జగిత్యాల జిల్లాలో అకాల వర్షం, వడగళ్ళ వానతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్....పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వెల్లడి అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజుపల్లి గ్రామంలో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి లక్ష్మణ్ కుమార్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆకాల వర్షాలకు జగిత్యాల జిల్లాలో 6160 ఎకరాల్లో మామిడి పంట, 1029 ఎకరాల్లో వరి, 1520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వు పంటలు దెబ్బ తిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి తెలిపారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారులు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వచ్చే విధంగా అంచనాలు రూపొందించి నివేదికను పంపించాలని మంత్రి ఆదేశించారు.

- సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రామీణ ప్రజలు మూఢనమ్మకాలను తేలుతున్నారు. వరస మరణాలతో గ్రామానికి కీడు సోకిందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామస్థులు ఊరు బయట వంట వార్పుతో రోజంతా గడిపారు. గత రెండు ,మూడు నెలల నుండి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామ పురోహితున్ని సంప్రదించగా గ్రామానికి కీడు సోకిందని సెలవిచ్చాడట. ఇంకేముంది గ్రామం లో ఉన్న ప్రజలు ఒక రోజు ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్ళాలని సూచించారు. అయితే ఒక రోజు ముందు గ్రామం లో డప్పు చాటింపు చేశారు. ఈరోజు తెల్లవారుఝామున ఇండ్లకు తాళాలు వేసి కీడు వంటలకు వెళ్ళారు. ఊరు బయట వంటావార్పు తో విందు భోజనాలు ఆరగించి రోజంతా గడిపారు. సూర్యోదయాన్ని కంటే ముందే బయటికి వెళ్లిన గ్రామస్తులు సూర్యాస్తమయం అయ్యాక ఇళ్లకు చేరారు. కీడు వంటలకు వెళ్తతామని చెప్పినప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగాయని అంటున్నారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- హన్మకొండ జిల్లా కాజీపేట బాపూజీ నగర్‌లోని కారుణ్య క్లీనిక్ సమీపంలో గొలుసు దొంగతనం జరిగింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళపై బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.3
- కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం1
- 4,000 కిలోగ్రాములకు పైగా కల్తీ పేస్ట్ మరియు 6,000 కిలోగ్రాముల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హసన్ అలీ (55) అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ మరియు హెచ్-ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్పత్తి కేంద్రం అత్యంత అపరిశుభ్రంగా ఉందని నివేదించబడటంతో, దుకాణాల్లో అమ్మే పేస్ట్‌ను కొనుగోలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు••£1
- అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజుపల్లి గ్రామంలో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి లక్ష్మణ్ కుమార్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆకాల వర్షాలకు జగిత్యాల జిల్లాలో 6160 ఎకరాల్లో మామిడి పంట, 1029 ఎకరాల్లో వరి, 1520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వు పంటలు దెబ్బ తిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి తెలిపారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారులు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వచ్చే విధంగా అంచనాలు రూపొందించి నివేదికను పంపించాలని మంత్రి ఆదేశించారు.1