ప్రణాళిక ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పోటీ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు యువత, అభ్యర్థులు సిద్ధమవుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడారు. విద్యార్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఏ ఏ పుస్తకాలు చదువుతున్నారు? ఆరా తీశారు. రోజా ఎంత మంది లైబ్రరీకి వస్తారని గ్రంథాలయ అధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం.. ప్రతి అంశం క్షుణ్ణంగా చదవాలని సూచించారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై మంచి అవగాహనతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్ గా తీసుకోవాలని సూచించారు.
ప్రణాళిక ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పోటీ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు యువత, అభ్యర్థులు సిద్ధమవుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడారు. విద్యార్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఏ ఏ పుస్తకాలు చదువుతున్నారు? ఆరా తీశారు. రోజా ఎంత మంది లైబ్రరీకి వస్తారని గ్రంథాలయ అధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం.. ప్రతి అంశం క్షుణ్ణంగా చదవాలని సూచించారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై మంచి అవగాహనతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్ గా తీసుకోవాలని సూచించారు.
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాల్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ గోపాల్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఆదరణను పెంచేలా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభగలవారీగా ప్రభుత్వం చే ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు విద్యా భోధన చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నేటి పోటీ ప్రపంచంలో ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకంటే మెరుగైన విషయ పరిజ్ఞానాన్ని అందించి విద్యార్థులను ఉపాధ్యాయులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా విద్యను అందిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాఠశాలను తక్కువ భావనతో చూడకుండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ లు తీసుకోవాలని అన్నారు.. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా తిలకించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, ఎంఈవో దూసరగుపతి, విద్యాశాఖ క్లస్టర్ ఇంచార్జ్ హెచ్ఎం మోతిలాల్, నెహ్రూ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా మాధురి, బోప్ప దేవయ్య , ఓజ్జాల అగ్గి రాములు మొదలగువారు పాల్గొన్నారు.1
- పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి *సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ మిషన్స్ డొనేషన్* యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో * ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై సానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో జెండర్ సమానత్వం పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి యువత మీ కళలు సాకారం చేసుకోండి అన్నారు * మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు. శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. డాక్టర్ ఉమేష్ కుమార్ వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ – వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్) డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం, డాక్టర్ సావిత్రి శాతవాహన యూనివర్సిటీ ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.2
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...4
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.1
- జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలందించిన జూనియర్ అసిస్టెంట్ జన్మంచి లక్ష్మీరాజం బదిలీపై జగిత్యాల జిల్లా పెంబట్లలోని దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందజేసి, స్వామివారి శేషవస్త్రం మరియు లడ్డూ ప్రసాదాన్ని అందించారు.తదనంతరం, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ తరఫున అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి. వంశీ మోహన్ సమక్షంలో ఆలయ సిబ్బంది లక్ష్మీరాజంని కండువాతో సత్కరించి, ఆయన సుదీర్ఘ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘునందన్, ఏఈఓ శ్రవణ్ కుమార్, జయకుమారి పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, రాజు, పూజిత,శివ సాయి , మరియు ఇతరులు పాల్గొన్నారు1