Shuru
Apke Nagar Ki App…
సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి... సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్ సూచించారు. సోమవారం జన్నారం జడ్పీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును వారు ప్రారంభించారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు డ్యాన్సు, కుట్లు అల్లికలు,యోగా నేర్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
P.G. Murthy
సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి... సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్ సూచించారు. సోమవారం జన్నారం జడ్పీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును వారు ప్రారంభించారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు డ్యాన్సు, కుట్లు అల్లికలు,యోగా నేర్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ₹9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, పరిశ్రమలు, రైల్వేలు, టెక్స్‌టైల్ పార్కులు వంటి కీలక రంగాల్లో ఈ పనులు రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇవ్వనున్నాయి. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ముఖ్యమని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.1
- తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టౌన్)లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ గెజిట్ ప్రతులను దహనం చేశారు. ఈ చట్టాలు కార్మికుల దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను బలహీనపరుస్తున్నాయని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు.1
- రోడ్డెక్కిన రైతన్న ఉధృతంగా మారిన ధర్నా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు: గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్‌కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి. గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.1
- మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.3
- ఆదిలాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా జనగణన-2027 ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా 'సెన్సస్ వాక్'తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ కీలకమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ప్రజలు భయం లేకుండా వివరాలు అందించి, జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం గోప్యంగా ఉంటుందని, ప్రభుత్వ అభివృద్ధి పథకాల కోసమే ఉపయోగపడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.3
- వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.1
- ఆదివారం సాయంత్రం ఆసిఫాబాద్‌లోని రాజీవ్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలిగింది, ప్రజల్లో ఆందోళన పెరిగింది. పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ను నియంత్రించగా, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.1
- బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్* * బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు కేంద్ర మంత్రి గా మీరే స్వయంగా మీ కుమారుడి పై వచ్చిన ఆరోపణలను విచారణ చేయాలని కోరాల్సింది మీ మీద కుట్ర చేస్తున్నారని , సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలి అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా..? అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి.. ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి పొరపాటు జరిగినా మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నా ఎవరి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి వివక్ష లేదు.. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగిస్తున్న.. ఇలాంటి చర్యల్లో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది మున్నూరు కాపు సంఘ నాయకులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.. ఆ అమ్మాయి కూడా మున్నూరు కాపు వార్తనికి చెందిన అమ్మాయి అని తెల్సింది.. ఇందులో ఎవరు ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడడం లేదు ముఖ్యమంత్రి డిజిపితో మాట్లాడి విచారణకు ఆదేశించారు మహిళా డీసీపీ అధికారి తో విచారణ జరుగుతుంది.. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని స్వయంగా ముఖ్యమంత్రి డీజీపీ ను ఆదేశించారు.. రాజకీయ ఒత్తిడి జరిగి విచారణలో ఎలాంటి మార్పులు ఉండవు అటువంటి సంఘటనలు జరిగి ఉంటే దోషి మీద కఠిన చర్యలు తీసుకోవడం లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఈ అంశంలో బీసీ ల అంశం తెరమీదకు తేవడం సరికాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు అడ్డుకుంటే ప్రజాస్వామ్యం గౌరవించదు ఇలాంటి సంఘటనలు జరిగినపుడు మన వ్యక్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మనమే విచారణకు ఆదేశించాలి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిగి దోషులు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నా.1
- ఆదిలాబాద్‌లో ఓ నేత తమ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రకటించారు, జెండాను పడనివ్వనని శపథం చేశారు. కష్టాలెదురైనా తలెత్తుకునే పనిచేస్తానని, తలవంచే పని చేయనని ధీమా వ్యక్తం చేస్తూ, ఈ ధర్మయుద్ధంలో తమ వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.1