logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జెస్సి నగేష్ డివైఎస్ఓ రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ కార్యదర్శి బుక్ అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్ ఉత్సవా కమిటీ చైర్మన్ రాయి కంటి నాగరాజ్ మున్సిపల్ కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ మాజీ కౌన్సిలర్ రాగి వనజ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ బిక్షపతి శ్రీనివాస్ కొత్త పద్మ తూర్పుగోదావరి సుష్మ జర్నలిస్టు రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
3 hrs ago

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జెస్సి నగేష్ డివైఎస్ఓ రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ కార్యదర్శి బుక్ అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్ ఉత్సవా కమిటీ చైర్మన్ రాయి కంటి నాగరాజ్ మున్సిపల్ కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ మాజీ కౌన్సిలర్ రాగి వనజ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ బిక్షపతి శ్రీనివాస్ కొత్త పద్మ తూర్పుగోదావరి సుష్మ జర్నలిస్టు రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • *తేదీ: 25-04-2026* *జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి, కామారెడ్డి* పత్రికా ప్రకటన *జనగణన-2027: స్వీయ గణనకు అవకాశం* *26-04-2026 నుండి 10-05-2026 వరకు పోర్టల్‌లో నమోదు చేసుకోండి* *ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్* కామారెడ్డి: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియకు సంబంధించి స్వీయ గణన కార్యక్రమం తేదీ: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణన కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు. *స్వీయ గణన విధానం:* 1. ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 2. మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా అయినా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 3. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. 4. ఆ గుర్తింపు సంఖ్యను మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. 5. నమోదు చేసిన వివరాలను అవసరమైతే తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంది. "జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన సమాచారం నమోదు చేయాలి. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కలెక్టర్ కోరారు. *ముఖ్యమైన తేదీలు:* - *స్వీయ గణన:* 26-04-2026 నుండి 10-05-2026 వరకు - *గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ:* 11-05-2026 నుండి 09-06-2026 వరకు ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
    1
    *తేదీ: 25-04-2026*  
*జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి, కామారెడ్డి*  
పత్రికా ప్రకటన 
*జనగణన-2027: స్వీయ గణనకు అవకాశం*  
*26-04-2026 నుండి 10-05-2026 వరకు పోర్టల్‌లో నమోదు చేసుకోండి*  
*ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*
కామారెడ్డి: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియకు సంబంధించి స్వీయ గణన కార్యక్రమం తేదీ: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్  తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ "ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణన కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు.
*స్వీయ గణన విధానం:*
1. ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
2. మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా అయినా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
3. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది.
4. ఆ గుర్తింపు సంఖ్యను మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి.
5. నమోదు చేసిన వివరాలను అవసరమైతే తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంది.
"జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన సమాచారం నమోదు చేయాలి. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కలెక్టర్  కోరారు.
*ముఖ్యమైన తేదీలు:*
- *స్వీయ గణన:* 26-04-2026 నుండి 10-05-2026 వరకు 
