నాచారం–మల్లాపూర్‌లో సీసీ కెమెరా నిఘా మరింత బలోపేతం _ 50 హెచ్చరిక బోర్డుల ఏర్పాటు.. రిపేర్‌లో ఉన్న కెమెరాల మరమ్మతులకు చర్య నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ “మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు” అనే హెచ్చరిక బోర్డులను మొత్తం 50 చోట్ల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నాచారం ఎస్‌హెచ్‌ఓ ధనంజయ్ ఆధ్వర్యంలో చేపట్టారు.ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన రహదారులు, కాలనీలు, వ్యాపార ప్రాంతాలు మరియు రద్దీ కూడళ్ల వద్ద ఈ బోర్డులను ఏర్పాటు చేశారు.అలాగే, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో రిపేర్‌లో ఉన్న సీసీ కెమెరాలను గుర్తించి వాటి మరమ్మతు పనులను కూడా వేగవంతం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా ప్రాంతంలో జరిగే అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించి నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

- పోక్సో కేసులో బండి భగీరథ్ పరారీ.. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని విచారణాధికారి రితిరాజ్ తెలిపారు. మూడు రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తూ ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, అవసరమైతే మరోసారి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు.1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం: సీఎం రేవంత్ రెడ్డి రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోరుడును రద్దుచేసి పాఠశాల విద్యలో కలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలిపారు.1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- రామాయంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కౌన్సిలర్ శంకర్ గౌడ్. రామాయంపేట: మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ గళమెత్తారు. అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణకు తక్షణమే మార్కింగ్ చేసి, బాధితులకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. బజాజ్ షోరూం వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాప్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.గత బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట వెనుకబాటుకు గురైందని విమర్శిస్తూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఎమ్మెల్యేలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన TUFIDC నిధులతో పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.1
- ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్ RR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.1