Shuru
Apke Nagar Ki App…
షాద్ నగర్: కేశంపేట మండలంలో సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన కొత్తపేట రైతు వేదికలో ఆత్మ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులకు సమగ్ర వ్యవసాయ యాజమాన్యం, జీవ ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జి మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులపై అధికంగా ఆధారపడకుండా నేల ఆరోగ్యం, నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు. నేల పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువులు వినియోగించాలని తెలిపారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం, పంట మార్పిడి వంటి పద్ధతులతో నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి, వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్, ఏటీఎం రవి, బీటీఎం శీల, రైతులు పాల్గొన్నారు. అయితే రైతుల హాజరు తక్కువగా ఉండటం గమనార్హం.
S M S R R
షాద్ నగర్: కేశంపేట మండలంలో సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన కొత్తపేట రైతు వేదికలో ఆత్మ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులకు సమగ్ర వ్యవసాయ యాజమాన్యం, జీవ ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జి మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులపై అధికంగా ఆధారపడకుండా నేల ఆరోగ్యం, నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు. నేల పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువులు వినియోగించాలని తెలిపారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం, పంట మార్పిడి వంటి పద్ధతులతో నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి, వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్, ఏటీఎం రవి, బీటీఎం శీల, రైతులు పాల్గొన్నారు. అయితే రైతుల హాజరు తక్కువగా ఉండటం గమనార్హం.
More news from తెలంగాణ and nearby areas
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- జమ్మిగడ్డలో గార్డెన్ల తొలగింపునకు కాలనీ వాసుల స్వచ్ఛంద నిర్ణయం జమ్మిగడ్డ సాయిలోక్ కాలనీలో ఇరుకైన రోడ్లపై ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన గార్డెన్లతో వాహనాలు, అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాలనీ అసోసియేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఎన్. శంకర్, జనరల్ సెక్రటరీ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో గార్డెన్ల తొలగింపు డ్రైవ్ ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దల సూచనతో పలువురు తమ ఇళ్ల వద్ద గార్డెన్లను స్వచ్ఛందంగా తొలగించారు. ఇతర కాలనీలు కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1