- *గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ:* 11-05-2026 నుండి 09-06-2026 వరకు 
ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కలెక్టర్  విజ్ఞప్తి చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • " *ఎవరు ఈ కాన్షీరామ్ ?? కాన్షీరామ్ ఎక్కడా విన్న ఈ పేరే????నాటి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నేటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాన్షీరామ్ దాదాసాహెబ్ గురించి మాట్లాడటం ఏంటి మతలాబు బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ అగ్రకులాల పేదల ఆయనను అర్థం చేసుకునేది ఎప్పుడో* ???? 🧭 కాన్షీరామ్ వారసత్వం: ఆలోచనల అసలు సారం Kanshi Ram గారు భారతదేశంలో దళిత, బహుజన రాజకీయ చైతన్యానికి కీలక వ్యక్తి. ఆయన ప్రధానంగా చెప్పినది: “రాజకీయ శక్తి లేకుండా సామాజిక మార్పు అసాధ్యం” బహుజన వర్గాలు (SC, ST, BC, మైనారిటీలు) కలిసినప్పుడు మాత్రమే పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది అంటే ఆయన ఆలోచనల అసలు ఉద్దేశ్యం—సంఖ్యాబలం ఉన్న వర్గాలు తమ రాజకీయ హక్కులను వినియోగించుకుని స్వయం ప్రతినిధిత్వాన్ని సాధించాలి. --- 🗳️ ఇతర పార్టీలు కాన్షీరామ్ పేరు వినియోగించడం — ఎందుకు? ఈరోజుల్లో అనేక రాజకీయ పార్టీలు (ప్రాంతీయమైనా, జాతీయమైనా) Kanshi Ram గారి పేరు లేదా సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంటాయి. ఇందుకు కొన్ని కారణాలు: బహుజన ఓటు బ్యాంక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం సామాజిక న్యాయం అనే భావన ప్రజల్లో బలంగా ఉండటం చారిత్రక నాయకుల వారసత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం ఇది రాజకీయాల్లో సాధారణ వ్యూహం. కానీ పేరు చెప్పడం వేరు, ఆలోచనలను అమలు చేయడం వేరు—ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. --- ⚖️ “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” — విశ్లేషణ ఈ నినాదం భావోద్వేగంగా బలంగా ఉన్నా, కొన్ని వాస్తవాలు గమనించాలి: ✔️ సానుకూల దృష్టికోణం ఓటు హక్కు మనకున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఒకే వర్గం చైతన్యంగా ఉంటే రాజకీయ ప్రభావం పెరుగుతుంది స్వయం నాయకత్వం (self-representation) ద్వారా సమస్యలు బాగా ప్రతిబింబిస్తాయి ⚠️ సవాళ్లు సమాజం పూర్తిగా ఏకరీతి కాదు—SC, ST, BC, మైనారిటీల్లో కూడా విభజనలు ఉంటాయి కేవలం కులం లేదా వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తే విభజనలు మరింత పెరిగే ప్రమాదం మంచి పాలనకు సామర్థ్యం, విధానాలు, పారదర్శకత కూడా అవసరం—కేవలం గుర్తింపు (identity) సరిపోదు --- 🧠 ఓటర్ల బాధ్యత — భావోద్వేగం vs విశ్లేషణ ఓటు వేయడం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకూడదు. పరిశీలించాల్సిన అంశాలు: అభ్యర్థి పనితీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అవినీతి, పారదర్శకత విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో పాలసీలు --- 🔍 తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సందర్భం ఈ రెండు రాష్ట్రాల్లో: బహుజన వర్గాల సంఖ్య ఎక్కువే అయినా రాజకీయంగా వారు విభజితంగా ఉంటారు ప్రధాన పార్టీల మధ్య పోటీ కారణంగా ఓట్లు విడిపోతాయి దీని వల్ల ఏకీకృత శక్తి తగ్గుతుంది—ఇది మీ ఆవేదనలో కనిపిస్తున్న ముఖ్యాంశం. --- 🧩 ముందుకు మార్గం ఏమిటి? 1. చైతన్యం పెరగాలి – ఓటు విలువపై అవగాహన 2. విభజనలు తగ్గాలి – వర్గాల మధ్య ఐక్యత 3. నాయకత్వ నాణ్యత పెరగాలి – కేవలం గుర్తింపు కాకుండా సామర్థ్యం 4. పాలసీ ఆధారిత రాజకీయాలు – దీర్ఘకాల అభివృద్ధి కోసం --- 📝 సారాంశం మీరు చెప్పిన “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” అనే భావనలో ఒక బలమైన స్వాభిమాన సందేశం ఉంది. కానీ అది సఫలమవ్వాలంటే: ఐక్యత + అవగాహన + సమర్థ నాయకత్వం మూడూ కలిసివస్తేనే సాధ్యం.
    1
    " *ఎవరు ఈ కాన్షీరామ్ ?? కాన్షీరామ్ ఎక్కడా విన్న ఈ పేరే????నాటి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నేటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాన్షీరామ్ దాదాసాహెబ్ గురించి మాట్లాడటం ఏంటి మతలాబు బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ అగ్రకులాల పేదల ఆయనను అర్థం చేసుకునేది ఎప్పుడో* ????
