Shuru
Apke Nagar Ki App…
శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఖమ్మం నగరం ట్రంక్ రోడ్డులో గల శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించారు. ఆలయ అర్చకులు మొదటగా గణపతి పూజ నిర్వహించి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తదనంతరం అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంతో కుంకుమ పూజ నిర్వహించారు. తరువాత మహిళలందరూ అమ్మవారిని కీర్తిస్తూ గానాలాపనలు చేశారు. తదనంతరం నీరాజనం మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మాంధాత సత్య
శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఖమ్మం నగరం ట్రంక్ రోడ్డులో గల శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించారు. ఆలయ అర్చకులు మొదటగా గణపతి పూజ నిర్వహించి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తదనంతరం అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంతో కుంకుమ పూజ నిర్వహించారు. తరువాత మహిళలందరూ అమ్మవారిని కీర్తిస్తూ గానాలాపనలు చేశారు. తదనంతరం నీరాజనం మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఖమ్మం నగరం ట్రంక్ రోడ్డులో గల శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించారు. ఆలయ అర్చకులు మొదటగా గణపతి పూజ నిర్వహించి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తదనంతరం అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంతో కుంకుమ పూజ నిర్వహించారు. తరువాత మహిళలందరూ అమ్మవారిని కీర్తిస్తూ గానాలాపనలు చేశారు. తదనంతరం నీరాజనం మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- 🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?” సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.1
- రాఖీ పండుగ ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు రాఖీ పండుగ, ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు. విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులతో రహదారులు కిక్కిరిశాయి. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో అడుగు పెట్టేందుకు స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా అధికంగా కనిపించింది.1
- బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ.. పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు.. ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి 2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు.... అయితే వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు. మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని.... అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.1
- నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటార్ ద్వారా నీరు వృధా చేస్తున్న రైతన్నల నిర్లక్ష్యం పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు? పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లింగగూడెం గ్రామంలో నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటర్ ద్వారా నీరు వృధా చేస్తున్నారు పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు రోడ్డు మీద నీళ్లు వృధాగా పోతున్నాయి ఎవరూ పట్టించుకోవడం లేదు రోడ్డు మీద ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న చూస్తూ ఉండిపోతున్నారు. రోడ్డుమీద ప్రయాణించాలంటే టూ వీలర్ వాహనాలు వాహనదారులు ప్రయాణించాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీటిని వృధాగా వాడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పవు అసలే వర్షాలు లేక నానా తిప్పలు పడుతున్న రైతులు పక్క రైతులు నేల సౌకర్యం లేక నానా తిప్పలు పడుతున్నారు పరిస్థితులు ఎవరో పట్టించుకోవడం లేదని చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...1
- *ఆర్టీసీ డ్రైవర్ గా విధులలో ఉన్న తమ్ముడికి బస్సులోనే రాఖీ కట్టిన అక్క* సూర్యాపేట సిటీ ఆగస్టు 28: విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిది ఒక మహిళా ప్రయాణికురాలు. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి డ్రైవర్ అక్క స్వప్న రాఖీ కట్టింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క1
- సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి BLA సమావేశం *సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశం నిర్వహించటం జరిగింది...* తేదీ: 28-08-2026 ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులు గా : 🔹 సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు 🔹 రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు 🔹 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు 🔹 SIR ఇంచార్జ్ దైద రవీంద్ర గారు పాల్గొన్నారు.. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, AMC చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్,5 మండలాల మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు,BLAలు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు....1
- మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం. పెంపుడు కుక్కను కుటుంబసభ్యుడిగా భావిస్తూ.. పండుగకల్లా కొత్త బట్టలు కొనడమే కాదు.. ఏకంగా రాఖీ కూడా కట్టి తమ ప్రేమనుచాటుకున్నారు. ఆప్యాయతకు..అనుబంధానికి మనిషి-జంతువు అనే తేడా లేదని నిరూపించింది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను మూడేళ్ల క్రితం డాబర్ మాన్ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను తీసుకొచ్చారు. ముద్దుగా దానికి రాఖీ అని పేరు పెట్టారు.అప్పటినుండి రాఖీ ఆ ఇంట్లో పెంపుడు కుక్క కాదు.. ఆ ఇంటి బిడ్డ అయిపోయింది. శ్రీను తన ఇద్దరు పిల్లలతో సమానంగా రాఖీని అల్లారుముద్దుగా పెంచుతున్నారు.విశేషం ఏంటంటే.. ప్రతి పండుగకు తన పిల్లలకు కొత్త బట్టలు కొన్నప్పుడు రాఖీకి (కుక్కకు) కూడా స్పెషల్ గా కొత్త డ్రెస్ తీసుకొని, టైలర్ తో ప్రత్యేకంగా కుట్టించి మరీ వేస్తారు.రాఖీ పండుగ సందర్భంగా శ్రీను కుమార్తె తన సోదరులతో పాటు రాఖీని( కుక్కకి) కూడా కట్టి దానిపైతమకున్నఅభిమానాన్ని చాటుకుంది. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతోపాటు దానికి కూడా నూతన వస్త్రాలు తీసుకొని వాటిని ప్రత్యేకంగా కుట్టించి (కుక్కకి) శునకానికి వేసి జంతు ప్రేమను చాటుకుంటాడుశ్రీను.ఆ కుక్క సైతం వారి కుటుంబ సభ్యుడిగా కలిసిపోతూ అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషం.1