముందుకు రావడం వెనుక కారణాలేమిటనే చర్చ కూడా సాగుతోంది. ఇది వ్యక్తిగత హక్కు అయినప్పటికీ, ప్రజల్లో అనేక సందేహాలకు దారితీస్తోంది. సామాన్య ప్రజల విషయంలో పోలీసులు అత్యంత వేగంగా స్పందిస్తారని తరచుగా కనిపిస్తుంటుంది. అయితే, ఇదే వేగం తమ శాఖ అధికారుల విషయంలో కనిపించకపోతే, చట్టంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాన్యులకు ఒక న్యాయం, అధికారులకు మరో న్యాయమా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలోనూ, ప్రజా వేదికలపైనా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఉదయం నుంచి సింగ్‌నగర్ ప్రాంతంలో జరిగిన పరిణామాలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. కొందరు స్థానికులు నాగరాజుకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానాలపై నమ్మకం ఉంటే విచారణకు పూర్తిగా సహకరించాలని, ఆరోపణలు నిజం కాకపోతే చట్టపరంగానే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వకుండా ఉండటం వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో పోలీసు శాఖ ఎలా ముందుకు సాగుతుంది, నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన ప్రకటన ఇస్తుందా, అవసరమైతే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తుందా, లేక ఆరోపణలు నిరాధారమని తేలుస్తుందా అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం అందరికీ సమానంగా అమలవుతుందనే నమ్మకాన్ని నిలబెట్టాలంటే, ఈ కేసులో పారదర్శక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.1
- చింతకాని మండలంలోని మత్కేపల్లి – జగన్నాధపురం ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు అధికారికంగా 'రైతు ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సభ వేదికగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఈ సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏఐటీయూసీ యూనియన్ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్న సందర్భంగా కోణంనేని సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొగ్గు చోరీ జరిగిందని కార్మిక వర్గాల్లో అయోమయం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బొగ్గును ఎవరు దోచుకుపోతారు, ఎందుకు దోచుకుపోతారని ప్రశ్నించిన కోణంనేని, 40 మిలియన్ల బొగ్గు, 40 లక్షల టన్నుల బొగ్గును దోచుకోవడం సాధ్యమేనా అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పదే పదే కుంభకోణం ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అడుగులకు బీజేపీ పార్టీ మడుగులోతుతోందని, కోతిని చూసి నక్క గిక్కున్నట్లుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శ చేశారు. ఇప్పటికే సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన కోణంనేని, కొత్త మైనింగ్ ల కోసం అందరూ సహకరించాలని కోరుతూ కార్మిక కుటుంబాలను రోడ్డున పడే విధంగా చూస్తున్నారని మండిపడ్డారు. పదే పదే మైనింగ్ ప్రాంతాల్లో పర్యటిస్తూ బొగ్గు చోరీ జరిగిందంటూ కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా న్యాయమైన బొగ్గును అమ్మడానికే చూస్తుంది గానీ, చోరీ చేయదని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలను కార్మికులు నమ్మే పరిస్థితి లేదని కోణంనేని సాంబశివరావు అన్నారు.1
- ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం నూతన గూడెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బండి మునేశ్వర రావు ఇంట్లోని బావిలో పూడిక తీయడానికి వెళ్లిన ఇద్దరు కూలీలు ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనలో గణేష్ నగర్‌కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు అలియాస్ చిట్టిబాబు ప్రాణాలు కోల్పోయారు. తొలుత చిట్టిబాబు బావిలోకి దిగి ఊపిరాడటం లేదని కేకలు వేయగా, అతడిని రక్షించేందుకు వీర వెంకటరావు కూడా బావిలోకి దిగాడు. ఇద్దరూ లోపల చిక్కుకుని కేకలు వేయడంతో స్థానికులు తాడు సాయంతో వారిని పైకి లాగేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సమాచారం అందిన వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.1
- ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, రింగ్ సర్కిల్ వద్ద మైలవరం వెళ్లే జాతీయ రహదారి, పోలీస్ స్టేషన్ కు కొద్ది దూరంలో చిన్నపాటి వర్షానికే చెరువును తలపించేలా పూర్తిగా జలమయం అయింది. జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యం వల్లే రోడ్లపై ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది. ఈ పరిణామంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోతున్న రహదారులపై జాగ్రత్తలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1