logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు: దసరా సెలవులతో బస్టాండ్లలో పెరుగుతున్న రద్దీ... దసరా సెలవుల నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. నర్సంపేట, హనుమకొండ, ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు అధికమవుతున్నాయి. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య, సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

5 hrs ago
user_Karunya
Karunya
ములుగు, ములుగు, తెలంగాణ•
5 hrs ago

ములుగు: దసరా సెలవులతో బస్టాండ్లలో పెరుగుతున్న రద్దీ... దసరా సెలవుల నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. నర్సంపేట, హనుమకొండ, ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు అధికమవుతున్నాయి. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య, సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు: దసరా సెలవులతో బస్టాండ్లలో పెరుగుతున్న రద్దీ... దసరా సెలవుల నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. నర్సంపేట, హనుమకొండ, ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు అధికమవుతున్నాయి. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య, సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
    2
    ములుగు: దసరా సెలవులతో బస్టాండ్లలో పెరుగుతున్న రద్దీ...
దసరా సెలవుల నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. నర్సంపేట, హనుమకొండ, ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు అధికమవుతున్నాయి. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య, సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    5 hrs ago
  • సమాచార హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచాలి. చట్టం అమలులో అధికారులు బాధ్యతగా పనిచేయాలి. జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, స్థానిక సంస్థలు సంపత్ రావు. ములుగు అక్టోబర్ 9: సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి , స్థానిక సంస్థలు సంపత్ రావులు అన్నారు. సమాచార హక్కు వారోత్సవాలు–2026లో భాగంగా శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం–2005 జిల్లా స్థాయి వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్న సమాచార హక్కు వారోత్సవాలు–2026 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సీహెచ్ మహేందర్, సంపత్ రావు, అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ, పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని సూచించారు. అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని కోరే విధానాన్ని ప్రజలకు వివరించాలని, ప్రజాప్రతినిధులు, పౌరులు, పౌరసమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టం అమలులో ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తమ విధులు, బాధ్యతలు, చట్టంలో నిర్దేశించిన గడువు, విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని, సెక్షన్ 4(1)(బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అవగాహన పత్రాలు, నోటీసులను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా పాలనపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సమాచారం కోసం వచ్చే పౌరులకు దరఖాస్తు ప్రక్రియపై తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని రోజువారీ విధుల్లో భాగంగా పాటించాలని, ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలో ప్రతి అధికారి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, జిల్లా అధికారులు, పిఐఓ లు, అసిస్టెంట్ పిఐఓలు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    సమాచార హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచాలి.

చట్టం అమలులో అధికారులు బాధ్యతగా పనిచేయాలి.

జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, స్థానిక సంస్థలు సంపత్ రావు. 

ములుగు అక్టోబర్ 9: సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి , స్థానిక సంస్థలు సంపత్ రావులు అన్నారు.
సమాచార హక్కు వారోత్సవాలు–2026లో భాగంగా శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం–2005 జిల్లా స్థాయి వారోత్సవాల కార్యక్రమాన్ని  నిర్వహించారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్న సమాచార హక్కు వారోత్సవాలు–2026 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సీహెచ్ మహేందర్, సంపత్ రావు, అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. 
