మహిళా ఉద్యోగులకు భద్రత లేదు అనడానికి నిదర్శనమే -సింగరేణిలో సంచలనంగా అక్షిత రాణి ఘటన సెప్టెంబర్ 16:సింగరేణిలో మహిళా ఉద్యోగులకు భద్రత కొరవడిందన్నదానికి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తోటి మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం, వారిని వేధింపులకు గురిచేయడం లాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా రామగుండం ఏరియా గోదావరిఖని 2వ గనిలో అక్షిత రాణి సంఘటన మరోసారి రుజువు చేసింది. RG2 చెందిన ఓవర్మెన్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు, బాధితురాలు ఉత్తరం రాసి బలవన్మరణం పొందినట్టు పలు కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టడం సంచలనంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీ టెక్ చేస్తున్న ఆమె రెండవ ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో భాగంగా గనిలో విధులు నిర్వహిస్తున్నదని, శిక్షణ కోసం వచ్చిన మహిళల పట్ల గౌరవంగా ఉండాల్సిన, విధుల పట్ల మెలకువలు, పని విధానాలపై అవగాహన కల్పించాల్సిన ఓవర్మెన్ లు వంకర బుద్ధితో వ్యవహరించడం ఖండించదగినదని నాయకులు ఆందోళన చేపట్టారు. తాను అనుభవించిన వేదన, క్షోభను వివరిస్తూ, న్యాయం కోసం గని అధికారి, ఏరియా జీఎం కు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడం, నిర్లక్ష్యం చేయడంతో మానసిక క్షోభకు గురై బలవన్మరణానికి పాల్పడిందని, పోలీసులకు చెప్పిన ఫలితం లేక పోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడిందని నిరసనలు చేపట్టారు. పోలీసులు, అధికారులు చేతనటు న్యాయం జరగదని, అక్షిత రాణి తన అఘాయిత్యానికి పాల్పడిందని సింగరేణి ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ఇతర కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంఘటనపై న్యాయపరమైన, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి మహిళా ట్రైనర్ అక్షిత రాణి మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిని గుర్తించి కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని సింగరేణి1630/1982 ఎస్సీ ఎస్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మరియు సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపెల్లి రాజేష్ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సింగరేణిలో , ఇక ముందు ఇలాంటి సంఘటనలు సంస్థలో జరుగకుండా యాజమాన్యం గట్టి చర్యలు చేపట్టాలని, నిందితులపట్ల కఠినంగా వ్యవహరించాలని, మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణ కు ఉత్తమ చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు. ఈ లాంటి సంఘటనలు కంపెనీకి చెడ్డ పేరు తీసుకువస్తాయని, కంపెనీలో ఉద్యోగాలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపరని అన్నారు. అక్షిత రాణి సంఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిపై చర్యలు చేపట్టి మహిళలకు భరోసా కలిగించాలని ఎస్సీ ఎస్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ & సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపెల్లి రాజేష్ కుమార్ పేర్కొన్నారు

- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.3
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.1
- 56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1