Shuru
Apke Nagar Ki App…
వరంగల్:వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
M D Azizuddin
వరంగల్:వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.1