Shuru
Apke Nagar Ki App…
ఆదర్శ గ్రామం హివారే బజార్‌ను సందర్శించిన నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం Tags దేశంలోనే నెంబర్ వన్ గ్రామపంచాయతీగా పేరొందిన హివారే బజార్‌ను (మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా) ఆదివారం నందిపేట్ గ్రామ పాలక వర్గ సభ్యులు సందర్శించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కరువును జయించి దేశ ఆదర్శ గ్రామంగా మారిన తీరును పరిశీలించారు. అదే స్ఫూర్తితో నందిపేట్‌లోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చామని సర్పంచ్ ఎర్రం లింగం తెలిపారు. ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. #HivareBazar #ModelVillage
Shaikg journalist
ఆదర్శ గ్రామం హివారే బజార్‌ను సందర్శించిన నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం Tags దేశంలోనే నెంబర్ వన్ గ్రామపంచాయతీగా పేరొందిన హివారే బజార్‌ను (మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా) ఆదివారం నందిపేట్ గ్రామ పాలక వర్గ సభ్యులు సందర్శించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కరువును జయించి దేశ ఆదర్శ గ్రామంగా మారిన తీరును పరిశీలించారు. అదే స్ఫూర్తితో నందిపేట్‌లోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చామని సర్పంచ్ ఎర్రం లింగం తెలిపారు. ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. #HivareBazar #ModelVillage
More news from తెలంగాణ and nearby areas
- ఆదర్శ గ్రామం హివారే బజార్‌ను సందర్శించిన నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం Tags దేశంలోనే నెంబర్ వన్ గ్రామపంచాయతీగా పేరొందిన హివారే బజార్‌ను (మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా) ఆదివారం నందిపేట్ గ్రామ పాలక వర్గ సభ్యులు సందర్శించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కరువును జయించి దేశ ఆదర్శ గ్రామంగా మారిన తీరును పరిశీలించారు. అదే స్ఫూర్తితో నందిపేట్‌లోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చామని సర్పంచ్ ఎర్రం లింగం తెలిపారు. ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. #HivareBazar #ModelVillage1
- బాసర ఐఐఐటి అధ్యాపకుడి పై వేటు.. ఎస్సి ఎస్టి కమిషన్ ఆదేశాలతో విధుల్లో నుండి తొలగించిన చేసిన వీసీ గోవర్ధన్.. నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర త్రిబుల్ ఐటీ అధ్యాపకుల్లో లో ఆందోళన వాతావరణం... బాసర ఐఐఐటి లో కాంట్రాక్ట్ అధ్యాపకుడి పై వేటు... కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఐటీ మెంటార్ ఏ. శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్.. గడిచిన రెండేళ్లలో మూడుసార్లు బాసర త్రిబుల్ ఐటీ ని సందర్శించి సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్... కాంట్రాక్టు అధ్యాపకుడు ఏ. శ్రీధర్ పై తీవ్రస్థాయిలో ఫిర్యాదులను అందుకున్న ఎస్సి.ఎస్టి కమిషన్... గతంలో సైతం ఎన్నోసార్లు ఫిర్యాదులు అందగా తీవ్రంగా పరిగణించిన ఎస్సీ ఎస్టీ కమిషన్.. వెంటనే శ్రీధర్ ను విధుల్లో నుండి తొలగించాలని వైస్ ఛాన్స్ లర్ గోవర్ధన్ కు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్... కాంట్రాక్ట్ అధ్యాపకుడు శ్రీధర్ ను తొలగిస్తున్నట్లు సివిఆర్ న్యూస్ తో తెలిపిన కళాశాల వైస్ చాన్సలర్ గోవర్ధన్.1
- ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో మూలాన పడేసిన ఐకెపి యంత్రం ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలోని ఐకెపి యంత్రం మూడు నెలల క్రితం యాసంగి పంట తూర్పారం పట్టిన తర్వాత ఐకెపి యంత్రాన్ని సత్తెనపల్లి ఇండ్ల పక్కన పొలాలలో అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లారు ఇలా చేయడంతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్టు ఆవుతుందని రైతులు గ్రామ ప్రజలు తెలియజేశారు1
- వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయ వంతమైన "జైల్ భరో" కార్యక్రమం_ బోధన్:(ఆగస్టు 9): నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాహుల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు, కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బోధన్ పట్టణంలో రాస్తారోఖో–జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. టియుసి-ఐ, సిఐటియు, ఐఎఫ్ టి యు, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం, అఖిలభారత ఐక్య రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తదితర సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే గేట్ వద్ద రాస్తారోఖో చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టియుసి-ఐ రాష్ట్ర నాయకులు బి. మల్లేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జే. శంకర్ గౌడ్, . ఐఎఫ్ టీయు జిల్లా అధ్యక్షులు పి. వరదయ్య, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని, రైతుల పంటలకు ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పడాల శంకర్, సిహెచ్. రమేష్, బి. నాగమణి, డి. పోశెట్టి, జంగం గంగాధర్, సాగర్, దాల్ మల్కా పోశెట్టి, బి. పర్వయ్య, యు. శివ, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.4
- ఒక చంటి పాప దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న స్వామీజీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.1
- ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.2
- నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ: సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నాయకులు నల్లబెల్లి: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాన విశేషాలు: రెండున్నర దశాబ్దాల బంధం: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని నేతలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఉద్యమాలు – పోరాటాలు: కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో, అనేక పోరాటాల్లో, ఉపఎన్నికల్లో సుదర్శన్ రెడ్డితో కలిసి క్రియాశీలకంగా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. అమరమైన జ్ఞాపకాలు: పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ప్రజా సంక్షేమం కోసం ఆయన పడ్డ తపన, చేసిన పోరాటాలు, జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని కొనియాడారు.1
- నేత కార్మికుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్, డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ నాగేంద్రచారి సిరిసిల్ల పట్టణం లో నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి బీవై నగర్‌కు చెందిన కుసుమ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే వెంకటేశం ను హత్య చేసినట్లు పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ నాగేంద్ర చారి కథనం ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో విచారణ జరిపారు.దర్యాప్తులో భాగంగా కుసుమ గణేష్ పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో వెంకటేశం ను హత్య చేసినట్లు గణేష్ వెల్లడించారు. గణేష్ కు సహకరించిన మరో నలుగురిపై విచారణ జరుపుతున్నామని డిఎస్పి వివరించారు.నిందితుడి నుంచి మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లు, నైట్రాప్ (విష పదార్థం), ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్, దుస్తులు, క్యాప్, మృతుడికి సంబంధించిన పేపర్ నోట్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తులో సిరిసిల్ల పోలీసులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.4