Shuru
Apke Nagar Ki App…
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని విరమించుకోవాలి : మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ 24 ఏళ్లుగా పనిచేస్తున్న వంట కార్మికులను ఉపాధి కోల్పోయేలా చేసే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని విరమించుకోవాలని, అల్పాహారాన్ని వంట కార్మికులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2023-24లో 9 నెలల పెండింగ్ అల్పాహారం బిల్లులు, ప్రస్తుత వంట బిల్లులు వెంటనే చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు రూ.10,000 వేతనం అమలు చేయాలని కోరారు. దీక్షలో 150 మంది కార్మికులు పాల్గొన్నారు.
Mana Mulugu News
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని విరమించుకోవాలి : మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ 24 ఏళ్లుగా పనిచేస్తున్న వంట కార్మికులను ఉపాధి కోల్పోయేలా చేసే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని విరమించుకోవాలని, అల్పాహారాన్ని వంట కార్మికులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2023-24లో 9 నెలల పెండింగ్ అల్పాహారం బిల్లులు, ప్రస్తుత వంట బిల్లులు వెంటనే చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు రూ.10,000 వేతనం అమలు చేయాలని కోరారు. దీక్షలో 150 మంది కార్మికులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాలలో కిడ్నాప్ చేసి కత్తితో బెదిరించిన ఏడుగురు అరెస్టు... మూడు కార్లు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు జగిత్యాల జిల్లాలో మిస్సింగ్ కేసు, కిడ్నాప్, కత్తితో బెదిరింపుల కేసుగా మారింది. క్రిప్టోలో పెట్టుబడులు, డబ్బుల లావాదేవీల విషయంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసును ఛేదించిన జగిత్యాల పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా జగిత్యాల డిఎస్పీ పురుషోత్తం రెడ్డి సమక్షంలో అరెస్టయిన ఏడుగురిని పోలీసులు చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామానికి చెందిన మానాల మారుతిని నిందితులు కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. బాధితుడి కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి డబ్బులు చెల్లించడంతో పాటు ఇంటి రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కత్తితో బెదిరించి దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు మారుతి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కిడ్నాప్ వ్యవహారం బయటపడిందన్నారు. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనిల్‌రావు, వంశీకృష్ణ, నిఖిల్, దీక్షిత్, రహేమాన్, సాయి, జగదీశ్వర్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు.1
- ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.1
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- కరీంనగర్ లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్...యూసీఎఫ్ నుండి మరో 80 కోట్లు డంపింగ్ యార్డ్ కు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ పనులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ స్కీం నిధుల్లో భాగంగా 16 కోట్లతో చేపట్టిన డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పర్యటించారు. కరీంనగర్ లోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. 42వ డివిజన్ లోని భగత్ నగర్ మమత థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో 50 లక్షల రూపాయల Uidf నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్ 49వ డివిజన్ లోని భాగ్యనగర్ బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో 50 లక్షల యూఐడిఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ లోని పోచమ్మ కమాన్ సమీపంలో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక శ్రీ గాయత్రి అసోయేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. 13వ డివిజన్ లోని శివనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని లారెల్ (Laureal) స్కూల్ వద్ద 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కు సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మరో 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని ప్రతి డివిజన్ లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.3
- సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు,అప్రమత్తంగా విధులు నిర్వహించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో డీసీపీలు,అడిషనల్ డీసీపీ (అడ్మిన్), ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు,ఎస్‌ఐలు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా పోలీస్ స్టేషన్,డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ,చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాలు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు,పోక్సో కేసులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు,గంజాయి కేసులు,రోడ్డు ప్రమాద కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ వారీగా ఆన్‌లైన్‌లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు. నేరాల నియంత్రణకు అధికారులు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కూడా చర్చించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చోటుచేసుకునే పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలు కూడా పోలీసులకు తెలిసే విధంగా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో,ఎస్సీ,ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, యూఐ కేసులపై డీసీపీలు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వారానికోసారి సమీక్షించాలని సూచించారు. ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని,సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో కనిపించే విధంగా పోలీసింగ్, విస్తృతంగా గస్తీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలతో సంబంధాలను మరింత పెంచాలని ఆదేశించారు. మహిళలు,బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను నిర్దేశిత కాలపరిమితిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.షీ టీమ్స్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, వినాయక మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తుతో పాటు కోర్టు కేసుల పరిష్కారంపై కూడా అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసి,నేర నిర్ధారణ శాతాన్ని పెంచేందుకు డీసీపీలు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.కోర్టు కేసుల పురోగతిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను (ఎన్‌బీడబ్ల్యూ) ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ సరఫరా,రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదృశ్యమైన వ్యక్తుల కేసులను డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.ఆర్థిక నేరాల్లో నేరపూరితంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేర విభాగం పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన ప్రతి సందర్భంలో తప్పనిసరిగా కేసు నమోదు చేయాలని సూచించారు.డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని, ఫిర్యాదు నిజమని తేలితే కేసు నమోదు చేయాలని,తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్,పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డితో పాటు ఇతర సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు,ఎస్‌ఐలు పాల్గొన్నారు.1
- మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.1