ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు* *షాద్ నగర్ స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు* *రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ* *శిక్షణ తరగతులకు హాజరైన చైర్మన్ బసవేశ్వర్, చైర్మన్ అందేమోహన్ తదితరులు* ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, చైర్‌పర్సన్, వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పలకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ తదితర కౌన్సిలర్లు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవు తాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ఉటంకిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రజలకు ఏ విధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో, ఆ కోణంలో ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. ప్రత్యేక శిక్షణ తరగతులపై పాలకవర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విశాల, జమాల్పూర్ సంతోషి బాయ్, నడికుడ శ్రావణి, ఎస్పీ శివ, సింగపగ శిరీష, ఒగ్గు జయలక్ష్మి, ఆరిఫా బేగం, గౌస్ జానీ, పెంటయ్య, రాజు నాయక్, పినమోని గోపాల్, పిల్లి శారద, సుధీర్, బచ్చలి నరేష్, మురళీమోహన్ అప్పి, ప్యాట అశోక్, కళ్యాణ్ కార్ దిలీప్, కొప్పునూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు* *షాద్ నగర్ స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు* *రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ* *శిక్షణ తరగతులకు హాజరైన చైర్మన్ బసవేశ్వర్, చైర్మన్ అందేమోహన్ తదితరులు* ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, చైర్‌పర్సన్, వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పలకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ తదితర కౌన్సిలర్లు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ
ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవు తాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ఉటంకిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రజలకు ఏ విధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో, ఆ కోణంలో ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. ప్రత్యేక శిక్షణ తరగతులపై పాలకవర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విశాల, జమాల్పూర్ సంతోషి బాయ్, నడికుడ శ్రావణి, ఎస్పీ శివ, సింగపగ శిరీష, ఒగ్గు జయలక్ష్మి, ఆరిఫా బేగం, గౌస్ జానీ, పెంటయ్య, రాజు నాయక్, పినమోని గోపాల్, పిల్లి శారద, సుధీర్, బచ్చలి నరేష్, మురళీమోహన్ అప్పి, ప్యాట అశోక్, కళ్యాణ్ కార్ దిలీప్, కొప్పునూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
- వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.5
- Post by Bandi renu1
- కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.1
- More details to buy Watsup 8374614046 👆👆👆👆👆👆👆5
- చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.2