సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా – 3,500 మందికి పైగా ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సూర్యాపేట, సెప్టెంబర్ 15. నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, కళాశాలల కరస్పాండెంట్లు, ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలను వారి వద్దకే తీసుకురావాలనే లక్ష్యంతో సింగరేణి సంస్థ, పరిశ్రమల శాఖ, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) సహకారంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ యువతలో ప్రతిభకు కొదవ లేకపోయినా, ప్రముఖ కంపెనీలను చేరుకునే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఉద్యోగాలు దక్కడం కష్టమవుతోందన్నారు. ఈ అంతరాన్ని తొలగించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీతో పాటు వివిధ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన యువతకు ఒకే వేదికపై ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలుసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాలను బట్టి ఒక్కొక్కరికి ఐదు వరకు కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో 200కు పైగా కంపెనీలు పాల్గొనగా, ఈసారి కోదాడ జాబ్ మేళాకు సుమారు 300 ప్రముఖ కంపెనీలను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు. అపోలో గ్రూప్, జీఎంఆర్, రాంకీ, మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటు సిమెంట్, తయారీ, సేవలు, ఐటీ, ఫార్మా, నిర్మాణ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక పరిశ్రమలు కూడా తప్పనిసరిగా జాబ్ మేళాలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాబ్ మేళా ద్వారా 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు సాధ్యమైనంత వరకు అదే ప్రాంగణంలో ఆఫర్ లెటర్లు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. నమోదు ద్వారా అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవ వివరాలను ముందుగానే వర్గీకరించి, కంపెనీల అవసరాలకు అనుగుణంగా అనుసంధానం చేయడం సులభమవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని నిరుద్యోగ యువతకు జాబ్ మేళా సమాచారం చేరవేసి పాల్గొనేలా చూడాలని పిలుపునిచ్చారు. జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యే అవకాశం ఉన్నందున ట్రాఫిక్, పార్కింగ్, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా, వసతి, భోజన ఏర్పాట్లపై పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని పోలీసు, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధాన వేదికకు ఇరువైపులా సుమారు 200 మీటర్ల వరకు వాహనాల రాకపోకలను నియంత్రించి, అభ్యర్థులు సులభంగా నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కోదాడ మెగా జాబ్ మేళా కేవలం ఒక్కరోజు జరిగే నియామక కార్యక్రమంగా కాకుండా, గ్రామీణ ప్రతిభను పరిశ్రమలు, విద్యాసంస్థలతో అనుసంధానించే శాశ్వత నమూనాగా నిలవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అవకాశాల వేదికను కల్పిస్తుందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలను సాధించాల్సిన బాధ్యత యువతపై ఉందని పేర్కొన్నారు. సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ కె. నరసింహతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- జిల్లాలో ప్రశాంతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి.. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ _గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచనలు.!_ ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,500 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి.. మరో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం.. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి... రాత్రి వేళల్లో మండపం వద్ద ఒక నిర్వాహకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. భక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి.. ప్రతి గణేష్ మండపానికి ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో.. దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు ప్రత్యేకంగా ఫీల్డ్‌లో పర్యటిస్తాయి.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో నిమజ్జనం తేదీ వివరాలను కూడా నమోదు చేయాలి.. నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. ల్యాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు.. గత వారం రోజులుగా పలువురికి కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాం.. ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని విజ్ఞప్తి.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్*1
- కుక్కల బెడద.. ప్రయాణికులకు ఇబ్బందులు.................... నడిగూడెం మండలంలోని గ్రామాల్లోనే కాకుండా గ్రామ శివారులోనూ వీధి కుక్కల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ మాటు వేసి నడిగూడెం మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులను వెంటాడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.1
- భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా.. మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది.. దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.. మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..1