చింతగూడ అంగన్వాడీ కేంద్రంలో యూనిఫామ్,కోడిగుడ్ల పంపిణీ!! చింతగూడ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ సుతారి సుమలత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వం నుంచి వచ్చిన యూనిఫామ్‌లను చిన్నారులకు పంపిణీ చేయడంతో పాటు,గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం (కోడిగుడ్లు) అందజేశారు.ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక వేడుకలు నిర్వహించారు.తాటి శ్రీమత్ పటేల్ కు అక్షరాభ్యాసం,కస్తూరి వేదానిషి కి అన్నప్రాసన కార్యక్రమాలను సర్పంచ్ స్వయంగా జరిపించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించిన సర్పంచ్,స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అలసత్వం వహించకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తాటి అనిత,ఏఎన్ఎం భూక్యా రాజేశ్వరి,ఆశ కార్యకర్త కందుల స్వరూప మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చింతగూడ అంగన్వాడీ కేంద్రంలో యూనిఫామ్,కోడిగుడ్ల పంపిణీ!! చింతగూడ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ సుతారి సుమలత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వం నుంచి వచ్చిన యూనిఫామ్‌లను చిన్నారులకు పంపిణీ చేయడంతో పాటు,గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం (కోడిగుడ్లు) అందజేశారు.ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక వేడుకలు నిర్వహించారు.తాటి శ్రీమత్ పటేల్ కు అక్షరాభ్యాసం,కస్తూరి వేదానిషి కి అన్నప్రాసన కార్యక్రమాలను సర్పంచ్ స్వయంగా జరిపించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించిన సర్పంచ్,స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అలసత్వం వహించకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తాటి అనిత,ఏఎన్ఎం భూక్యా రాజేశ్వరి,ఆశ కార్యకర్త కందుల స్వరూప మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Post by Bharath Newz1
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన సందర్బంగా అధికారిక ఉత్సవాలు నిర్వహించిన్న సందర్బంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. బంజారా సమాజాన్ని ఎక్కతటి పైకి తీసుకొచ్చిన సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో అందరూ నడవాలని సమాజం కొరకు ప్రతి ఒక్కరు సమయాన్ని కేటాహించాలని బంజారాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని అన్నారు. ఈ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,ఐటీడీఎ పివో యువరాజ్ మార్మట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనిక గార్లతో కలిసి భోగ్ సమర్పించారు.1
- కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.1
- నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- Post by Bharath Newz1
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.1
- అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్ ఆర్టీఐ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.1