logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ వన్ డిపో*ఆర్టీసీ విలీనంపై హర్షం: కరీంనగర్‌లో సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం *తెలంగాణ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ డిపో వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.* *కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, అనంతరం ఆర్టీసీ కార్మిక సోదరులకు కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచి సంబరాలు చేసినారు.* కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ "ఆర్టీసీ కార్మిక సోదరులకు ఇది చారిత్రక రోజు.. మాటలు చెప్పి మోసం చేసిన గత పాలకుల కళ్ళు తెరిపించిన రోజు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషితో నేడు ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ సాకారమయ్యాయి. ఇది కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం. దశాబ్దాలుగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్టీసీ కుటుంబాల్లో నేడు వెలుగులు నింపాం. కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్లకు ఇది చెంపపెట్టు. మా ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది అని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం ఐ ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి టి ఆర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మా గోడు విన్నారు. మా బతుకులు మార్చారు. ప్రభుత్వంలో విలీనం అంటే మాకు ఉద్యోగ భద్రత. 11% పీఆర్సీ అంటే మా పిల్లల భవిష్యత్తు. మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తాక్ అహ్మద్, కుంభాల రాజు కుమార్,వీర దేవేందర్, శ్రీరాముల రమేష్,ఇమ్రాన్, గడప శ్రీనివాస్, ఇమ్రాన్, పెంట శేఖర్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, వసీం,యూనియన్ నాయకులు టిఆర్ రెడ్డి, ఎన్ కె దాసు, లతోపాటు పలువురు యూనియన్ నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

3 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
3 hrs ago

కరీంనగర్ వన్ డిపో*ఆర్టీసీ విలీనంపై హర్షం: కరీంనగర్‌లో సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం *తెలంగాణ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ డిపో వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.* *కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, అనంతరం ఆర్టీసీ కార్మిక

సోదరులకు కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచి సంబరాలు చేసినారు.* కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ "ఆర్టీసీ కార్మిక సోదరులకు ఇది చారిత్రక రోజు.. మాటలు చెప్పి మోసం చేసిన గత పాలకుల కళ్ళు తెరిపించిన రోజు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషితో నేడు ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ సాకారమయ్యాయి. ఇది కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం. దశాబ్దాలుగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్టీసీ కుటుంబాల్లో నేడు వెలుగులు నింపాం. కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్లకు ఇది చెంపపెట్టు. మా ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది అని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం ఐ ఎన్ టి యు

సి జిల్లా కార్యదర్శి టి ఆర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మా గోడు విన్నారు. మా బతుకులు మార్చారు. ప్రభుత్వంలో విలీనం అంటే మాకు ఉద్యోగ భద్రత. 11% పీఆర్సీ అంటే మా పిల్లల భవిష్యత్తు. మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తాక్ అహ్మద్, కుంభాల రాజు కుమార్,వీర దేవేందర్, శ్రీరాముల రమేష్,ఇమ్రాన్, గడప శ్రీనివాస్, ఇమ్రాన్, పెంట శేఖర్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, వసీం,యూనియన్ నాయకులు టిఆర్ రెడ్డి, ఎన్ కె దాసు, లతోపాటు పలువురు యూనియన్ నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    2
    కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు.  విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు తల్లి కీర్తిశేషులు వేముల హన్మవ్వ ఈనెల 22వ తేదీన స్వర్గస్థులు కాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేముల రాములు ఇంటికి చేరుకుని వేముల హన్మవ్వ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
    1
    కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు తల్లి కీర్తిశేషులు వేముల హన్మవ్వ ఈనెల 22వ తేదీన స్వర్గస్థులు కాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేముల రాములు ఇంటికి చేరుకుని వేముల హన్మవ్వ  చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.. 2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.. 4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 5. సామాజిక న్యాయం ..
    1
    కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. 
పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 
1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం..
2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 
3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం..
4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. 
మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 
5. సామాజిక న్యాయం ..
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • జన్నారం మండల పరిధిలోని కవ్వాల్ గ్రామంలో శనివారం ఉదయం ఒక పిచ్చి కుక్క కలకలం సృష్టించింది. ఉదయం నుండి గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ పశువులపై విచక్షణారహితంగా దాడి చేస్తోంది. ఇప్పటికే ఒక ఆవు దూడతో సహా మొత్తం ఐదు ఆవులను ఆ కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది. ​ దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను బయటకు పంపవద్దని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఆ కుక్కను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
    1
    జన్నారం మండల పరిధిలోని కవ్వాల్ గ్రామంలో శనివారం ఉదయం ఒక పిచ్చి కుక్క కలకలం సృష్టించింది. ఉదయం నుండి గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ పశువులపై విచక్షణారహితంగా దాడి చేస్తోంది. ఇప్పటికే ఒక ఆవు దూడతో సహా మొత్తం ఐదు ఆవులను ఆ కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది.
​ దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను బయటకు పంపవద్దని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఆ కుక్కను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.
    1
    *తేదీ: 25-04-2026*  
*పత్రికా ప్రకటన*
*కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష*  
కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి.  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్  ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు.
"ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు.
గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  మాట్లాడుతూ "ఎమ్మెల్యే  సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్  అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి,
కామారెడ్డి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    1
    వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్ CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    3
    అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా  శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్  మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా  కన్వీనర్ పూసాల విష్ణు   అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్  CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.
    3
    కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్  సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో  రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. 
సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.