🧭 కాన్షీరామ్ వారసత్వం: ఆలోచనల అసలు సారం
Kanshi Ram గారు భారతదేశంలో దళిత, బహుజన రాజకీయ చైతన్యానికి కీలక వ్యక్తి. ఆయన ప్రధానంగా చెప్పినది:
“రాజకీయ శక్తి లేకుండా సామాజిక మార్పు అసాధ్యం”
బహుజన వర్గాలు (SC, ST, BC, మైనారిటీలు) కలిసినప్పుడు మాత్రమే పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది
అంటే ఆయన ఆలోచనల అసలు ఉద్దేశ్యం—సంఖ్యాబలం ఉన్న వర్గాలు తమ రాజకీయ హక్కులను వినియోగించుకుని స్వయం ప్రతినిధిత్వాన్ని సాధించాలి.
---
🗳️ ఇతర పార్టీలు కాన్షీరామ్ పేరు వినియోగించడం — ఎందుకు?
ఈరోజుల్లో అనేక రాజకీయ పార్టీలు (ప్రాంతీయమైనా, జాతీయమైనా) Kanshi Ram గారి పేరు లేదా సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంటాయి. ఇందుకు కొన్ని కారణాలు:
బహుజన ఓటు బ్యాంక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం
సామాజిక న్యాయం అనే భావన ప్రజల్లో బలంగా ఉండటం
చారిత్రక నాయకుల వారసత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం
ఇది రాజకీయాల్లో సాధారణ వ్యూహం. కానీ పేరు చెప్పడం వేరు, ఆలోచనలను అమలు చేయడం వేరు—ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది.
---
⚖️ “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” — విశ్లేషణ
ఈ నినాదం భావోద్వేగంగా బలంగా ఉన్నా, కొన్ని వాస్తవాలు గమనించాలి:
✔️ సానుకూల దృష్టికోణం
ఓటు హక్కు మనకున్న అత్యంత శక్తివంతమైన సాధనం
ఒకే వర్గం చైతన్యంగా ఉంటే రాజకీయ ప్రభావం పెరుగుతుంది
స్వయం నాయకత్వం (self-representation) ద్వారా సమస్యలు బాగా ప్రతిబింబిస్తాయి
⚠️ సవాళ్లు
సమాజం పూర్తిగా ఏకరీతి కాదు—SC, ST, BC, మైనారిటీల్లో కూడా విభజనలు ఉంటాయి
కేవలం కులం లేదా వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తే విభజనలు మరింత పెరిగే ప్రమాదం
మంచి పాలనకు సామర్థ్యం, విధానాలు, పారదర్శకత కూడా అవసరం—కేవలం గుర్తింపు (identity) సరిపోదు
---
🧠 ఓటర్ల బాధ్యత — భావోద్వేగం vs విశ్లేషణ
ఓటు వేయడం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకూడదు. పరిశీలించాల్సిన అంశాలు:
అభ్యర్థి పనితీరు
ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు
అవినీతి, పారదర్శకత
విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో పాలసీలు
---
🔍 తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సందర్భం
ఈ రెండు రాష్ట్రాల్లో:
బహుజన వర్గాల సంఖ్య ఎక్కువే అయినా
రాజకీయంగా వారు విభజితంగా ఉంటారు
ప్రధాన పార్టీల మధ్య పోటీ కారణంగా ఓట్లు విడిపోతాయి
దీని వల్ల ఏకీకృత శక్తి తగ్గుతుంది—ఇది మీ ఆవేదనలో కనిపిస్తున్న ముఖ్యాంశం.
---
🧩 ముందుకు మార్గం ఏమిటి?
1. చైతన్యం పెరగాలి – ఓటు విలువపై అవగాహన
2. విభజనలు తగ్గాలి – వర్గాల మధ్య ఐక్యత
3. నాయకత్వ నాణ్యత పెరగాలి – కేవలం గుర్తింపు కాకుండా సామర్థ్యం
4. పాలసీ ఆధారిత రాజకీయాలు – దీర్ఘకాల అభివృద్ధి కోసం
---
📝 సారాంశం
మీరు చెప్పిన “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” అనే భావనలో ఒక బలమైన స్వాభిమాన సందేశం ఉంది. కానీ అది సఫలమవ్వాలంటే:
ఐక్యత + అవగాహన + సమర్థ నాయకత్వం
మూడూ కలిసివస్తేనే సాధ్యం.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • Post by Nagare
    3
    Post by Nagare
    user_Nagare
    Nagare
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • బీరంగూడ లో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి చేసిన వీడియో వైరల్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని బీరంగూడ లో కర్రీ షాపులో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ పై జీవన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన షట్టర్ మూసివేసి ఆసుపత్రికి తరలించారు.
