logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 21 ఐ 3 న్యూస్ ఫసల్‌వాదిలో వైభవంగా మహమ్మేరు దేవాలయ ఆద్యశిలాస్థాపనోత్సవం... పూజా కార్యక్రమాలలో పాల్గొన్న నీలం మధు.. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఫసల్‌వాది లోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రాంగణం నేడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని, పీఠాధిపతులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి దివ్య పర్యవేక్షణలో అత్యంత అరుదైన 'మహమ్మేరు దేవాలయ' నిర్మాణానికి ఆద్యశిలాస్థాపనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న ఈ ఉత్సవాలు వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 8:01 గంటలకు గణపతి పూజ మరియు గురుపూజతో ఉత్సవాలు అంకురార్పణ జరుపుకున్నాయి. అనంతరం భక్తులందరూ కలిసి సామూహికంగా నిర్వహించిన శతావర్తన హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ ప్రాంతమంతా భక్తి భావాన్ని నింపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుణ్యాహవాచనం, వాస్తుపూజ, నవకుంభ ఆవాహనము, పంచశిలా సంస్కారం మరియు అఘోర హోమం వంటి క్రతువులను వేద పండితులు శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ, భూమి పూజ నుండి శిఖర ప్రతిష్ఠ వరకు అత్యంత కచ్చితమైన ధర్మశాస్త్ర ప్రమాణాలతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆద్యశిలలపై భక్తులు స్వయంగా బీజాక్షరాలు లిఖించడం ద్వారా వారి వంశాభివృద్ధి జరుగుతుందని, పంచ మహాపాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన ఆకాంక్షించారు. సాయంత్రం వేళల్లో అమ్మవారి గర్భాలయ ప్రవేశం, ఆద్యశిలాస్థాపన (పంచశిలేష్టికాన్యాసం) వంటి ప్రధాన ఘట్టాలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్మాణానికి దేవాలయ స్థపతులు శ్రీ జి. సుబ్రహ్మణ్యం, ఎస్. సెంథిల్ హేమంతాచార్యులు తమ నైపుణ్యాన్ని అందిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొంటున్న నీలం మధు కు ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ మహత్తర కార్యక్రామానికి భారీగా తరలివచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నప్రసాద వితరణ తీర్థప్రసాదాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు..

2 hrs ago
user_KHADEER REPORTER
KHADEER REPORTER
Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
2 hrs ago
29ca10aa-190b-4cfa-8afc-7235a54989c9

గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 21 ఐ 3 న్యూస్ ఫసల్‌వాదిలో వైభవంగా మహమ్మేరు దేవాలయ ఆద్యశిలాస్థాపనోత్సవం... పూజా కార్యక్రమాలలో పాల్గొన్న నీలం మధు.. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఫసల్‌వాది లోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రాంగణం నేడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని, పీఠాధిపతులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి దివ్య పర్యవేక్షణలో అత్యంత అరుదైన 'మహమ్మేరు దేవాలయ' నిర్మాణానికి ఆద్యశిలాస్థాపనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న ఈ ఉత్సవాలు వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 8:01 గంటలకు గణపతి పూజ మరియు గురుపూజతో ఉత్సవాలు అంకురార్పణ జరుపుకున్నాయి. అనంతరం భక్తులందరూ కలిసి సామూహికంగా నిర్వహించిన శతావర్తన హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ ప్రాంతమంతా భక్తి భావాన్ని నింపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుణ్యాహవాచనం, వాస్తుపూజ, నవకుంభ ఆవాహనము, పంచశిలా సంస్కారం మరియు అఘోర హోమం వంటి క్రతువులను వేద పండితులు శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ, భూమి పూజ నుండి శిఖర ప్రతిష్ఠ వరకు అత్యంత కచ్చితమైన ధర్మశాస్త్ర ప్రమాణాలతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆద్యశిలలపై భక్తులు స్వయంగా బీజాక్షరాలు లిఖించడం ద్వారా వారి వంశాభివృద్ధి జరుగుతుందని, పంచ మహాపాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన ఆకాంక్షించారు. సాయంత్రం వేళల్లో అమ్మవారి గర్భాలయ ప్రవేశం, ఆద్యశిలాస్థాపన (పంచశిలేష్టికాన్యాసం) వంటి ప్రధాన ఘట్టాలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్మాణానికి దేవాలయ స్థపతులు శ్రీ జి. సుబ్రహ్మణ్యం, ఎస్. సెంథిల్ హేమంతాచార్యులు తమ నైపుణ్యాన్ని అందిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొంటున్న నీలం మధు కు ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ మహత్తర కార్యక్రామానికి భారీగా తరలివచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నప్రసాద వితరణ తీర్థప్రసాదాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు..

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు.
మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    14 hrs ago
  • .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    1
    .*ప్రెస్ రిలీజ్*
మెదక్ 20 ఏప్రిల్2026
2027 -పూర్తిగా  డిజిటల్ జనగణన కలెక్టర్
ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్  శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి  
జిల్లా కలెక్టర్ ప్రతిమా  సింగ్
2027 - డిజిటల్   జనగణన   అని 
*జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు 
కౌడిపల్లి మండలంలో  జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027  నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు.   శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని  ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    18 hrs ago
  • సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.
    1
    సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి.
రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
    1
    జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    42 min ago
  • ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నా పొన్నం ప్రభాకర్, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో బహిరంగ లేఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్-పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమ్ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం రెండు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొన్నాం కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదికగా అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు.
    1
    ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి  తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నా
పొన్నం ప్రభాకర్, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ
రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయి 
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్-పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయి 
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమ్ 
విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి 
తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని విజ్ఞప్తి 
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం 
రెండు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి 
విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య 
తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. 
తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. 
తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! 
నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. 
చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొన్నాం 
కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. 
ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. 
దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదికగా అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. 
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. 
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. 
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం.
తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. 
ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. 
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. 
ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు... వ్యక్తులతో పనిలేదు... సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా అని పిలుపునిచ్చారు.
    4
    డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై  మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు... వ్యక్తులతో పనిలేదు... సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ  హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా అని పిలుపునిచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • *ప్ర‌జావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా క‌లెక్ట‌ర్ ప్రతిమా సింగ్ ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా క‌లెక్ట‌ర్ ప్రతిమా అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో క‌లిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా *(74)* అర్జీల‌ను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు కేటాయిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
    1
    *ప్ర‌జావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* 
*జిల్లా క‌లెక్ట‌ర్ ప్రతిమా సింగ్ 
ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా క‌లెక్ట‌ర్ ప్రతిమా అధికారుల‌ను ఆదేశించారు.
సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో క‌లిసి జిల్లా కలెక్టర్  ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. 
ఈ సంద‌ర్భంగా *(74)* అర్జీల‌ను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు కేటాయిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తగిన చర్యలు  తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.   ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. 
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    19 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.