Shuru
Apke Nagar Ki App…
భిక్కనూర్: సర్పంచికి సమాచారం లేకుండా ప్రారంభోత్సవాలు భిక్కనూరు మండలంలో సర్పంచికి సమాచారం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసం అని భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి సర్పంచ్ సాయ గౌడ్ అన్నారు. గ్రామంలో ఉప సర్పంచ్ భర్త కొండల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారని చెప్పారు. ఈ విషయం సర్పంచి సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్న కొండల్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Narmala Swapna
భిక్కనూర్: సర్పంచికి సమాచారం లేకుండా ప్రారంభోత్సవాలు భిక్కనూరు మండలంలో సర్పంచికి సమాచారం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసం అని భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి సర్పంచ్ సాయ గౌడ్ అన్నారు. గ్రామంలో ఉప సర్పంచ్ భర్త కొండల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారని చెప్పారు. ఈ విషయం సర్పంచి సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్న కొండల్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్లో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీలు ప్రేక్షకులను అలరించాయి. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.1
- దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు , అదనపు కలెక్టర్ నగేష్, బీసీ సంక్షేమ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.1
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండాలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన భూక్యా పద్మ నివాసపు పూరి గుడిసె పూర్తిగా కాలి దగ్ధమైంది. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆరిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణామాన్ని జరగలేదు. అలాగే సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.1