logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్షరాయుధం ముసుగులో 'అక్రమ' సామ్రాజ్యం: చిలివేరి నరసయ్యపై 'దుర్యోధన ఆపరేషన్'! ఒక సామాన్య పత్రికా విలేకరి.. అదీ మండల స్థాయి ప్రతినిధి. కానీ ఆస్తి చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే! జన్నారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి హోదాలో సాగుతున్న అక్రమాల పర్వంపై ఇప్పుడు ప్రజలు కరపత్రాలు, సామాజిక మాధ్యమాల వేదికగా సమరశంఖం పూరించారు. 'మన తెలంగాణ' పత్రిక ముసుగులో చిలివేరి నరసయ్య సాగిస్తున్న దందాలను రట్టు చేసేందుకు 'దుర్యోధన ఆపరేషన్' పేరుతో స్థానికులు నడుం బిగించారు. ​ప్రశ్నల వర్షం: ఈ ఆస్తులు ఎక్కడివి? ​గత మూడు దశాబ్దాలుగా జన్నారంలో విలేకరిగా కొనసాగుతున్న నరసయ్య ఆర్థిక ప్రస్థానంపై ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ​నాలుగు మేడలు - కోట్లలో వెల: సామాన్య మధ్యతరగతి విలేకరి జీతంతో జన్నారంలో నాలుగు భారీ భవనాలు ఎలా వెలిశాయి? ​వ్యాపారాలు ఏవి?: ఏ పొలంలో కూలి పని చేశాడు? ఏ బిజినెస్ చేశాడు? ఈ కోట్ల రూపాయల నగదు, ఆస్తులు గాలిలో నుండి ఊడిపడ్డాయా? ​బ్లాక్ మెయిలింగ్.. కబ్జాలే పెట్టుబడి! ​నరసయ్య కార్యకలాపాలపై వస్తున్న ఆరోపణలు వింటే ఆయన ఒక జర్నలిస్టులా కాకుండా, ఒక 'సెటిల్మెంట్ దందారీ'గా కనిపిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​బెదిరింపుల దందా: మండలంలో జరిగే చిన్నపాటి లోపాలను భూతద్దంలో చూపిస్తూ, వార్తలు రాయకుండా ఉండేందుకు అధికారులను, వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేసి లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. ​అమాయకులపై కేసులు: తన అక్రమాలకు అడ్డువచ్చిన వారిపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి అక్రమ కేసులు పెట్టించడంలో నరసయ్య సిద్ధహస్తుడని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ​భూముల ఆక్రమణ: అధికారాన్ని అడ్డుపెట్టుకుని, సామాన్యుల భూములను కబ్జా చేసి వాటిపై తన అధికారాన్ని చెలాయిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​'దుర్యోధన ఆపరేషన్' - విచారణకు డిమాండ్ ​"అక్షరం అమ్మకానికి కాదు.. అది అక్రమార్కుల పాలిట సింహస్వప్నం కావాలి. కానీ నరసయ్య జర్నలిజం పేరుతో మా జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాడు" అని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ​ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించాలి. ​నరసయ్య ఆస్తులపై లోతైన విచారణ జరిపి, ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ​అమాయక ప్రజలపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలి. ​హెచ్చరిక: నరసయ్య పాల్పడుతున్న ప్రతి అక్రమాన్ని రోజువారీ వార్తల రూపంలో 'దుర్యోధన ఆపరేషన్' ద్వారా ప్రజల ముందుకు తెస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.

2 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
జర్నలిస్ట్ జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago
edf3a2d7-fccf-486a-9fe7-98cc2965c683

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    1
    జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....
    1
    బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్.
ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు.
ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్..
రెండవ నిందితుడిగా  చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు..
ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...!
14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..!
మరికొద్ది సేపట్లో  ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు.
ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...!
....
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    11 hrs ago
  • కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాజురా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే పాల్గొన్నారు. ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవుదినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.
    1
    కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాజురా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవుదినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలో బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ,సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధించిన సన్మార్గం సమానత్వం సామాజిక న్యాయం సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని సమాజంలోని ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజేన్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మార్మాట్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు బంజారా సమాజ పెద్దలు బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలో బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ,సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధించిన సన్మార్గం సమానత్వం సామాజిక న్యాయం సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని సమాజంలోని ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజేన్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మార్మాట్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు బంజారా సమాజ పెద్దలు బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    12 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ
రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
    1
    కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 21వ వార్డు సభ్యురాలు దూసరి కృష్ణవేణి గైర్హాజరు కావడంపై బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో శివ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల రోజున డబ్బులు తీసుకుని హాజరు కాలేదన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోనని స్పష్టం చేస్తూ, ఆరోపణలు ఆధారాలతో చేయాలని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తన విజయంలో భాగమైన 21వ వార్డు సభ్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు నాయకత్వంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల హామీలను అమలు చేస్తానని తెలిపారు.
    1
    కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 21వ వార్డు సభ్యురాలు దూసరి కృష్ణవేణి గైర్హాజరు కావడంపై బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో శివ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఎన్నికల రోజున డబ్బులు తీసుకుని హాజరు కాలేదన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోనని స్పష్టం చేస్తూ, ఆరోపణలు ఆధారాలతో చేయాలని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.
తన విజయంలో భాగమైన 21వ వార్డు సభ్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు నాయకత్వంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల హామీలను అమలు చేస్తానని తెలిపారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.