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ, పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని సూచించారు. అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని కోరే విధానాన్ని ప్రజలకు వివరించాలని, ప్రజాప్రతినిధులు, పౌరులు, పౌరసమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
చట్టం అమలులో ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తమ విధులు, బాధ్యతలు, చట్టంలో నిర్దేశించిన గడువు, విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని, సెక్షన్ 4(1)(బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అవగాహన పత్రాలు, నోటీసులను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా పాలనపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సమాచారం కోసం వచ్చే పౌరులకు దరఖాస్తు ప్రక్రియపై తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని రోజువారీ విధుల్లో భాగంగా పాటించాలని, ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలో ప్రతి అధికారి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, జిల్లా అధికారులు, పిఐఓ లు, అసిస్టెంట్ పిఐఓలు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    6 hrs ago
  • రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు..అతి వేగానికి అడ్డుకట్ట : ఎస్సై తాజుద్దీన్ జిల్లా గోవిందరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ములుగు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పస్రా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ రవీందర్ సూచనలు, పాటిస్తూ సీఐ దయాకర్ పర్యవేక్షణలో మేరకు పస్రా ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. పండుగల నేపథ్యంలో రహదారులపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై తాజుద్దీన్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. లారీ డ్రైవర్లు వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై ఇతర వాహనదారులు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చర్యలు రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు తీవ్ర విషాదానికి గురవుతున్నాయని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై బాధ్యతతో వ్యవహరించాలని ఎస్సై కోరారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసుల తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.ప్రయాణికులు, వాహనదారులు పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పస్రా పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్.సి ఆర్ పి ఆఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు
    2
    రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు..అతి వేగానికి అడ్డుకట్ట  : ఎస్సై తాజుద్దీన్
జిల్లా గోవిందరావుపేట మండలంలో  రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ములుగు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పస్రా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఐపిఎస్  ఆదేశాల మేరకు, డీఎస్పీ రవీందర్ సూచనలు, పాటిస్తూ సీఐ  దయాకర్ పర్యవేక్షణలో మేరకు పస్రా ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు.
పండుగల నేపథ్యంలో రహదారులపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై తాజుద్దీన్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. లారీ డ్రైవర్లు వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై ఇతర వాహనదారులు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చర్యలు
రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు తీవ్ర విషాదానికి గురవుతున్నాయని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై బాధ్యతతో వ్యవహరించాలని ఎస్సై కోరారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసుల తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.ప్రయాణికులు, వాహనదారులు పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పస్రా పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్.సి ఆర్ పి ఆఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    6 hrs ago
  • బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించిన మెరాకిల్ ప్రైమ్ పాఠశాల ములుగు: జిల్లా కేంద్రంలోని మెరాకిల్ ప్రైమ్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి విద్యార్థులకు వివరించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తుమ్మ పిచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించిన మెరాకిల్ ప్రైమ్ పాఠశాల
ములుగు: జిల్లా కేంద్రంలోని మెరాకిల్ ప్రైమ్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి విద్యార్థులకు వివరించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తుమ్మ పిచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Mana Mulugu News
    Mana Mulugu News
    ములుగు, ములుగు, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజి) వైద్యులకు స్టైపెండ్ ఇవ్వాలని,తమ సమస్యలను, పరిష్కరించాలని,తెలంగాణ వ్యాప్తంగా ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన చేపట్టారు.ఇందులో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎఫ్‌ఎంజీ మెడికల్ వైద్యులు నిరసన,ధర్నా కార్యక్రమం నిర్వహించారు. *సమస్యలు పరిష్కరించాలని,ములుగు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన.* ************* *నేటి ప్రభాత సూర్య ( ములుగు జిల్లా బ్యూరో 09-అక్టోబర్):-* తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజి) వైద్యులకు స్టైపెండ్ ఇవ్వాలని,తమ సమస్యలను, పరిష్కరించాలని,తెలంగాణ వ్యాప్తంగా ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన చేపట్టారు.ఇందులో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎఫ్‌ఎంజీ మెడికల్ వైద్యులు నిరసన,ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఐఎంజి)తో సమానంగా స్టైపెండ్ అందించాలని,విదేశాల్లో యంబిబియస్ పూర్తి చేసి, యఫ్ఎంజి, పరీక్షలో అర్హత సాధించి, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న యఫ్ఎంజి వైద్యులకు స్టైపెండ్ అందించాలని,డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇతర ఇంటర్న్‌లతో పాటు వైద్య సేవల్లో పాల్గొంటూ,రోగుల సంరక్షణలో తమ వంతు బాధ్యతలు,నిర్వహిస్తున్నప్పటికీ, స్టైపెండ్ విషయంలో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.యఫ్ఎంజి ఇంటర్న్‌లకు భారతీయ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌తో సమానంగా స్టైపెండ్ అందించాల్సిన అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు,నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) మార్గదర్శకాలను వారు ప్రస్తావిస్తున్నారు.అయినప్పటికీ తెలంగాణలో తమ సమస్యకు పరిష్కారం లభించలేదని,సంబంధిత అధికారులు స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.స్టైపెండ్ లేకపోవడంతో హాస్టల్ ఫీజులు, గది అద్దె, భోజనం, రవాణా ఖర్చులు భరించడం ఆర్థికంగా భారంగా మారిందని తెలిపారు.ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు యఫ్ఎంజి వైద్యులు పేర్కొన్నారు. గత నెల 23వ తేదీన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంజి) కార్యాలయాన్ని సందర్శించి,తమ సమస్యలను వివరించి రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేసినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు.తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతున్నామని యఫ్ఎంజి వైద్యులు వెల్లడించారు.తమ డిమాండ్లపై సంబంధిత అధికారులు స్పందించి,వర్తించే నిబంధనలు మరియు కోర్టు ఆదేశాల ప్రకారం స్టైపెండ్ సమస్యకు న్యాయమైన పరిష్కారం చూపాలని కోరారు.“మాకు సానుభూతి కాదు,న్యాయం కావాలి.సమాన పనికి సమాన స్టైపెండ్ అందించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు, యన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం మా సమస్యను పరిశీలించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి” అని యఫ్ఎంజి వైద్యులు విజ్ఞప్తి చేశారు.
