వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖుల ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో దర్శనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖుల ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో దర్శనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
- *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*1
- మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.4
- జగిత్యాల: మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికి, పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్బంగా జగిత్యాలలో శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పొన్నాల గార్డెన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి సన్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోమారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలుస్తామని మంత్రికి జేఏసీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలను చర్చలకు పిలవలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సమ్మె చేస్తున్న కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె సమస్యను పరిష్కరించి కార్మికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారితో పాటు తాను ఆర్టీసీ కి చెందిన 24 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు సుమారు 52 రోజులు సమ్మె చేస్తే కార్మిక సంఘాలను నాటి ప్రభుత్వ పెద్దలు కనీసం చర్చలకు పిలవలేదని మంత్రి అన్నారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తామని స్వయంగా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.1
- *తేదీ: 25-04-2026* *జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి, కామారెడ్డి* పత్రికా ప్రకటన *జనగణన-2027: స్వీయ గణనకు అవకాశం* *26-04-2026 నుండి 10-05-2026 వరకు పోర్టల్‌లో నమోదు చేసుకోండి* *ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్* కామారెడ్డి: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియకు సంబంధించి స్వీయ గణన కార్యక్రమం తేదీ: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణన కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు. *స్వీయ గణన విధానం:* 1. ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 2. మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా అయినా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 3. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. 4. ఆ గుర్తింపు సంఖ్యను మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. 5. నమోదు చేసిన వివరాలను అవసరమైతే తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంది. "జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన సమాచారం నమోదు చేయాలి. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కలెక్టర్ కోరారు. *ముఖ్యమైన తేదీలు:* - *స్వీయ గణన:* 26-04-2026 నుండి 10-05-2026 వరకు - *గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ:* 11-05-2026 నుండి 09-06-2026 వరకు ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.1
- మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జెస్సి నగేష్ డివైఎస్ఓ రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ కార్యదర్శి బుక్ అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్ ఉత్సవా కమిటీ చైర్మన్ రాయి కంటి నాగరాజ్ మున్సిపల్ కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ మాజీ కౌన్సిలర్ రాగి వనజ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ బిక్షపతి శ్రీనివాస్ కొత్త పద్మ తూర్పుగోదావరి సుష్మ జర్నలిస్టు రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.1
- హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరసన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు1
- ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.1
- *తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు మరియు స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ* *నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు* *పథకం అమలు పై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు,ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం* *మంత్రి పొన్నం ప్రభాకర్* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీ తో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.... త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ,ముఖ్యమంత్రి గారికి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరా గా ఎదగడానికి ఉపయోగపడుతుంది బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుంది..2
- నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.1