Shuru
Apke Nagar Ki App…
గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
KHADEER REPORTER
గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
More news from తెలంగాణ and nearby areas
- మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, ప్రీతి రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఇటీవల ప్రధాని మోదీని, తాజాగా బీజేపీ కార్యాలయంలో తివారీని కలవడం కేవలం ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవ ఆహ్వానం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారానికి తెరపడింది.1
- తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు – బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్1
- గజ్వేల్,కన్యాకా పరమేశ్వరి వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర అధికారిక వేడుకగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు, నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ ఏం సీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ,కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, సిద్ది బిక్షపతి, ఏర్రం శ్రీనివాస్ పాల్గొని వారు మాట్లాడుతూ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం ద్వారా ఆర్యవైశ్యులకు ముఖ్యమంత్రి సముచిత గౌరవం కల్పించారని నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని కులాలకు, వర్గాలకు న్యాయం జరుగుతుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.4
- బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్‌కు రిమాండ్ విధించిన కూకట్‌పల్లి కోర్టు,సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న పోలీసులు1
- మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.4
- *పల్నాడు జిల్లా నరసరావుపేట* *నరసరావుపేట మండలం యల్లమందలో పోలీసులు కార్డాన్ సెర్చ్...* *సరైన పత్రాలు లేని 42 బైకులు,కొన్ని మారనాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు...* *గ్రామంలో పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు...* *ట్రైనీ డిఎస్పి జయక్రిష్ణ ఆధ్వర్యంలో జరిగిన నిర్బంధ తనికీలు.*1
- మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో ఉన్న అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భం తొలగింపు వ్యవహారం కలకలం రేపింది. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన పుట్టా దుర్గా ప్రసాద్, శృతి దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరు నెలల గర్భిణీ అయిన శృతిని, ఆమె తల్లి గర్భాన్ని తొలగించాలనే ఉద్దేశంతో అభయ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త దుర్గా ప్రసాద్ ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు.1
- సీఎం శ్రీధర్ బాబు అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్1