logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా : కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సమీక్ష సమావేశం *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

కామారెడ్డి జిల్లా : కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సమీక్ష సమావేశం *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.

More news from Telangana and nearby areas
  • *పేద విద్యార్థుల ఉన్నత విద్యకై దోహదపడుతున్న ఫీజురియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది - ABVP*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP మెదక్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకై పాంప్లెంట్ విడుదల చేసి ఉద్యమ కార్యచరణను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ABVP రాష్ట్ర ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నది అని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ విద్యాసంస్థలు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ప్రభుత్వాన్ని ఈ పథకం అమలుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పదే పదే అడిగినప్పటికీ కౌంటర్ దాఖలు చేయని కారణంగా "ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది." ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నిర్ణయానికి కారణం అయింది అని అన్నారు లక్షలాది మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా, లా, మెడిసిన్ లాంటి కోర్సులు చదివి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారంటే దానికి కారణం "ఫీజు రీయింబర్స్మెంట్ పథకం" అని, ప్రతీ యేట 14 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పై ఆధార పడి చదువుకుంటున్నారు అని ఆయా కోర్సులలో ప్రభుత్వ హామీ మేరకే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అడ్మిషన్లు పొందారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ తీరుతో విద్యార్థిలోకం అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది అని వాపోయారు 10000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోవడమే కాకుండా, ఇప్పుడు మొత్తమే ఈ స్కీం కి "మంగళం"పాడాలని ప్రభుత్వం చూస్తున్నది అని అన్నారు ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఫీజురియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడానికి కృషిచేసి విద్యార్థుల లోకాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ భాను కార్యకర్తలు సాయికిరణ్,శివదత్త ,భాస్కర్, వర్షిత్,దర్శన్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    1
    *పేద విద్యార్థుల ఉన్నత విద్యకై దోహదపడుతున్న ఫీజురియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది - ABVP*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP  మెదక్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకై పాంప్లెంట్ విడుదల చేసి ఉద్యమ కార్యచరణను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ABVP రాష్ట్ర ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నది అని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ విద్యాసంస్థలు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ప్రభుత్వాన్ని ఈ పథకం అమలుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పదే పదే అడిగినప్పటికీ కౌంటర్ దాఖలు చేయని కారణంగా "ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది." ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నిర్ణయానికి కారణం అయింది అని అన్నారు లక్షలాది మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా, లా, మెడిసిన్ లాంటి కోర్సులు చదివి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారంటే దానికి కారణం "ఫీజు రీయింబర్స్మెంట్ పథకం" అని, ప్రతీ యేట 14 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పై ఆధార పడి చదువుకుంటున్నారు అని ఆయా కోర్సులలో ప్రభుత్వ హామీ మేరకే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అడ్మిషన్లు పొందారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ తీరుతో విద్యార్థిలోకం అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది అని వాపోయారు 10000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోవడమే కాకుండా, ఇప్పుడు మొత్తమే ఈ స్కీం కి "మంగళం"పాడాలని ప్రభుత్వం చూస్తున్నది అని అన్నారు ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఫీజురియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడానికి కృషిచేసి విద్యార్థుల లోకాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ భాను కార్యకర్తలు సాయికిరణ్,శివదత్త ,భాస్కర్, వర్షిత్,దర్శన్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    8 hrs ago
  • కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • కర్నూలు జిల్లా వెల్దుర్తి లో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం లోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు ఉదయం నుంచి పెట్రోల్ కోసం ఎన్నో బంకులు చుట్టూ తిరుగామని అయినా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజల్ ఎక్కడా దొరకడం లేదని పరిస్థితిని వెంటనే చక్కనిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు.
    1
    కర్నూలు జిల్లా
వెల్దుర్తి లో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం లోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో 
వాహనదారులు బారులు తీరారు  ఉదయం నుంచి పెట్రోల్ కోసం ఎన్నో బంకులు చుట్టూ తిరుగామని అయినా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజల్ ఎక్కడా దొరకడం లేదని
పరిస్థితిని వెంటనే చక్కనిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు.
    user_Sk report PRESS
    Sk report PRESS
    Local Politician మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    13 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ 
*విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    14 hrs ago
  • పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్)లో చేరదలచిన వారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజానన్ బిడ్కర్ గారిని లేదా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ గారిని సంప్రదించగలరు. మొబైల్ నంబర్లు: 9890476595, 7680092628.
