హైదరాబాద్ డీజీపీ సీవీ ఆనంద్ గారిని కలిసిన తెలంగాణ దివ్యాంగుల ఐక్య వేదిక ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శ్రీ సీవీ ఆనంద్ గారిని ఈరోజు తెలంగాణ దివ్యాంగుల ఐక్య వేదిక ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలు ప్రెస్ నోట్ తేదీ: 11 మే, 2026 వేదిక: DGP కార్యాలయం, హైదరాబాద్ డీజీపీ సీవీ ఆనంద్ గారిని కలిసిన తెలంగాణ దివ్యాంగుల ఐక్య వేదిక ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శ్రీ సీవీ ఆనంద్ గారిని ఈరోజు తెలంగాణ దివ్యాంగుల ఐక్య వేదిక ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం, రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం - 2016 (RPwD Act) అమలు తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో ఈ చట్టాన్ని అత్యంత పటిష్టంగా అమలు చేయాలని, పోలీస్ స్టేషన్ల స్థాయిలో సిబ్బందికి చట్టంపై సమగ్ర అవగాహన కల్పించాలని ప్రతినిధులు డీజీపీ గారిని కోరారు. దివ్యాంగులపై జరిగే దాడులు, వేధింపుల కేసుల్లో పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. అలాగే, అన్ని పోలీసు కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవశ్యకతను వివరించారు. ఈ విన్నపాలపై డీజీపీ గారు సానుకూలంగా స్పందిస్తూ.. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు, వారి భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దివ్యాంగుల ఐక్య వేదిక ప్రతినిధులు తుడుం రాజేందర్, ఎం.డి. షఫీ అహ్మద్ ఖాన్, సైబర్ క్రైమ్ నిపుణులు పి. మాధవరెడ్డి, అనురాధ, ఎ. అశోక్, మంద భిక్షపతి యాదవ్, ఎం. గంగారెడ్డి, ఎం. శ్రీకాంత్ రెడ్డి, కాస ప్రవీణ్, లలిత జేన, జి. ప్రవీణ, జూపల్లి సోమేశ్వర్ మరియు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- కామారెడ్డి మండలం : భవానిపేట్ తండా కస్తూర్బా గాంధీ కేజీబీవీలో విద్యా వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రికా ప్రకటన కామారెడ్డి జిల్లా తేదీ: 11.05.2026 సోమవారం విద్యా వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల తొలి రోజు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం పాల్వంచ మండలం భవానిపేట్ తాండా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న సమ్మర్ క్యాంప్ ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కేజీబీవీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభ, నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేయడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థినులు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యా వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జయరాజ్ పాల్వంచ తాసిల్దార్ జనార్ధన్. డిఎల్పిఓ శ్రీనివాస్. Meo. ప్రిన్సిపల్ మహిషా. Deco సుకన్య సంబంధిత శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనల్లో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.1
- రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం1
- కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలో ముదిరాజుల కులదేవత శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాలతో పాటు గ్రామమంతా ఏకమై జాతరను ఘనంగా నిర్వహించగా, దాతలకు సన్మానాలు చేశారు.1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ అంతిమయాత్రలో పాల్గొని పాడేమోసిన గజ్వేల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మృతుడు తేరాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. తేరాల శ్రీనివాస్ గారి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు పండరి రవీందర్ రావు,మాజీ అశోక్, గ్రామ brs అధ్యక్షుడు భాస్కర్,ఉపసర్పంచ్ నర్సింలు,వార్డు సభ్యుల కర్ణాకర్,ప్రవీణ్, గ్రామస్తులు తదితరులున్నారు4
- మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. తూకాలలో మోసాలు, అధిక తేమ శాతం నిబంధనలు, రైస్ మిల్లుల జాప్యం వంటి అనేక సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- కామారెడ్డి జిల్లా : ప్రజావాణిలో 111 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు పత్రికా ప్రకటన కామారెడ్డి జిల్లా తేదీ: 11.05.2026 సోమవారం ప్రజావాణి లో 111 దరఖాస్తులు ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సందర్బంగా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ప్రజావాణిలో వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, విద్యుత్, భూ సమస్యలు, మహిళా సమైక్య భవనం ఏర్పాటు, పరిశీలించి రాజాంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన బంటు శ్యామయ్య తనకు రేకుల షెడ్డు, బర్రెల కొట్టం నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని, తదితర అర్జీలను పరిశీలించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం పెండింగ్ ఉన్న దరఖాస్తులను వెంటనే పరుష్కరించాలని, తహసీల్దార్ లు ఆయా మండలాలకు సంబందించిన దరఖాస్తులను పరిశీలించి అర్జీదారుని సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు.1
- మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్షలో 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా చూడాలని, దానిపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మే 13 నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు, ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పన, జనగణన హౌస్ లిస్టింగ్ విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.1