ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం రెపరెపలాడిన జాతీయ జెండాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. దీంతో ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ దివ్యజ్యోతి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో సత్తయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ ఎనుగందుల నరసింహులు జెండాను ఎగురవేశారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఎదుట సీఐ ఓ. వెంకటేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగిల్ విండో కార్యాలయం వద్ద సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిది రాజేందర్, బీజేపీ కార్యాలయం ఎదుట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ సబేరా బేగం జాతీయ జెండాను ఎగురవేశారు. నారాయణపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ దొమ్మాటి నరసయ్య, గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, అక్కపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ ప్రజల చారిత్రక పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి, ఐక్యతా భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ తహసీల్దార్ వేణు, ఆర్‌ఐ సహితి, వైస్ చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు బీపేట రాజ్‌కుమార్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. సాహెబ్, సీనియర్ నాయకులు చేపూరి రాజేశం గుప్తా, బండారి బాల్‌రెడ్డి, నంది కిషన్, వంగ శ్రీకాంత్‌రెడ్డి, టౌన్ అధ్యక్షులు చెన్ని బాబు, సీనియర్ కార్యకర్త కంచర్ల రాజు, మాజీ సర్పంచ్ శ్రీను, ఎడ్ల రాజ్‌కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేడిపల్లి రవి, పొన్నాల తిరుపతిరెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, గంట అంజయ్య, అందే సతీష్, సాదిక్ హిమం, రాజేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉడుగుల సురేందర్, షకీల్, రేసు శంకర్, గుర్రపు రాములు, ఏర్పుల శ్రీనివాస్, మద్దుల పద్మారెడ్డి, కార్యదర్శి కృష్ణ, ఉపసర్పంచ్ బంధారపు బాల్‌రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం రెపరెపలాడిన జాతీయ జెండాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. దీంతో ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ దివ్యజ్యోతి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో సత్తయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ ఎనుగందుల నరసింహులు జెండాను ఎగురవేశారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఎదుట సీఐ ఓ. వెంకటేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగిల్ విండో కార్యాలయం వద్ద సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిది రాజేందర్, బీజేపీ కార్యాలయం ఎదుట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ సబేరా బేగం జాతీయ జెండాను ఎగురవేశారు. నారాయణపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ దొమ్మాటి నరసయ్య, గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, అక్కపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ ప్రజల చారిత్రక పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి, ఐక్యతా భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ తహసీల్దార్ వేణు, ఆర్‌ఐ సహితి,
వైస్ చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు బీపేట రాజ్‌కుమార్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. సాహెబ్, సీనియర్ నాయకులు చేపూరి రాజేశం గుప్తా, బండారి బాల్‌రెడ్డి, నంది కిషన్, వంగ శ్రీకాంత్‌రెడ్డి, టౌన్ అధ్యక్షులు చెన్ని బాబు, సీనియర్ కార్యకర్త కంచర్ల రాజు, మాజీ సర్పంచ్ శ్రీను, ఎడ్ల రాజ్‌కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేడిపల్లి రవి, పొన్నాల తిరుపతిరెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, గంట అంజయ్య, అందే సతీష్, సాదిక్ హిమం, రాజేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉడుగుల సురేందర్, షకీల్, రేసు శంకర్, గుర్రపు రాములు, ఏర్పుల శ్రీనివాస్, మద్దుల పద్మారెడ్డి, కార్యదర్శి కృష్ణ, ఉపసర్పంచ్ బంధారపు బాల్‌రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్: గంజ్ హైస్కూల్ రోడ్డుపై లీకవుతున్న వాటర్ పైప్‌లైన్ కరీంనగర్ నగరంలోని గంజ్ హైస్కూల్ రోడ్డులో వాటర్ పైప్‌లైన్ లీకై నీరు రోడ్డుపై ఏరులై పారుతోంది. రహదారి మధ్యలోనే పైపు పగిలిపోవడంతో లక్షలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. రోడ్డంతా నీరు నిలిచి బురదమయంగా మారడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు. హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.2
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- దండేపల్లి: మంచిర్యాల - అదిలాబాద్ ప్రధాన రహదారి పై గుంతతో వాహనదారుల ఇబ్బందులు దండేపల్లి మండల కేంద్రంలోని మంచిర్యాల -అదిలాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాత్రివేళల్లో గుంత కనిపించక మరింత ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.1
- కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.1
- నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం హత్య అనంతరం కారులో పరారైన దుండగులు ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం పోలీసులు గాలింపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం1