Shuru
Apke Nagar Ki App…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల మొక్కులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు భక్తుశ్రద్ధలతో మొక్కులను చెల్లించుకున్నారు.
Satheesh gangu
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల మొక్కులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు భక్తుశ్రద్ధలతో మొక్కులను చెల్లించుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయా గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నా పొన్నం ప్రభాకర్, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో బహిరంగ లేఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్-పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమ్ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం రెండు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొన్నాం కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదికగా అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.2
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.1
- * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట * పిల్లలను తమ పిల్లలుగా భావించాలి * గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన * అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ * ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ---------------------------------1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు భక్తుశ్రద్ధలతో మొక్కులను చెల్లించుకున్నారు.1