అడవిని కాచే చెట్టులా.. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడు.. మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణం నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి బొత్స.. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి,పోతుంటాయి.. కానీ వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు శాశ్వతం అని నిరూపించే అరుదైన నాయకుడు శాసన మండలి ప్రతిపక్ష నేత,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం, పార్టీని, తనను నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకత్వ లక్షణం ఆయన సొంతం. ఈ నిజాన్ని మరోసారి రుజువు చేస్తూ, గరివిడి మండలం గెడ్డపువలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్ నేత కొనిసి కృష్ణంనాయుడు కుటుంబానికి ఆయన భరోసానిచ్చిన తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. సుదీర్ఘ అనుబంధం.. చెరగని జ్ఞాపకాలు సుమారు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నిరంతరం ప్రజల కోసం శ్రమించిన కొనిసి కృష్ణంనాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఉద్వేగానికి లోనైన బొత్స సత్యనారాయణ, తన బిజీ కార్యక్రమాలను పక్కనపెట్టి నేరుగా గెడ్డపువలస గ్రామంలోని కృష్ణంనాయుడు స్వగృహానికి చేరుకున్నారు. కృష్ణంనాయుడు భార్యను, కుమారుడు కల్యాణ్ ని మరియు కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించి, తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణంనాయుడు తో తనకున్న దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ, వ్యక్తిగత అనుబంధాన్ని బొత్స సత్యనారాయణ కంటతడితో గుర్తు చేసుకున్నారు. "పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని" ఆయన భరోసానిచ్చిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించినా, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నా.. తనను నమ్ముకుని అడుగులో అడుగు వేసిన కార్యకర్తలను, కష్టకాలంలో తనవెంట నిలిచిన నేతలను బొత్స సత్యనారాయణ ఎన్నడూ మరువలేదనేదానికి ఈ పరామర్శే సజీవ సాక్ష్యం. అధికారంలో ఉన్నా, లేకపోయినా నాయకులు, కార్యకర్తలు ఏ కష్టంలో ఉన్నా ముందుండి నడిపించే ఆయన నైజమే నేడు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టింది. ఎంతటి పెద్ద స్థాయికి ఎదిగినా నేల విడిచి సాము చేయని ఆయన మానవత్వం, సాటి నాయకుడి కుటుంబానికి ఆయన చూపిన పెద్ద మనుసు.. ప్రజల్లో, నాయకుల్లో, అభిమానుల్లో బొత్స సత్యనారాయణ పై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని రెట్టింపు చేశాయి. నేటి రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు ఉండటం మన ప్రాంతం చేసుకున్న అదృష్టమని నియోజకవర్గ ప్రజలు కోనసాగుతున్న చర్చ. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, ఎడ్ల అప్పారావు, లెంక శ్రీరాములు, శ్రీరాములు నాయుడు మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణంనాయుడుకి నివాళులర్పించారు.
అడవిని కాచే చెట్టులా.. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడు.. మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణం నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి బొత్స.. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి,పోతుంటాయి.. కానీ వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు శాశ్వతం అని నిరూపించే అరుదైన నాయకుడు శాసన మండలి ప్రతిపక్ష నేత,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం, పార్టీని, తనను నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకత్వ లక్షణం ఆయన సొంతం. ఈ నిజాన్ని మరోసారి రుజువు చేస్తూ, గరివిడి మండలం గెడ్డపువలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్ నేత కొనిసి కృష్ణంనాయుడు కుటుంబానికి ఆయన భరోసానిచ్చిన తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. సుదీర్ఘ అనుబంధం.. చెరగని జ్ఞాపకాలు సుమారు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నిరంతరం ప్రజల కోసం శ్రమించిన కొనిసి కృష్ణంనాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఉద్వేగానికి లోనైన బొత్స సత్యనారాయణ, తన బిజీ కార్యక్రమాలను పక్కనపెట్టి నేరుగా గెడ్డపువలస గ్రామంలోని కృష్ణంనాయుడు స్వగృహానికి చేరుకున్నారు. కృష్ణంనాయుడు భార్యను, కుమారుడు కల్యాణ్ ని మరియు కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించి, తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణంనాయుడు తో తనకున్న
దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ, వ్యక్తిగత అనుబంధాన్ని బొత్స సత్యనారాయణ కంటతడితో గుర్తు చేసుకున్నారు. "పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని" ఆయన భరోసానిచ్చిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించినా, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నా.. తనను నమ్ముకుని అడుగులో అడుగు వేసిన కార్యకర్తలను, కష్టకాలంలో తనవెంట నిలిచిన నేతలను బొత్స సత్యనారాయణ ఎన్నడూ మరువలేదనేదానికి ఈ పరామర్శే సజీవ సాక్ష్యం. అధికారంలో ఉన్నా, లేకపోయినా నాయకులు, కార్యకర్తలు ఏ కష్టంలో ఉన్నా ముందుండి నడిపించే ఆయన నైజమే నేడు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టింది. ఎంతటి పెద్ద స్థాయికి ఎదిగినా నేల విడిచి సాము చేయని ఆయన మానవత్వం, సాటి నాయకుడి కుటుంబానికి ఆయన చూపిన పెద్ద మనుసు.. ప్రజల్లో, నాయకుల్లో, అభిమానుల్లో బొత్స సత్యనారాయణ పై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని రెట్టింపు చేశాయి. నేటి రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు ఉండటం మన ప్రాంతం చేసుకున్న అదృష్టమని నియోజకవర్గ ప్రజలు కోనసాగుతున్న చర్చ. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, ఎడ్ల అప్పారావు, లెంక శ్రీరాములు, శ్రీరాములు నాయుడు మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణంనాయుడుకి నివాళులర్పించారు.
- విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.1
- విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.1
- చీపురుపల్లి మండలంలో బుధవారం ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన చిరుజల్లుల వర్షం ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి నారుమళ్లకు, అంతర పంటలకు ఎంతో ప్రయోజనకరమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చీపురుపల్లి మండలంలో వర్షం1
- రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.1
- బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.1
- డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు1
- శ్రీకాకుళం నగరంలో ప్లే గ్రౌండ్ గా మారిన హెలి ప్యాడ్..! శ్రీకాకుళం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాల కొరత ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఖాళీ స్థలాలు పార్కుల్ని క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నారు.అవీ చాలక ఇప్పుడు నగరంలోని డచ్ బంగ్లా సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ని సైతం క్రీడామైదానంగా తయారు చేసారు. భద్రతాపరమైన ప్రోటోకాల్ హెలి ప్యాడ్ సమీపంలో అమలులో ఉంటుంది. అయినా సంబంధిత అధికారులు గాని, క్రీడాకారులు గాని ఎవరూ పట్టించుకోవటం లేదు. నగరంలో మరిన్ని ఆట స్థలాలను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.1
- విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్.. విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.1