తెలంగాణ భవన్ లో విద్యార్థి విభాగం సమావేశంలో మాట్లాడిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి (BRS) విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన *- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు* 🔹 మూసి సుందరీకరణ మనం 16 వేల కోట్లతో చేయాలని మనం అనుకున్నాం 🔹 మూసి పునరుజ్జీవం పేరుతో లక్ష 50 వేల కోట్ల స్కాం కి రేవంత్ రెడ్డి తెరలేపారు.. 🔹 పేదల ఇండ్లు కులగొడుతాం , లక్ష మందిని రోడ్డు మీదకు తీసుకువస్తాం అంటే చూస్తూ ఊరుకోం 🔹 విద్యార్థులు అందరూ టీం లు గా ముసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. 🔹 రాష్ట్రంలోఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు.. 🔹 మూసి సుందరీకరణ కు మనం వ్యతిరేకం కాదు లక్ష కోట్ల కుంభకోణానికి వ్యతిరేకం 🔹 గత కొన్ని సంవత్సరాల నుండి సూర్యాపేట జిల్లాలో సాగు, తాగు నీరు మూసి ప్రాజెక్టు ద్వారానే అందుతుంటే, కేసీఆర్ గారు పాలేరు జలాలను తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సూర్యాపేట జిల్లాకు అందించాడు 🔹 KTR గారి ఆదేశాల మేరకు మనం అందరం కలిసి పోరాడుదాం ,,ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం
తెలంగాణ భవన్ లో విద్యార్థి విభాగం సమావేశంలో మాట్లాడిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి (BRS) విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన *- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు* 🔹 మూసి సుందరీకరణ మనం 16 వేల కోట్లతో చేయాలని మనం అనుకున్నాం 🔹 మూసి పునరుజ్జీవం పేరుతో లక్ష 50 వేల కోట్ల స్కాం కి రేవంత్ రెడ్డి తెరలేపారు.. 🔹 పేదల ఇండ్లు కులగొడుతాం , లక్ష మందిని రోడ్డు మీదకు తీసుకువస్తాం అంటే చూస్తూ ఊరుకోం 🔹 విద్యార్థులు అందరూ టీం లు గా ముసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. 🔹 రాష్ట్రంలోఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు.. 🔹 మూసి సుందరీకరణ కు మనం వ్యతిరేకం కాదు లక్ష కోట్ల కుంభకోణానికి వ్యతిరేకం 🔹 గత కొన్ని సంవత్సరాల నుండి సూర్యాపేట జిల్లాలో సాగు, తాగు నీరు మూసి ప్రాజెక్టు ద్వారానే అందుతుంటే, కేసీఆర్ గారు పాలేరు జలాలను తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సూర్యాపేట జిల్లాకు అందించాడు 🔹 KTR గారి ఆదేశాల మేరకు మనం అందరం కలిసి పోరాడుదాం ,,ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం
- తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.1
- జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం1
- Post by T.Shiva Krishna1
- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.1
- 30/03/2026 కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్.. రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు.. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు.. నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు.. రామప్ప - రంగాయి చెరువు - పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు.. రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 TMC నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తి చేసాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 2ఏండ్లు పూర్తి ఐనా నేటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు.. గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది.. సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది. తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు 32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది రీ డిజైన్ చేసి ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము 87శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు... ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి ... దొంతి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి 40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి, నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది... దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు , ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ, అనుమతులు తెచ్చే పరిస్థితి లేదు, రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువనిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.. కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు.. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది. నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం.. లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది.. తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి.. ఈ నిరసన ఆరంభం మాత్రమే.. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం.. నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.. నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి.. నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త రూపంలో3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వర్షం కారణంగా పలువురు రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల మొక్కజొన్న పంట నేలకొరిగింది. పంట నష్టంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.1
- నల్లబెల్లి, మార్చి 30: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప–రంగయ్య చెరువు–పాకాల ప్రాజెక్ట్‌లో భాగమైన కాలువల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ హయాంలో గోదావరి జలాలను రంగయ్య చెరువుకు తరలించే పనులు పూర్తి చేసి, 32,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం సుమారు 87 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను రెండు సంవత్సరాలుగా పూర్తి చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. కాలువల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.40 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, మిగిలిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలరోజుల గడువు విధిస్తున్నామని, ఆలోపు పనులు పూర్తి చేయకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నర్సంపేట కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ నిరసనలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లాలో కొత్త తరహాలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ పేరుతో మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని తమతో పాటు రావాలని చెప్పడం తో ఆ మహిళ వారిని అనుసరించింది. మహిళను మభ్యపెట్టిన దుండగులు మహిళను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో మహిళా మోసపోయనని గ్రహించి ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. చేసింది. రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.1