పంట నష్టపోయిన రైతులకు 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- కర్నూలు జిల్లా వెల్దుర్తి లో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం లోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు ఉదయం నుంచి పెట్రోల్ కోసం ఎన్నో బంకులు చుట్టూ తిరుగామని అయినా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజల్ ఎక్కడా దొరకడం లేదని పరిస్థితిని వెంటనే చక్కనిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు.1
- కామారెడ్డి ఆర్టీసీ డిపోలో కార్మికులు శనివారం సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించినందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతున్నందుకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూసిన కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్, మూర్తి, ఖదీర్, సీతారాములు, రాజేందర్ పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1
- మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, ప్రీతి రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఇటీవల ప్రధాని మోదీని, తాజాగా బీజేపీ కార్యాలయంలో తివారీని కలవడం కేవలం ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవ ఆహ్వానం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారానికి తెరపడింది.1
- కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు తల్లి కీర్తిశేషులు వేముల హన్మవ్వ ఈనెల 22వ తేదీన స్వర్గస్థులు కాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేముల రాములు ఇంటికి చేరుకుని వేముల హన్మవ్వ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...1
- తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన సమ్మె మూడు రోజులకు చేరుకొనడంతో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో స్పందించిన ప్రభుత్వం చర్చ కార్మిక చేస్త చర్చలు జరిపి సఫలం చేశారు ఆర్టీసీ కార్మికులు శనివారం ఉదయం విధుల్లో చేరి సంబరాలు జరుపుకున్నారు టపాసులు పేల్చారు జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు1
- *పల్నాడు జిల్లా నరసరావుపేట* *నరసరావుపేట మండలం యల్లమందలో పోలీసులు కార్డాన్ సెర్చ్...* *సరైన పత్రాలు లేని 42 బైకులు,కొన్ని మారనాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు...* *గ్రామంలో పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు...* *ట్రైనీ డిఎస్పి జయక్రిష్ణ ఆధ్వర్యంలో జరిగిన నిర్బంధ తనికీలు.*1
- కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో శనివారం మధ్యాహ్నం ప్రెషర్ కుక్కర్ పేలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కర్ పేలడంతో వంట చేసే లావణ్యపై వేడి పప్పు పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.1