logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు

7 hrs ago
user_KHADEER REPORTER
KHADEER REPORTER
Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
7 hrs ago

హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు

More news from తెలంగాణ and nearby areas
  • మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
    4
    మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి  వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
    1
    మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు
ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. 
రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    22 hrs ago
  • గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో
మాల సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.
    1
    *తేదీ: 25-04-2026*  
*పత్రికా ప్రకటన*
*కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష*  
కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి.  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్  ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు.
"ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు.
గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  మాట్లాడుతూ "ఎమ్మెల్యే  సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్  అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి,
కామారెడ్డి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
    1
    మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి  వివాహము నేడు హైదరాబాదులో  జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • *హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన......!!* * *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు* *మహాసభ సందర్భంగా ఆత్మీయ కలయికలో DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారిని సాల్వతో సత్కరించిన బిర్ల ఐలయ్య ఆలేరు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్*
    1
    *హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన......!!*
*  *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు*
*మహాసభ  సందర్భంగా ఆత్మీయ కలయికలో DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారిని సాల్వతో సత్కరించిన బిర్ల ఐలయ్య  ఆలేరు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్*
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.
    1
    నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని,
ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    1
    ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.