Shuru
Apke Nagar Ki App…
గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం జన్నారం మండల కేంద్ర శివారులోని వాగుపై ఉన్న వంతెనపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారులోని బుడగ జంగాల కాలనీ సమీపంలో ఉన్న వాగుపై రవాణా సౌకర్యార్థం వంతెనను నిర్మించారు. అయితే ఆ వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ఆ గుంతలలో వెళ్తే పడిపోయే ప్రమాదం ఉంది. ధర్మారం చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.
Gourinatha p.g
గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం జన్నారం మండల కేంద్ర శివారులోని వాగుపై ఉన్న వంతెనపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారులోని బుడగ జంగాల కాలనీ సమీపంలో ఉన్న వాగుపై రవాణా సౌకర్యార్థం వంతెనను నిర్మించారు. అయితే ఆ వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ఆ గుంతలలో వెళ్తే పడిపోయే ప్రమాదం ఉంది. ధర్మారం చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.
More news from Telangana and nearby areas
- కరీంనగర్ లో సినీ హీరోయిన్, డెమొక్రటిక్ సంఘ కోపౌండర్ రెజీనా కసాండ్రా* మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని.. సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మహిళల ఆలోచనలు విన్నట్లు వివరించారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 8 ఐ 3 న్యూస్/* *కొత్తపేట గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది* జగదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మల మహేష్ స్వతంత్ర అభ్యర్థి ఈరోజు గజ్వేల్ లోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారితోపాటు వార్డ్ మెంబర్లు ఆంజనేయులు మైపాల్ కర్ణాకర్ మహేష్ రాజు వేణు వెంకట్ స్వామి తదితరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేయడం జరిగింది అనంతరం మున్సిపాలిటీలోని కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్లు ధనరాజ్ రమేష్ లింగం సత్తయ్య రవి రాజు వెంకట్ ధర్మేందర్ ప్రశాంత్ లు కాంగ్రెస్ పార్టీని వీడి అంటే ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది వారికి గులాబీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుందన్నారు కొత్తపేట గ్రామంలో ఎన్నో రోజులుగా ఇనాం పట్టాలుగా ఉన్న భూములను కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో పట్టా భూములుగా మార్చి పట్టా పాస్ బుక్ లను నిరుపేదలకు పంచడం జరిగిందన్నారు అంతేకాకుండా గ్రామాలలో అన్ని విధాలుగా అన్ని హంగులుగా శుద్ధి చేసిన గ్రంథం కెసిఆర్ ది అన్నారు తూప్రాన్ పట్టణంలో రోడ్డు వెడల్పుతో పాటు మధ్యలో డివైడర్ బటర్ఫ్లై లైట్లు అధునాతన మున్సిపల్ భవనంతో పాటు తూప్రాన్ పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత కెసిఆర్ ది అన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం మాట్లాడుతున్నారని దేవుళ్ళపై ప్రమాణం చేస్తున్నారని తెలిపారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మూడు లక్షల కోట్ల అప్పుచేసి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఏ సంక్షేమ కార్యక్రమానికి నిధులు వినియోగించారు ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రైతులకు ఈయూరియా దొరకక , సక్రమంగా కరెంటు రానీరైతులసతమతమవుతున్నారని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టు సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇటిక్యాల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి జగదేవపూర్ మాజీ ఎంపిటిసి కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్ కనకయ్య తదితరులున్నారు1
- హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- యాదాద్రి జిల్లా.. నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే కుంభం..1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- పెద్దవాగు బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పెద్దవాగు బ్రిడ్జి పైన వాహన రద్దీ పెరగడంతో బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సుమారు 45 నిమిషాల పాటు వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అన్ని వాహనాలు ఒకేసారి రావడంతో కొన్ని వాహనాలు నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది 45 నిమిషాల తర్వాత అన్ని వాహనాలు వెళ్లిపోయాయి.1
- వరంగల్:వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2