    4
    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజి) వైద్యులకు స్టైపెండ్ ఇవ్వాలని,తమ సమస్యలను, పరిష్కరించాలని,తెలంగాణ వ్యాప్తంగా ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన చేపట్టారు.ఇందులో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎఫ్‌ఎంజీ మెడికల్ వైద్యులు నిరసన,ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
*సమస్యలు పరిష్కరించాలని,ములుగు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన.* 
*************
*నేటి ప్రభాత సూర్య ( ములుగు జిల్లా బ్యూరో 09-అక్టోబర్):-* 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజి) వైద్యులకు స్టైపెండ్ ఇవ్వాలని,తమ సమస్యలను, పరిష్కరించాలని,తెలంగాణ వ్యాప్తంగా ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన చేపట్టారు.ఇందులో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎఫ్‌ఎంజీ మెడికల్ వైద్యులు నిరసన,ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఐఎంజి)తో సమానంగా స్టైపెండ్ అందించాలని,విదేశాల్లో యంబిబియస్ పూర్తి చేసి, యఫ్ఎంజి, పరీక్షలో అర్హత సాధించి, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న యఫ్ఎంజి వైద్యులకు స్టైపెండ్ అందించాలని,డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇతర ఇంటర్న్‌లతో పాటు వైద్య సేవల్లో పాల్గొంటూ,రోగుల సంరక్షణలో తమ వంతు బాధ్యతలు,నిర్వహిస్తున్నప్పటికీ, స్టైపెండ్ విషయంలో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.యఫ్ఎంజి ఇంటర్న్‌లకు భారతీయ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌తో సమానంగా స్టైపెండ్ అందించాల్సిన అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు,నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) మార్గదర్శకాలను వారు ప్రస్తావిస్తున్నారు.అయినప్పటికీ తెలంగాణలో తమ సమస్యకు పరిష్కారం లభించలేదని,సంబంధిత అధికారులు స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.స్టైపెండ్ లేకపోవడంతో హాస్టల్ ఫీజులు, గది అద్దె, భోజనం, రవాణా ఖర్చులు భరించడం ఆర్థికంగా భారంగా మారిందని తెలిపారు.ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు యఫ్ఎంజి వైద్యులు పేర్కొన్నారు. గత నెల 23వ తేదీన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంజి) కార్యాలయాన్ని సందర్శించి,తమ సమస్యలను వివరించి రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేసినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు.తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతున్నామని యఫ్ఎంజి వైద్యులు వెల్లడించారు.తమ డిమాండ్లపై సంబంధిత అధికారులు స్పందించి,వర్తించే నిబంధనలు మరియు కోర్టు ఆదేశాల ప్రకారం స్టైపెండ్ సమస్యకు న్యాయమైన పరిష్కారం చూపాలని కోరారు.“మాకు సానుభూతి కాదు,న్యాయం కావాలి.సమాన పనికి సమాన స్టైపెండ్ అందించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు, యన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం మా సమస్యను పరిశీలించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి” అని యఫ్ఎంజి వైద్యులు విజ్ఞప్తి చేశారు.
