సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బుచ్చనెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎంజీ. రాములు హాజరయ్యారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇండ్లు, పెన్షన్లు తదితర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, సెక్రెటరీ, బీఎల్ఓలు (BLOS), బీఎల్ఏలతో (BLAS) మాట్లాడి ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లీకార్జున్ బుర్దిపాడ్ సర్పంచ్, కిషనరావుకుల్కర్నె, కిషన్ రాథోడ్, అలెగ్జాండర్, తుకారాం, లాజర్, మహేష్, పోచప్ప, నారాయణ, బోగిని లష్మిమానా, ప్రకాష్, చిన్న, తిమోతి, అశోక్, రియాజ్, రఫీ, రాంశేటీ మలేష్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బుచ్చనెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎంజీ. రాములు హాజరయ్యారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇండ్లు, పెన్షన్లు తదితర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, సెక్రెటరీ, బీఎల్ఓలు (BLOS), బీఎల్ఏలతో (BLAS) మాట్లాడి ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లీకార్జున్ బుర్దిపాడ్ సర్పంచ్, కిషనరావుకుల్కర్నె, కిషన్ రాథోడ్, అలెగ్జాండర్, తుకారాం, లాజర్, మహేష్, పోచప్ప, నారాయణ, బోగిని లష్మిమానా, ప్రకాష్, చిన్న, తిమోతి, అశోక్, రియాజ్, రఫీ, రాంశేటీ మలేష్ తదితరులు పాల్గొన్నారు.
- సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న వరుస ద్విచక్ర వాహనాల చోరీల కేసులను రామచంద్రాపురం పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం కొన్యాల్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యెర్పుల నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 8 లక్షల విలువైన 14 చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు మాస్టర్ కీ ఉపయోగించి ఈ బైక్‌లను దొంగిలించినట్లు తేలింది. ఆ తర్వాత వాటిని తక్కువ ధరలకే విక్రయించేవాడని వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి దొంగతనం చేసిన వాహనాలను కొనుగోలు చేసిన మరో ఏడుగురిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.1
- రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలకు పోలీసుల వైఫల్యమే కారణమని కేటీఆర్ గారు అన్నారు. నిందితుడికి పోక్సో (POCSO) కేసులో బెయిల్ రావడమే ఈ దారుణానికి దారితీసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాన విమర్శలు చేస్తూ, హోం మంత్రి రేవంత్ రెడ్డికి తన శాఖపై ఏమాత్రం పట్టు లేదని కేటీఆర్ గారు విమర్శించారు. దీని కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు.1
- 😋😋😋1
- గోదావరిలో కళ్ల ముందే లక్ష క్యూసెక్కుల నీరు వరదలా కిందకు పోతుంటే, అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవని చెప్పడం బుర్రతక్కువతనం అని కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం ఈ పని చేయమన్నవాళ్లు తెలివిలేనివాళ్లా అని ఆయన ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుంచే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంటే, కళ్లుండి కూడా చూడలేని రేవంత్ రెడ్డి తెలివిలేనివాడా, లేక వాస్తవాలు చూపిస్తున్న తాము తెలివిలేనివాళ్లమా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే భద్రాచలాన్ని పట్టుకొని, మేడిగడ్డ వల్లే మునిగిపోతోందని అంటున్న రేవంత్ రెడ్డికి అస్సలు బుర్రలేదని కేటీఆర్ మండిపడ్డారు. రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్లివ్వాలని అడుగుతుంటే పట్టించుకోని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లేక లుచ్చా అనాలా అని ప్రశ్నించారు. తన గురువు కోసం నీళ్లను కిందకు వదులుతున్నావా అని రైతులు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ అనాలా లేక దరిద్రుడు అనాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.1
- బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.1
- రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఇటీవల లండన్ లో మృతి చెందగా, ఆయన మృతదేహం శనివారం తన సొంత గ్రామానికి చేరుకుంది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన శ్రీకాంత్, అక్కడ ఒక వేడుక జరిగిన మరుసటి రోజే మరణించాడు. శనివారం సొంతూరుకు చేరుకున్న శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. శ్రీకాంత్ మరణం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేయడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామ శివారులోని ఎర్రగొల్ల బిక్షపతి వ్యవసాయ పొలం వద్ద ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ధ్వంసం చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రామస్తుల కథనం ప్రకారం, ఇదే ప్రాంతంలో గతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను పలుమార్లు ధ్వంసం చేయడంతో పాటు, ఒకసారి దగ్ధం చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక దుండగుల ఉద్దేశం ఏమిటనే దానిపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తుల కోసం ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు హారతులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన అమ్మవారి ప్రత్యేక మంగళహారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.1
- హైదరాబాద్ తిరుమలగిరి పరిధిలో పిల్లలలో రోజురోజుకూ పెరుగుతున్న ఫోన్, రీల్స్ పిచ్చిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లలు ప్రాణభయం లేకుండా తమ ప్రాణాలతో చెలగాటమాడుతూ రీల్స్ చేస్తున్నారని, కన్నవారు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ ఏమైపోతారోనని ఒంటిపై దెబ్బ కూడా వేయకుండా చూసుకుంటుంటే, కొందరు పిల్లలు మాత్రం ఏకంగా రైలు కింద పడుకుని ఎంతో ఎంజాయ్ చేస్తూ రీల్స్ తీస్తున్నారని వాపోయారు. ఇలాంటి పిచ్చి పనుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే వీడియో తీసే వ్యక్తికి ఏమీ కాదని, కానీ కన్న తల్లిదండ్రులు ఎంత భయంకరమైన స్థితిని అనుభవించాల్సి వస్తుందో దయచేసి ఆలకించాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఇలాంటి పిచ్చి రీల్స్ తీసే వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని, ప్రభుత్వం కఠిన శిక్షలు వేయకపోతే పిల్లలలో మార్పు రాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.1