బద్దెనపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కేటీఆర్...సోమవారం లోగా కొనుగోలు చేపట్టకుంటే బిఆర్ఎస్ ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరిక రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.
బద్దెనపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కేటీఆర్...సోమవారం లోగా కొనుగోలు చేపట్టకుంటే బిఆర్ఎస్ ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరిక రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు
పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు
కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన
పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.
- *తెలంగాణ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ డిపో వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.* *కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, అనంతరం ఆర్టీసీ కార్మిక సోదరులకు కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచి సంబరాలు చేసినారు.* కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ "ఆర్టీసీ కార్మిక సోదరులకు ఇది చారిత్రక రోజు.. మాటలు చెప్పి మోసం చేసిన గత పాలకుల కళ్ళు తెరిపించిన రోజు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషితో నేడు ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ సాకారమయ్యాయి. ఇది కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం. దశాబ్దాలుగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్టీసీ కుటుంబాల్లో నేడు వెలుగులు నింపాం. కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్లకు ఇది చెంపపెట్టు. మా ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది అని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం ఐ ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి టి ఆర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మా గోడు విన్నారు. మా బతుకులు మార్చారు. ప్రభుత్వంలో విలీనం అంటే మాకు ఉద్యోగ భద్రత. 11% పీఆర్సీ అంటే మా పిల్లల భవిష్యత్తు. మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తాక్ అహ్మద్, కుంభాల రాజు కుమార్,వీర దేవేందర్, శ్రీరాముల రమేష్,ఇమ్రాన్, గడప శ్రీనివాస్, ఇమ్రాన్, పెంట శేఖర్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, వసీం,యూనియన్ నాయకులు టిఆర్ రెడ్డి, ఎన్ కె దాసు, లతోపాటు పలువురు యూనియన్ నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.1
- వరంగల్ జిల్లా:ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో స్థానిక పీహెచ్సీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ చంద్ర, యాదయ్య, రాజు, స్వర్ణ కుమారి, మచ్చస్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Edla Shankar1
- కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 1. విద్య: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.. 2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.. 4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 5. సామాజిక న్యాయం ..1
- కాకి చొక్కా ఒంటిపై ఉందన్నా అహంకారంతో ఒక సామాన్య సెలూన్ కార్మికుడి పై ప్రతాపం చూపించాడు ఓ పోలీస్ అధికారి, కరీంనగర్ నగరంలోని ఖాన్ పురా, ఏరియాలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది, కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఖాన్ పురా ఏరియాలో ఉన్న సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించు కోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా కూర్చో అన్నా అని పలికారు. అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై బూతులు తిడుతూ.. విచక్షణార హితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించ డం ఆ అధికారి అహం కారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్‌లో అందరూ చూ స్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్ లోని సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్‌ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీ సింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యు డైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు,స్థానికులు కోరుతున్నారు.1
- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు. బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. 5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.3
- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్ CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు3
- జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ముర్సుగడ్డ తండా రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కాసోజు సంగీత్ (15) అనే మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ బానెట్‌పై కూర్చున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.1