logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్డుపైకి ఆర్టీసీ ఆటోలు తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఎలక్ట్రికల్ ఆటోలను తీసుకురానుంది.అందులో భాగంగా బస్సులతో పాటు ఆటో సేవలు అందించనుంది.ప్రయాణికులు బస్సు,ఆటో టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోని బస్ స్టాప్ కు,బస్సు దిగిన తర్వాత వెళ్లాల్సిన చోటుకు ఆటోలో ప్రయాణించి గమ్యానికి చేరుకోవచ్చు. మొదట హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ఆటోలను ప్రవేశపెట్టి క్రమంగా రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రంలో ప్రవేశపెట్టనున్నారు.ముందస్తుగా హైదరాబాద్ నగరం అనంతరం కరీంనగర్,వరంగల్,నిజామాబాద్ వంటి నగరాల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ అమలు చేయాలని చూస్తున్న ఆటో కనెక్టివిటి ప్రోగ్రాం లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రిసిటీస్ లకు అనుసంధానం చేయనున్నారు.

18 hrs ago
user_Devender Pasunoori
Devender Pasunoori
Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
18 hrs ago
d3e498c4-b430-4c24-be92-785600873810

ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్డుపైకి ఆర్టీసీ ఆటోలు తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఎలక్ట్రికల్ ఆటోలను తీసుకురానుంది.అందులో భాగంగా బస్సులతో పాటు ఆటో సేవలు అందించనుంది.ప్రయాణికులు బస్సు,ఆటో టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోని బస్ స్టాప్ కు,బస్సు దిగిన తర్వాత వెళ్లాల్సిన చోటుకు ఆటోలో ప్రయాణించి గమ్యానికి చేరుకోవచ్చు. మొదట హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ఆటోలను ప్రవేశపెట్టి క్రమంగా రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రంలో ప్రవేశపెట్టనున్నారు.ముందస్తుగా హైదరాబాద్ నగరం అనంతరం కరీంనగర్,వరంగల్,నిజామాబాద్ వంటి నగరాల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ అమలు చేయాలని చూస్తున్న ఆటో కనెక్టివిటి ప్రోగ్రాం లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రిసిటీస్ లకు అనుసంధానం చేయనున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
    1
    బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.
తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    22 hrs ago
  • *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 8686618664
    2
    *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 
🙏🙏🙏🙏🙏
*ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం  దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* 
*పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 
🙏🙏🙏🙏🙏
*ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం  దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* 
ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్  అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు  మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్  కోండ్ర శంకర్  తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు
*మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 8686618664
    user_గబ్బేట శ్రీనివాస్
    గబ్బేట శ్రీనివాస్
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    9 hrs ago
  • దొంగతనం కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేయబోతే సీసీటీవీలో కనిపించిన అసలు దొంగ ఎలుక! కర్ణాటక: తుమకూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఆభరణాలు కనిపించకుండా పోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఓ ఎలుక ఒక్కో ఉంగరం, చిన్న ఆభరణాలను నోటితో తీసుకెళ్లడం కనిపించింది. దీంతో ఎలుక బొరియను పరిశీలించగా 10 బంగారు ఉంగరాలు, మూడు బంగారు చైన్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని దుకాణ యాజమాన్యం తెలిపింది. మెరిసే వస్తువులను తన గూటిలోకి తీసుకెళ్లే అలవాటు వల్లే ఎలుక ఆభరణాలను తరలించినట్లు భావిస్తున్నారు.
    1
    దొంగతనం కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేయబోతే సీసీటీవీలో కనిపించిన అసలు దొంగ ఎలుక!
కర్ణాటక: తుమకూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఆభరణాలు కనిపించకుండా పోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఓ ఎలుక ఒక్కో ఉంగరం, చిన్న ఆభరణాలను నోటితో తీసుకెళ్లడం కనిపించింది.
దీంతో ఎలుక బొరియను పరిశీలించగా 10 బంగారు ఉంగరాలు, మూడు బంగారు చైన్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని దుకాణ యాజమాన్యం తెలిపింది. మెరిసే వస్తువులను తన గూటిలోకి తీసుకెళ్లే అలవాటు వల్లే ఎలుక ఆభరణాలను తరలించినట్లు భావిస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
    1
    జనసంద్రంగా మారిన నల్లబెల్లి

పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు
 దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది
 కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు
జనసంద్రంగా మారిన నల్లబెల్లి
పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు
దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది
కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
    user_Yakesh Goud Sudagani
    Yakesh Goud Sudagani
    పెద్దవంగర, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.
    4
    జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి 
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు.
ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్

నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్
నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు.. నల్లబెల్లిలో జనసంద్రం వరంగల్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతున్నారు.
    2
    పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు.. నల్లబెల్లిలో జనసంద్రం
వరంగల్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది.
కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. మహబూబాబాద్ జిల్లా జులై 31 హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 
హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. 
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. 

మహబూబాబాద్ జిల్లా జులై 31
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Yakaiah-Pushpa
    Yakaiah-Pushpa
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • అత్తారింట్లో అల్లుడు చోరీ.. ముగ్గురు అరెస్టు...తండ్రీకొడుకు యుపిలో కోర్టులో లొంగుబాటు. కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీ కేసులో ప్రధాన నిందితులు అల్లుడు మనువడేనని పోలీసులు తేల్చారు. అత్తారింట్లో అల్లుడు చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి వెంకటరమణ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి వివరాలు వెల్లడించారు. భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబ కలహాలతో కుట్రపూరితంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రజావుద్దిన్ అతని కొడుకు అజీమ్ రజాపై యూపిలో రెండు కేసులు ఉన్నాయని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పాతకేసుల్లో యూపి లోని మీరట్ కోర్టులో లొంగిపోయారని పిటి వారెంట్ పై కరీంనగర్ కు త్వరలోనే తరలించడం జరుగుతుందన్నారు. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64. 98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని మిగతాది త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. చోరీలో ఇంకా కుటుంబ సభ్యుల ప్రమేయం ఎవరిది ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
    2
    అత్తారింట్లో అల్లుడు చోరీ..
ముగ్గురు అరెస్టు...తండ్రీకొడుకు యుపిలో కోర్టులో లొంగుబాటు.
కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీ కేసులో ప్రధాన నిందితులు అల్లుడు మనువడేనని పోలీసులు తేల్చారు. అత్తారింట్లో అల్లుడు చోరీ కేసులో ముగ్గురిని  అరెస్టు చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి వెంకటరమణ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి  వివరాలు వెల్లడించారు. భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబ కలహాలతో కుట్రపూరితంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రజావుద్దిన్ అతని కొడుకు అజీమ్ రజాపై యూపిలో రెండు కేసులు ఉన్నాయని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పాతకేసుల్లో యూపి లోని మీరట్ కోర్టులో లొంగిపోయారని పిటి వారెంట్ పై కరీంనగర్ కు త్వరలోనే  తరలించడం జరుగుతుందన్నారు. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64. 98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని మిగతాది త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. చోరీలో ఇంకా కుటుంబ సభ్యుల ప్రమేయం ఎవరిది ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.