    user_Ashok Shanaboina (రిపోర్టర్)
    Ashok Shanaboina (రిపోర్టర్)
    Local News Reporter Mulug, Mulugu•
    11 hrs ago
  • బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా బతుకమ్మ జరుపుకోవాలి అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతితో దానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలంగాణ బిడ్డలు బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని, పూలను, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కలిపి జరుపుకునే ప్రత్యేకమైన పండుగ అని పేర్కొన్నారు. “బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ప్రకృతితో ముడిపడిన పండుగ. ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా.. ప్రతి గ్రామం సురక్షితంగా బతుకమ్మ జరుపుకునేలా ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది” అని మంత్రి సీతక్క తెలిపారు. బతుకమ్మ పండుగ రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి పండుగకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాలు, బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువులు, కుంటలు, ఘాట్‌ల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. బతుకమ్మ ఆడే ఘాట్‌లకు వెళ్లే మార్గాలను పూర్తిగా శుభ్రం చేయాలని, రహదారులపై గుంతలు ఉంటే వెంటనే పూడ్చాలని సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు ఉండేలా అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ఘాట్‌ల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్‌ చల్లడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉంటే తొలగించాలని ఆదేశించారు. బతుకమ్మ వేదికలను ముందుగానే శుభ్రం చేసి సిద్ధం చేయాలని, అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బతుకమ్మ ఘాట్‌లకు సరైన రహదారి సౌకర్యం లేని ప్రాంతాల్లో వీబీజీ రామ్‌ జీ పథకం కింద మట్టి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు పాల్గొంటారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట్ల మెట్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిధుల కొరత కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు. *ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి చాటుతున్న బతుకమ్మ* తెలంగాణలో పుట్టిన బతుకమ్మ పండుగ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మను జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. “ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డల గుండెల్లో బతుకమ్మ ఉంటుంది. పూలను పేర్చి బతుకమ్మను నిలబెట్టినట్టే.. మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా తరతరాలకు నిలబెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలంతా ఐక్యంగా, ఆనందంగా బతుకమ్మను జరుపుకోవాలి” అని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ప్రతి గ్రామంలో ఐక్యతను నింపాలని మంత్రి సీతక్క ఆకాంక్షిస్తూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
    1
    బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి

ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా బతుకమ్మ జరుపుకోవాలి

అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతితో దానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలంగాణ బిడ్డలు బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని, పూలను, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కలిపి జరుపుకునే ప్రత్యేకమైన పండుగ అని పేర్కొన్నారు. “బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ప్రకృతితో ముడిపడిన పండుగ. ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా.. ప్రతి గ్రామం సురక్షితంగా బతుకమ్మ జరుపుకునేలా ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది” అని మంత్రి సీతక్క తెలిపారు.
బతుకమ్మ పండుగ రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి పండుగకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాలు, బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువులు, కుంటలు, ఘాట్‌ల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
బతుకమ్మ ఆడే ఘాట్‌లకు వెళ్లే మార్గాలను పూర్తిగా శుభ్రం చేయాలని, రహదారులపై గుంతలు ఉంటే వెంటనే పూడ్చాలని సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు ఉండేలా అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. 
ఘాట్‌ల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్‌ చల్లడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉంటే తొలగించాలని ఆదేశించారు. బతుకమ్మ వేదికలను ముందుగానే శుభ్రం చేసి సిద్ధం చేయాలని, అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బతుకమ్మ ఘాట్‌లకు సరైన రహదారి సౌకర్యం లేని ప్రాంతాల్లో వీబీజీ రామ్‌ జీ పథకం కింద మట్టి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు పాల్గొంటారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట్ల మెట్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిధుల కొరత కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు.
*ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి చాటుతున్న బతుకమ్మ*
తెలంగాణలో పుట్టిన బతుకమ్మ పండుగ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మను జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
“ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డల గుండెల్లో బతుకమ్మ ఉంటుంది. పూలను పేర్చి బతుకమ్మను నిలబెట్టినట్టే.. మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా తరతరాలకు నిలబెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలంతా ఐక్యంగా, ఆనందంగా బతుకమ్మను జరుపుకోవాలి” అని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ప్రతి గ్రామంలో ఐక్యతను నింపాలని మంత్రి సీతక్క ఆకాంక్షిస్తూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Chunchu Ramesh
    Chunchu Ramesh
    Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
    19 hrs ago
  • ముత్తోజిపేటలో ఘనంగా బొడ్డెమ్మ చివరి వేడుకలు............ నర్సంపేట: మున్సిపల్ పరిధిలోని ముత్తోజిపేటలో బొడ్డెమ్మ చివరి వేడుకలను మహిళలు కోలాటాలు, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. బొడ్డెమ్మ చరిత్ర, విశిష్టతను వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇటువంటి ఆచారాలను కొనసాగించడం అభినందనీయమని మహిళలు పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ సంప్రదాయాలను కొనసాగిస్తామని తెలిపారు.
    2
    ముత్తోజిపేటలో ఘనంగా బొడ్డెమ్మ చివరి వేడుకలు............
నర్సంపేట: మున్సిపల్ పరిధిలోని ముత్తోజిపేటలో బొడ్డెమ్మ చివరి వేడుకలను మహిళలు కోలాటాలు, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. బొడ్డెమ్మ చరిత్ర, విశిష్టతను వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇటువంటి ఆచారాలను కొనసాగించడం అభినందనీయమని మహిళలు పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ సంప్రదాయాలను కొనసాగిస్తామని తెలిపారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • సమాచార హక్కు చట్టంతో పారదర్శకత – ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సమాచార హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచాలి చట్టం అమలులో అధికారులు బాధ్యతగా పనిచేయాలి జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, స్థానిక సంస్థలు సంపత్ రావు. ములుగు జిల్లాలో సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి , స్థానిక సంస్థలు సంపత్ రావులు అన్నారు. సమాచార హక్కు వారోత్సవాలు–2026లో భాగంగా శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం–2005 జిల్లా స్థాయి వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్న సమాచార హక్కు వారోత్సవాలు–2026 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సీహెచ్ మహేందర్, సంపత్ రావు, అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ, పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని సూచించారు. అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని కోరే విధానాన్ని ప్రజలకు వివరించాలని, ప్రజాప్రతినిధులు, పౌరులు, పౌరసమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టం అమలులో ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తమ విధులు, బాధ్యతలు, చట్టంలో నిర్దేశించిన గడువు, విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని, సెక్షన్ 4(1)(బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అవగాహన పత్రాలు, నోటీసులను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా పాలనపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సమాచారం కోసం వచ్చే పౌరులకు దరఖాస్తు ప్రక్రియపై తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని రోజువారీ విధుల్లో భాగంగా పాటించాలని, ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలో ప్రతి అధికారి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, జిల్లా అధికారులు, పిఐఓ లు, అసిస్టెంట్ పిఐఓలు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    3
    సమాచార హక్కు చట్టంతో పారదర్శకత – ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సమాచార హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచాలి
చట్టం అమలులో అధికారులు బాధ్యతగా పనిచేయాలి జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, స్థానిక సంస్థలు సంపత్ రావు. 
ములుగు జిల్లాలో సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి , స్థానిక సంస్థలు సంపత్ రావులు అన్నారు. సమాచార హక్కు వారోత్సవాలు–2026లో భాగంగా శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం–2005 జిల్లా స్థాయి వారోత్సవాల కార్యక్రమాన్ని  నిర్వహించారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్న సమాచార హక్కు వారోత్సవాలు–2026 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ సీహెచ్ మహేందర్, సంపత్ రావు, అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.  ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ, పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని సూచించారు. అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని కోరే విధానాన్ని ప్రజలకు వివరించాలని, ప్రజాప్రతినిధులు, పౌరులు, పౌరసమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టం అమలులో ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తమ విధులు, బాధ్యతలు, చట్టంలో నిర్దేశించిన గడువు, విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని, సెక్షన్ 4(1)(బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అవగాహన పత్రాలు, నోటీసులను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా పాలనపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సమాచారం కోసం వచ్చే పౌరులకు దరఖాస్తు ప్రక్రియపై తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని రోజువారీ విధుల్లో భాగంగా పాటించాలని, ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలో ప్రతి అధికారి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, జిల్లా అధికారులు, పిఐఓ లు, అసిస్టెంట్ పిఐఓలు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.