    1
    బీరంగూడ లో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి చేసిన వీడియో వైరల్ 
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని బీరంగూడ లో కర్రీ షాపులో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ పై జీవన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన షట్టర్ మూసివేసి ఆసుపత్రికి తరలించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    4 hrs ago
  • *అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు 13 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక* : ఉన్నత చదువులు అభ్యసించాలనే పట్టుదల ఉన్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు కల్పిస్తున్న అవకాశాలు, వివిధ సంస్థలు అందించే ఉపకార వేతనాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. విజయ్ కుమార్ పేర్కొన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లకు కళాశాలకు చెందిన 13 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన ఒక్కో విద్యార్థినికి ఏటా రూ.30,000 చొప్పున మూడేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు డిగ్రీ ప్రవేశాల కోసం ప్రభుత్వం 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యతగా అన్ని వసతులు ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలని కోరారు. ప్రతిష్టాత్మకమైన న్యాక్ గుర్తింపు తో పాటుగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఏకైక ప్రభుత్వ కళాశాల ఇదని ఆయన స్పష్టం చేశారు. అటానమస్ హోదా వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వేగవంతమైన పరీక్షల నిర్వహణ మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు.ఇటువంటి కార్పొరేట్ సామాజిక బాధ్యత స్కాలర్‌షిప్‌లు కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే ఎక్కువగా అందుబాటులో ఉంటాయని వివరించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం మరియు క్రీడా ప్రాంగణం వంటి అన్ని వసతులతో కళాశాల విరాజిల్లుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక గొప్ప వేదిక. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ను పొందిన విద్యార్థుల వలె, మిగిలిన వారు కూడా ఇక్కడ చేరి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య అధ్యాపక బృందం మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    *అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు 13 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక* :
ఉన్నత చదువులు అభ్యసించాలనే పట్టుదల ఉన్న ఆర్థికంగా వెనుకబడిన  విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు కల్పిస్తున్న అవకాశాలు, వివిధ సంస్థలు అందించే ఉపకార వేతనాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయం ప్రతిపత్తి  డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. విజయ్ కుమార్ పేర్కొన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లకు  కళాశాలకు చెందిన 13 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన ఒక్కో విద్యార్థినికి ఏటా రూ.30,000 చొప్పున మూడేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ప్రిన్సిపాల్  మాట్లాడుతూ..ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు డిగ్రీ ప్రవేశాల కోసం ప్రభుత్వం 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యతగా అన్ని వసతులు ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలని కోరారు.
ప్రతిష్టాత్మకమైన న్యాక్  గుర్తింపు తో పాటుగా  స్వయం ప్రతిపత్తి  హోదా కలిగిన ఏకైక ప్రభుత్వ కళాశాల ఇదని ఆయన స్పష్టం చేశారు. అటానమస్ హోదా వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వేగవంతమైన పరీక్షల నిర్వహణ మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు.ఇటువంటి కార్పొరేట్ సామాజిక బాధ్యత స్కాలర్‌షిప్‌లు కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే ఎక్కువగా అందుబాటులో ఉంటాయని వివరించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం మరియు క్రీడా ప్రాంగణం వంటి అన్ని వసతులతో కళాశాల విరాజిల్లుతోందని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక గొప్ప వేదిక. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ను పొందిన విద్యార్థుల వలె, మిగిలిన వారు కూడా ఇక్కడ చేరి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య అధ్యాపక బృందం మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • *హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన......!!* * *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు* *మహాసభ సందర్భంగా ఆత్మీయ కలయికలో DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారిని సాల్వతో సత్కరించిన బిర్ల ఐలయ్య ఆలేరు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్*
    1
    *హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన......!!*
*  *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు*
*మహాసభ  సందర్భంగా ఆత్మీయ కలయికలో DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారిని సాల్వతో సత్కరించిన బిర్ల ఐలయ్య  ఆలేరు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్*
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    1
    ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.