logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వర్ష ప్రభావం తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. చిన్నగూడూరు:వర్షాల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైతులు పంటలు, పశువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.చిన్నగూడూరు మండల ప్రత్యేక అధికారి, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... వర్షపు నీరు నిలవకుండా చూడాలని, పశువులకు సురక్షితమైన చోట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

17 hrs ago
user_మానుకోట వార్తలు
మానుకోట వార్తలు
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
17 hrs ago
940c0b04-4d9e-4e0d-b677-839ea968834e

వర్ష ప్రభావం తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. చిన్నగూడూరు:వర్షాల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైతులు పంటలు, పశువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.చిన్నగూడూరు మండల ప్రత్యేక అధికారి, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... వర్షపు నీరు నిలవకుండా చూడాలని, పశువులకు సురక్షితమైన చోట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    1
    మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన..
మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    1
    అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి
*వీందో డ్రామా... వాందో డ్రామా😤*
అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*
దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే 
ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    1
    పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...
పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    56 min ago
  • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    1
    ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు
జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.  ప్రభుత్వ ఆదేశాల  మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి  నల్లబెల్లి లో నిర్వహించే  అంతిమ సంస్కారానికి హాజరై  నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు.
అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు,  కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. మహబూబాబాద్ జిల్లా జులై 31 హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 
హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. 
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. 

మహబూబాబాద్ జిల్లా జులై 31
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Yakaiah-Pushpa
    Yakaiah-Pushpa
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత కొనసాగింపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 10.700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ప్రస్తుతం 8,03,370 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.
    1
    కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత కొనసాగింపు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 10.700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ప్రస్తుతం 8,03,370 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • గ్రోమోర్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు రైతులకు ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    గ్రోమోర్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ 
కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు రైతులకు ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    3
    కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి
మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం  కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం .
ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి .
కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు .....
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.