    1
    పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్)లో చేరదలచిన వారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజానన్ బిడ్కర్ గారిని లేదా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ గారిని సంప్రదించగలరు.
మొబైల్ నంబర్లు: 9890476595, 7680092628.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • *అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు 13 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక* : ఉన్నత చదువులు అభ్యసించాలనే పట్టుదల ఉన్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు కల్పిస్తున్న అవకాశాలు, వివిధ సంస్థలు అందించే ఉపకార వేతనాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. విజయ్ కుమార్ పేర్కొన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లకు కళాశాలకు చెందిన 13 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన ఒక్కో విద్యార్థినికి ఏటా రూ.30,000 చొప్పున మూడేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు డిగ్రీ ప్రవేశాల కోసం ప్రభుత్వం 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యతగా అన్ని వసతులు ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలని కోరారు. ప్రతిష్టాత్మకమైన న్యాక్ గుర్తింపు తో పాటుగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఏకైక ప్రభుత్వ కళాశాల ఇదని ఆయన స్పష్టం చేశారు. అటానమస్ హోదా వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వేగవంతమైన పరీక్షల నిర్వహణ మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు.ఇటువంటి కార్పొరేట్ సామాజిక బాధ్యత స్కాలర్‌షిప్‌లు కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే ఎక్కువగా అందుబాటులో ఉంటాయని వివరించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం మరియు క్రీడా ప్రాంగణం వంటి అన్ని వసతులతో కళాశాల విరాజిల్లుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక గొప్ప వేదిక. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ను పొందిన విద్యార్థుల వలె, మిగిలిన వారు కూడా ఇక్కడ చేరి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య అధ్యాపక బృందం మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    *అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు 13 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక* :
ఉన్నత చదువులు అభ్యసించాలనే పట్టుదల ఉన్న ఆర్థికంగా వెనుకబడిన  విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు కల్పిస్తున్న అవకాశాలు, వివిధ సంస్థలు అందించే ఉపకార వేతనాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయం ప్రతిపత్తి  డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. విజయ్ కుమార్ పేర్కొన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లకు  కళాశాలకు చెందిన 13 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన ఒక్కో విద్యార్థినికి ఏటా రూ.30,000 చొప్పున మూడేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ప్రిన్సిపాల్  మాట్లాడుతూ..ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు డిగ్రీ ప్రవేశాల కోసం ప్రభుత్వం 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యతగా అన్ని వసతులు ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలని కోరారు.
ప్రతిష్టాత్మకమైన న్యాక్  గుర్తింపు తో పాటుగా  స్వయం ప్రతిపత్తి  హోదా కలిగిన ఏకైక ప్రభుత్వ కళాశాల ఇదని ఆయన స్పష్టం చేశారు. అటానమస్ హోదా వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వేగవంతమైన పరీక్షల నిర్వహణ మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు.ఇటువంటి కార్పొరేట్ సామాజిక బాధ్యత స్కాలర్‌షిప్‌లు కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే ఎక్కువగా అందుబాటులో ఉంటాయని వివరించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం మరియు క్రీడా ప్రాంగణం వంటి అన్ని వసతులతో కళాశాల విరాజిల్లుతోందని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక గొప్ప వేదిక. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ను పొందిన విద్యార్థుల వలె, మిగిలిన వారు కూడా ఇక్కడ చేరి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య అధ్యాపక బృందం మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన సమ్మె మూడు రోజులకు చేరుకొనడంతో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో స్పందించిన ప్రభుత్వం చర్చ కార్మిక చేస్త చర్చలు జరిపి సఫలం చేశారు ఆర్టీసీ కార్మికులు శనివారం ఉదయం విధుల్లో చేరి సంబరాలు జరుపుకున్నారు టపాసులు పేల్చారు జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు
    1
    తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన సమ్మె మూడు రోజులకు చేరుకొనడంతో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో స్పందించిన ప్రభుత్వం చర్చ కార్మిక చేస్త చర్చలు జరిపి సఫలం చేశారు ఆర్టీసీ కార్మికులు శనివారం ఉదయం విధుల్లో చేరి సంబరాలు జరుపుకున్నారు టపాసులు పేల్చారు జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    13 hrs ago
  • రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 
మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.