Shuru
Apke Nagar Ki App…
*బాక్సాఫీస్‌కి సంక్రాంతి జోష్* * సంక్రాంతి అంటే సినిమాకీ పెద్ద పండగే. వారం నుంచి పది రోజుల వరకూ కిక్కిరిసిపోయే ప్రేక్షకులతో థియేటర్లు జాతరని తలపిస్తుంటాయి. వసూళ్లతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. బరిలోని కోళ్లని తలపించేలా కొత్త చిత్రాలు పోటాపోటీగా విడుదలవుతాయి. ఇక చిత్ర పరిశ్రమలో అయితే నెల రోజుల ముందు నుంచే వ్యాపారం ఊపందుకుంటుంది. 2026 సంక్రాంతి కూడా అదే జోష్‌తోనే మొదలైంది. ఈసారి విడుదలవుతున్న సినిమాల సంఖ్య ఇంకా ఎక్కువ కావడంతో వ్యాపారం పరంగా ఇది అతి పెద్ద సినీ సంక్రాంతి కానుందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే విడుదలైన సినిమాల ప్రారంభ వసూళ్ల సరళి అంచనాలకి దీటుగానే కనిపిస్తోంది.
Nandikolla Raju
*బాక్సాఫీస్‌కి సంక్రాంతి జోష్* * సంక్రాంతి అంటే సినిమాకీ పెద్ద పండగే. వారం నుంచి పది రోజుల వరకూ కిక్కిరిసిపోయే ప్రేక్షకులతో థియేటర్లు జాతరని తలపిస్తుంటాయి. వసూళ్లతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. బరిలోని కోళ్లని తలపించేలా కొత్త చిత్రాలు పోటాపోటీగా విడుదలవుతాయి. ఇక చిత్ర పరిశ్రమలో అయితే నెల రోజుల ముందు నుంచే వ్యాపారం ఊపందుకుంటుంది. 2026 సంక్రాంతి కూడా అదే జోష్‌తోనే మొదలైంది. ఈసారి విడుదలవుతున్న సినిమాల సంఖ్య ఇంకా ఎక్కువ కావడంతో వ్యాపారం పరంగా ఇది అతి పెద్ద సినీ సంక్రాంతి కానుందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే విడుదలైన సినిమాల ప్రారంభ వసూళ్ల సరళి అంచనాలకి దీటుగానే కనిపిస్తోంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- Post by Ravi Poreddy1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- 🙏🏻🙏🏻1
- 🙏🙏1
- బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది ఆలయ మెయిన్ డోర్ కు ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి హుండీలో ఉన్న నగదు తో పాటు బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని గీత కార్మికులు తెలిపారు1