logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ ప్రభుత్వం 'ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు' పేరుతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జగిత్యాల జిల్లా హాస్టల్స్ కన్వీనర్ మంగళపల్లి మారుతి తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. శనివారం మెట్‌పల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల వరకు పాఠశాలలను ఎత్తివేసి, ప్రతి మూడు లేదా నాలుగు మండలాలకు ఒకే తెలంగాణ పబ్లిక్ స్కూల్ లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం సీట్లను పటిష్టంగా అమలు చేయాలని ఏబీవీపీ కోరింది. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలను నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020)ను అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలు, యూనిఫారాలను బలవంతంగా విక్రయించే పద్ధతిని నిషేధించాలని మారుతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏబీవీపీ మెట్‌పల్లి నగర కార్యదర్శి కలికోట ప్రణీత్, హరీష్, ముఖేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

15 hrs ago
user_Mahammad Vaseem
Mahammad Vaseem
Milk delivery service మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
15 hrs ago
ccec4796-14c8-406b-b090-9fae53243f38

తెలంగాణ ప్రభుత్వం 'ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు' పేరుతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జగిత్యాల జిల్లా హాస్టల్స్ కన్వీనర్ మంగళపల్లి మారుతి తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. శనివారం మెట్‌పల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల వరకు పాఠశాలలను ఎత్తివేసి, ప్రతి మూడు లేదా నాలుగు మండలాలకు ఒకే తెలంగాణ పబ్లిక్ స్కూల్ లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం సీట్లను పటిష్టంగా అమలు చేయాలని ఏబీవీపీ కోరింది. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలను నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020)ను అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలు, యూనిఫారాలను బలవంతంగా విక్రయించే పద్ధతిని నిషేధించాలని మారుతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏబీవీపీ మెట్‌పల్లి నగర కార్యదర్శి కలికోట ప్రణీత్, హరీష్, ముఖేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు.

అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు.

ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    13 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.

లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    13 hrs ago
  • జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
    1
    జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.

ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • సిరిసిల్లకు చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ పి. లీలా శిరీషా, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.
    1
    సిరిసిల్లకు చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ పి. లీలా శిరీషా, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • సిరికొండ మండలంలో జూన్ 20న ప్రత్యేక విస్తృత సవరణ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా, తహసీల్దార్ ఆధ్వర్యంలో రైతు వేదికలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధులు, బాధ్యతలపై అధికారులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ ఈ సందర్భంగా సూచించారు.
    1
    సిరికొండ మండలంలో జూన్ 20న ప్రత్యేక విస్తృత సవరణ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా, తహసీల్దార్ ఆధ్వర్యంలో రైతు వేదికలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధులు, బాధ్యతలపై అధికారులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ ఈ సందర్భంగా సూచించారు.
    user_RC REDDY
    RC REDDY
    Nizamabad Rural, Telangana•
    22 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగా గురువు విష్ణు మాట్లాడుతూ, యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ తూం రాజ్ కుమార్, బీజేపీ నాయకులు పెరుక శ్రవణ్ కుమార్, తూం నారాయణ, సదాల భాస్కర్ తో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
    1
    కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా యోగా గురువు విష్ణు మాట్లాడుతూ, యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ తూం రాజ్ కుమార్, బీజేపీ నాయకులు పెరుక శ్రవణ్ కుమార్, తూం నారాయణ, సదాల భాస్కర్ తో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    43 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    13 hrs ago
  • కరీంనగర్‌-2 డిపోకు చెందిన ఒక ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది ప్రయాణికులను డ్రైవర్‌ అప్రమత్తంగా కిందకు దించడంతో ఎలాంటి పెను ప్రమాదం జరగకుండా తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కరీంనగర్‌-2 డిపోకు చెందిన ఒక ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది ప్రయాణికులను డ్రైవర్‌ అప్రమత్తంగా కిందకు దించడంతో ఎలాంటి పెను ప్రమాదం జరగకుండా తప్పింది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    17 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.