Shuru
Apke Nagar Ki App…
ముగిసిన జన గణన తొలి విడత శిక్షణ కార్యక్రమం ......... బెజ్జంకి బాలుర ఉన్నత పాఠశాలలో మూడు రోజుల జనగణన శిక్షణ తొలి విడత మూడో రోజు ముగిసింది. ఈ సందర్భంగా మోడల్ ఇంటర్వ్యూ ప్రదర్శన ఆకట్టుకుంది. బి.వి. ప్రవీణ్ కుమార్ నిరక్షరాస్య కాపరిగా, పి. జ్యోతి ఎన్యూమరేటర్‌గా హాస్యరసభరితంగా నటించారు. వారి ప్రదర్శనతో శిక్షణార్థులకు ప్రాక్టికల్ అవగాహన పెరిగింది. తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి తదితరులు ప్రశంసించారు.
ప్రభాకర్
ముగిసిన జన గణన తొలి విడత శిక్షణ కార్యక్రమం ......... బెజ్జంకి బాలుర ఉన్నత పాఠశాలలో మూడు రోజుల జనగణన శిక్షణ తొలి విడత మూడో రోజు ముగిసింది. ఈ సందర్భంగా మోడల్ ఇంటర్వ్యూ ప్రదర్శన ఆకట్టుకుంది. బి.వి. ప్రవీణ్ కుమార్ నిరక్షరాస్య కాపరిగా, పి. జ్యోతి ఎన్యూమరేటర్‌గా హాస్యరసభరితంగా నటించారు. వారి ప్రదర్శనతో శిక్షణార్థులకు ప్రాక్టికల్ అవగాహన పెరిగింది. తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి తదితరులు ప్రశంసించారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలందించిన జూనియర్ అసిస్టెంట్ జన్మంచి లక్ష్మీరాజం బదిలీపై జగిత్యాల జిల్లా పెంబట్లలోని దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందజేసి, స్వామివారి శేషవస్త్రం మరియు లడ్డూ ప్రసాదాన్ని అందించారు.తదనంతరం, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ తరఫున అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి. వంశీ మోహన్ సమక్షంలో ఆలయ సిబ్బంది లక్ష్మీరాజంని కండువాతో సత్కరించి, ఆయన సుదీర్ఘ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘునందన్, ఏఈఓ శ్రవణ్ కుమార్, జయకుమారి పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, రాజు, పూజిత,శివ సాయి , మరియు ఇతరులు పాల్గొన్నారు1
- *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..* *అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..* *అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..* రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి.. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.4
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పాలి బిజెపి అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ పిలుపు దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యం దేశాభివృద్ధిలో మహిళలు ముందుకొస్తే అభివృద్ధి లో దూసుకెళ్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేలు చేస్తుందని చేస్తున్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితం అన్నారు ఆరు గ్యారెంటీలలో మహిళలకు 2500 నగదు ఏమైందన్నారు యువతకు స్కూటీలు ఇస్తానని మోసం చేశారన్నారు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని పెంచలేదన్నారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు మహిళా బిల్లు పవీగి పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మోసాలను మహిళలు గ్రహించాలన్నారు రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తే తమ సీట్లు గల్లంతయితాయని అపోహతో స్వార్థంతో బిల్లును అడ్డుకున్నారన్నారు మోడీ, ఏమిష లు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెస్తారు మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ బిల్లు పెట్టారు మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మా సీట్లను త్యాగాలు చేయడానికి సిద్ధం కాంగ్రెస్, ఇండియా కూటమిని మహిళలు చి కొడుతున్నారు రేవంత్ రెడ్డి వి కేవలం మాటలే చేతల్లో లేవు కెసిఆర్ లాగానే రేవంత్ పాలన సాగుతోంది ఆరు గ్యారెంటీ లు అమలు చేయడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలనిపిలుపుఇచ్చారు. డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ఏలాంటి సంబంధం లేదు బీజేపీ నార్త్, సౌత్ అనే బేధం లేకుండా నిదులిస్తుంది కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనుల నిధులు విడుదల అవుతున్నాయి ఓవెసి కి చెందిన ఫాతిమా కాలేజీ ని ఎందుకు కూల్చడం లేదు హైడ్రా పేదోళ్ళవే కూల్చుతున్నారు.. పెద్దలవి వదిలేస్తున్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతుందికెసిఆర్ ఫాం హౌజ్ లో కూర్చొని మందు తాగుతున్నారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కి వచ్చి కొట్లాడాలి బిఆర్ఎస్ అంటేనే భష్టు పట్టిన రాష్ట్ర సమితి ప్రగతి భవన్ పేరు తీసేసి కమిషన్ భవన్ అని పెట్టాలి ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే హైడ్రా కూల్చుతున్న భవనాల అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి వ్యవస్థ కరెక్ట్ ఉంటే బఫర్ జోన్ లల్లో ఇల్లు ఎందుకు కడుతారు ప్రభుత్వానికి మానవత్వం లేదు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తుంది ప్రజల హక్కుల కోసం పోరాడే వారి కోసం పనిచేస్తుంది ఎన్నికలకు ముందు రూ లక్ష కోట్ల స్కామ్ తీస్తా అన్నారు.. ఒక లక్ష కూడా తీయలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు . తెలంగాణ లో బిజెపి ఈ కార్య మోసపురిత సీఎం గా మిగిలిపోతారు ఈ సమావేశంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వోల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకురాలు మల్లిక మెదక్ కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్ అఖిల భరత్ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ మెదక్ జిల్లా బిజెపి కార్యదర్శి మహేశ్వరి మీడియా ఇన్చార్జి సంగీత మౌనిక లావణ్య విజయ్ పట్టణ అధ్యక్షులు నవీన్ ప్రసాద్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామంపేట కౌన్సిలర్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.1
- జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.1
- మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణా అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. విద్యుత్తు, నీరు, భూమి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ (Jan Reint Smit) ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.1
- ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారని, బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ లాంటిదని తెలిపారు. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తామని తెలిపారు. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించాలని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.1
- వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, రుద్రవరం లోని ఇన్ టెక్ వెల్ ను క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ప్రాజెక్ట్ లలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.పరిశీలనలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీర్లు అన్వర్, సుమలత, డీఈ రాము తదితరులు పాల్గొన్నారు.1
- ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు.. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి గారు ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తాం.. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు.. ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం.. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..1