కదిరేపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలలో VHND/ALMS, అన్నప్రాశన మరియు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహింపు 🌸👶 ఈ రోజు కదిరేపాడు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలలో ప్రతినెల 1వ తేదీన నిర్వహించే VHND/ALMS, అన్నప్రాశన కార్యక్రమంతో పాటు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీమతి మూడవత్ రాజేశ్వరి సుధాకర్ గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్వాడి టీచర్లు సుమలత గారు, కవిత గారు, ఉత్తరమ్మ గారు, కృష్ణమ్మ (పుష్యవత్తి) గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించగా, 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారులకు బాలామృతం పంపిణీ చేశారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతిరోజూ గుడ్లు, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడి, చిన్నారుల ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూడవత్ రాజేశ్వరి సుధాకర్ గారు, గ్రామ మహిళలు, అంగన్వాడి సిబ్బంది పాల్గొని చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు. అనంతరం చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చేసి, సమతుల్య పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మాతా–శిశు సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, సహకరించిన గ్రామ ప్రజలు, మహిళలు, నాయకులందరికీ గ్రామ సర్పంచ్ మూడవత్ రాజేశ్వరి సుధాకర్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
కదిరేపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలలో VHND/ALMS, అన్నప్రాశన మరియు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహింపు 🌸👶 ఈ రోజు కదిరేపాడు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలలో ప్రతినెల 1వ తేదీన నిర్వహించే VHND/ALMS, అన్నప్రాశన కార్యక్రమంతో పాటు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీమతి మూడవత్ రాజేశ్వరి సుధాకర్ గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్వాడి టీచర్లు సుమలత గారు, కవిత గారు, ఉత్తరమ్మ గారు, కృష్ణమ్మ (పుష్యవత్తి) గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించగా, 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారులకు బాలామృతం పంపిణీ చేశారు. అలాగే గర్భిణీలు,
బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతిరోజూ గుడ్లు, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడి, చిన్నారుల ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూడవత్ రాజేశ్వరి సుధాకర్ గారు, గ్రామ మహిళలు, అంగన్వాడి సిబ్బంది పాల్గొని చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు. అనంతరం చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చేసి, సమతుల్య పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మాతా–శిశు సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, సహకరించిన గ్రామ ప్రజలు, మహిళలు, నాయకులందరికీ గ్రామ సర్పంచ్ మూడవత్ రాజేశ్వరి సుధాకర్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్1
- అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.3
- ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ3
- పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.1
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను1
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం అంటూ మాట్లాడారు. ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదని కంటతడి పెట్టుకున్నారు.1
- మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1